నేటి రాశి ఫలాలు: ఈ రాశుల వారికి అదృష్టం.. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాల గమనం ద్వాదశ రాశుల జీవితాలపై ప్రభావం చూపుతుందని విశ్వసిస్తారు. శనివారం హనుమంతుడిని, శనిదేవుడిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు. నేటి రాశిఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాలు, కుటుంబం, ప్రేమ జీవితంలో అనుకూల ఫలితాలు కనిపించవచ్చు. 

Published on: Oct 17, 2026, 04:00:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాలు మరియు నక్షత్రాల గమనం మారుతుంటుంది. ఈ మార్పు అన్ని రాశుల వారి జీవితాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. కొందరికి కెరీర్ పరంగా గొప్ప విజయాలు దక్కితే, మరికొందరికి కొత్త బాధ్యతలు లేదా ఆర్థికపరమైన సవాళ్లు ఎదురుకావచ్చు.

నేటి రాశి ఫలాలు: ఈ రాశుల వారికి అదృష్టం.. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు! (AI)
నేటి రాశి ఫలాలు: ఈ రాశుల వారికి అదృష్టం.. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు! (AI)

శనివారం నాడు హనుమంతుడిని, శనిదేవుడిని పూజించడం ద్వారా ఆశించిన ఫలితాలు సాధించవచ్చని పండితులు చెబుతున్నారు. మేष రాశి నుంచి మీన రాశి వరకు నేటి జాతక విశేషాలు ఇక్కడ ఉన్నాయి.

మేష రాశి

ప్రొఫెషనల్ లైఫ్‌లో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారులు మీ పనితీరును ప్రశంసిస్తారు. కుటుంబంలో నెలకొన్న సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ట్రిప్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. భౌతిక సుఖాలు పెరుగుతాయి. ప్రేమ జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. భాగస్వామితో నాణ్యమైన సమయం గడుపుతారు. ఆరోగ్యం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది.

వృషభ రాశి

ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దానధర్మ కార్యాల్లో పాల్గొనేందుకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్లాన్ చేస్తారు. అయితే ప్రేమ జీవితంలో కొన్ని చిన్నపాటి సమస్యలు రావచ్చు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం.

మిథున రాశి

ఈ రోజు మీకు ఒడుదొడుకులు ఎదురుకావచ్చు. ఉద్యోగ రంగంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. రోజూ వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించండి. మీ ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు ఉండేలా చూసుకోండి. ప్రేమ జీవితంలో మనస్పర్థలు రాకుండా చూసుకోవడం మంచిది. అనవసర ఖర్చులను అకట్టులో ఉంచుకోండి.

కర్కాటక రాశి

ఈ రాశి వారు ఈ రోజు ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో ఏవైనా వివాదాలు ఉంటే వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోండి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. గతంలో చేసిన తప్పులను మళ్లీ పునరావృతం చేయకండి. మీ కెరీర్ లక్ష్యాలపై మాత్రమే దృష్టి పెట్టండి. రిలేషన్‌షిప్‌లో సమస్యలు వస్తే చర్చల ద్వారా పరిష్కరించుకోండి. ప్రస్తుతానికి ఎటువంటి పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.

సింహ రాశి

ఈ రోజు మీకు సాధారణంగా గడుస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. భవిష్యత్తు గురించి ఆలోచించి కొద్దిగా ఆందోళన చెందుతారు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి. వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలను అధిగమించడానికి కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి. మీ మాటతీరుపై నియంత్రణ అవసరం.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. మంచి పనులకు, దాన ధర్నాలకు ఈ రోజు శ్రీకారం చుట్టవచ్చు. దైవ కార్యాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో నూతన లాభాలు అందుకునే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల్లో ఇబ్బందులు ఎదురైనా సంయమనంతో వ్యవహరించండి. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా చదవాలి.

తులా రాశి

ఈ రోజు మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో తలెత్తే విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోండి. తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని తెస్తాయి. మీ కెరీర్ గోల్స్ మీదే మీ పూర్తి ఫోకస్ ఉండాలి. భాగస్వామితో బంధాన్ని బలపరుచుకోవడానికి మనస్పూర్తిగా మాట్లాడండి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి ఖర్చులను తగ్గించుకోండి.

వృశ్చిక రాశి

ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతారు. మీ సౌకర్యాలు మెరుగవుతాయి. లవ్ లైఫ్ చాలా రొమాంటిక్‌గా మారుతుంది. భాగస్వామితో కలిసి బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

ధనుస్సు రాశి

ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. ఇంట్లోని చిన్నవాళ్లు కెరీర్‌లో కొత్త విజయాలు సాధించి గర్వకారణంగా నిలుస్తారు. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఆఫీసులో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులకు చదువులో అద్భుతమైన విజయాలు దక్కుతాయి. వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతుంది.

మకర రాశి

ఈ రోజు మీరు కాస్త అప్రమత్తంగా ఉండాలి. గృహంలో తలెత్తే సమస్యలను ఓపికతో పరిష్కరించండి. ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకోండి. పాత పొరపాట్లను మళ్లీ చేయకండి. మీ లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టండి. ప్రేమ వ్యవహారాల్లో ఎదురయ్యే ఇబ్బందులను మాటలతో సర్దుబాటు చేసుకోండి. ఈ సమయంలో ఎక్కడా డబ్బులు ఇన్వెస్ట్ చేయవద్దు.

కుంభ రాశి

ఈ రోజు మీకు సవాళ్లు, విజయాలు సమానంగా ఎదురవుతాయి. ప్రొఫెషనల్ లైఫ్‌లో అడ్డంకులు వచ్చినా పట్టుదలతో అధిగమిస్తారు. ప్రయాణాలు చేసే సూచనలున్నాయి. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మంచి డైట్ ఫాలో అవ్వడం వల్ల శక్తి పుంజుకుంటారు. ప్రేమ జీవితంలో చిన్నపాటి గొడవలు రావచ్చు. బడ్జెట్ చూసుకుని ఖర్చు చేయండి.

మీన రాశి

ఈ రోజు మీకు అదృష్టకరమైన రోజుగా చెప్పవచ్చు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతి లేదా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వైవాహిక జీవితం చాలా మధురంగా మారుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More