...
...
Next Story

శుక్ర, రాహువుల మహా సంయోగం: రేపటి నుంచి నాలుగు రాశులకు ధన, వస్తు, ఆస్తి లాభాలతో పాటు ఎన్నో!

శుక్రుడి అనుగ్రహం ఉంటే విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు. రాహువుతో శుక్రుడు సంయోగం చెందబోతున్నాడు. శుక్రుడు, రాహువు కలయిక కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకురాబోతోంది. ఈ రాశుల వారికి కాసుల వర్షంతో పాటు అనేక విధాలైన లాభాలు కలుగుతాయి. మరి ఏ రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది?

Published on: Feb 5, 2026, 12:00:30 IST
Advertisement

శుక్రుడు డబ్బు, సంతోషం, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. శుక్రుడి అనుగ్రహం ఉంటే విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు. క్రూరగ్రహమైన రాహువుతో శుక్రుడు సంయోగం చెందబోతున్నాడు. శుక్రుడు, రాహువు కలయిక కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకురాబోతోంది. ఈ రాశుల వారికి కాసుల వర్షంతో పాటు అనేక విధాలైన లాభాలు కలుగుతాయి.

శుక్ర, రాహువుల మహా సంయోగం

శుక్ర, రాహువుల మహా సంయోగం (pinterest)
శుక్ర, రాహువుల మహా సంయోగం (pinterest)

ఫిబ్రవరి 6, 2026 అనగా రేపు శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే రాహువు ఆ రాశిలో సంచారం చేస్తున్నాడు. దీంతో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యం, సంబంధాల్లో కూడా మార్పులు వస్తాయి.

12 రాశుల వారిపై ఈ రెండు గ్రహాల కలయిక ప్రభావం చూపుతుంది. ఆ తర్వాత శుక్రుడు మార్చి 2న మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటివరకు కూడా ఈ రెండు గ్రహాల కలయిక ఉంటుంది. మరి ఈ గ్రహాల కలయిక ఏ రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది? ఆ అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడే తెలుసుకుందాం.

శుక్ర, రాహువుల మహా సంయోగం.. రేపటి నుంచి ఈ రాశుల వారికి ధన, వస్తు ఆస్తి లాభాలు

1.మేష రాశి

మేష రాశి వారికి ఈ గ్రహాల సంయోగం శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. రేపటి నుంచి వారికి బాగా కలిసి వస్తుంది. కష్టపడితే తగిన ఫలితాన్ని చూస్తారు. ధైర్యం పెరుగుతుంది. అయితే కాస్త ఉత్సాహంతో తప్పులు చేయకుండా జాగ్రత్త వహించడం మంచిది.

2.వృషభ రాశి

కర్కాటక రాశి వారికి శుక్ర–రాహువుల కలయిక శుభ ఫలితాలను తీసుకు వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సేవింగ్స్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతంగా కలిసి వస్తుంది. పూర్వికుల ఆస్తి తగాదాలు కూడా ఈ సమయంలో పరిష్కారమవుతాయి.

4.సింహ రాశి

సింహ రాశి వారికి ఇది గోల్డెన్ డేస్ అని చెప్పవచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. కన్ఫ్యూజన్ ఎక్కువైతే తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సాధించాలంటే షార్ట్‌కట్స్‌ను అనుసరించవద్దు. కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలను చూస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe