ఉగాదికి ముందు ఇంటికి వీటిని తీసుకు వస్తే అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు!
ఈ పరాభవ నామ సంవత్సరం బాగా కలిసి రావాలంటే ఉగాది రాక ముందు ఇంటికి వీటిని తెచ్చి పెట్టుకోండి. వీటిని ఇంటికి తెచ్చి పెట్టడం వలన ధనం కలుగుతుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంకా ఎన్నో లాభాలను పొందడానికి కూడా వీలవుతుంది. ఉగాదికి ముందు ఇంటికి తెచ్చుకోవాల్సిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మరి కొన్ని రోజుల్లో కొత్త తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. పరాభవ నామ సంవత్సరంలో విజయాలు కలగాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని అనుకుంటారు. అయితే ఈ పరాభవ నామ సంవత్సరం బాగా కలిసి రావాలంటే ఉగాది రాక ముందు ఇంటికి వీటిని తెచ్చి పెట్టుకోండి. వీటిని ఇంటికి తెచ్చి పెట్టడం వలన ధనం కలుగుతుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంకా ఎన్నో లాభాలను పొందడానికి కూడా వీలవుతుంది. ఉగాదికి ముందు ఇంటికి తెచ్చుకోవాల్సిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉగాది 2026 కి ముందే ఇంట్లోకి వీటిని తీసుకురండి.. శుభ ఫలితాలు కలుగుతాయి
మామిడి ఆకులు:
మామిడి ఆకులను తీసుకువచ్చి తోరణాలుగా చేసి ఇంటి ముఖద్వారానికి కట్టండి. మామిడి ఆకులను ఇంటికి కట్టడం వలన దుష్ట శక్తులు రావు. అలాగే సంపద కూడా పెరుగుతుంది.
వేప ఆకులు, వేప పువ్వు:
వేప ఆకులు, వేప పువ్వును ఇంటికి తెచ్చుకోండి. ఉగాది పచ్చడిలో వేప పువ్వును వాడుతాము. అలాగే వేప అన్నిటినీ స్వచ్ఛంగా మారుస్తుందని నమ్మకం.
బంగారం లేదా వెండి ఆభరణాలు:
ఉగాదికి బంగారం లేదా వెండి ఆభరణాలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తే ధనం, సంపద పెరుగుతాయి. పురాతన కాలం నుంచే చాలామంది ఈ పద్ధతిని పాటిస్తున్నారు.
కొత్త దుస్తులు:
కొత్త దుస్తులు కొత్త ప్రారంభానికి సూచనం. ఉగాదికి కొత్త దుస్తులను ధరించి పూజ చేసుకుని ఉగాది పచ్చడిని తినే సంప్రదాయం ఉంది.
తులసి మొక్క:
తులసి మొక్కను మనం లక్ష్మీదేవిగా భావిస్తాము. కొత్త తెలుగు సంవత్సరంలో తులసి మొక్కను ఇంటికి తీసుకొస్తే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఇల్లంతా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది.
తాబేలు:
లోహంతో చేసిన తాబేలును ఇంటికి తీసుకొస్తే సానుకూల శక్తి పెరుగుతుంది. దుష్ట శక్తులు ఇంట్లో నుంచి వెళ్లిపోతాయి. ప్రశాంతత, సంతోషాన్ని కూడా పొందవచ్చు.
శంఖం:
శంఖాన్ని ఇంట్లో పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక ప్రవాహాన్ని కూడా పెంచవచ్చు. దక్షిణావర్తి శంఖాన్ని ఉగాదికి ముందు ఇంటికి తెచ్చిపెట్టండి. ఇక డబ్బుకి లోటు ఉండదు. పురోగతిని కూడా చూస్తారు.
నెమలీకలు:
నెమలీకలను ఉగాదికి ముందు ఇంటికి తెచ్చిపెట్టండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది.
లాఫింగ్ బుద్ధా:
ఒక లాఫింగ్ బుద్ధాను ఇంటికి తీసుకొస్తే కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ఉగాదికి ముందు ఒక లాఫింగ్ బుద్ధను ఇంట్లో పెట్టితే డబ్బు కొరత ఉండదు.
కలశం:
రాగి లేదా ఇత్తడి చెంబును తీసుకువచ్చి, దానిలో నీళ్లు పోసి మామిడి ఆకులు వేసి కొబ్బరికాయను పెట్టి ఉంచితే శుభ ఫలితాలు కలుగుతాయి. కలశం ఇంట్లో మంచి శక్తిని తీసుకొస్తుంది. కలశం పెట్టకపోయినా చెంబులో నీళ్లు పోసి ప్రధాన ద్వారం దగ్గర పెట్టినా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.
వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాలు:
ఉగాదికి కచ్చితంగా ఒక వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసుకురండి. వినాయకుడు అడ్డంకులను తొలగిస్తాడు. లక్ష్మీదేవి సంపదను పెరిగేలా చేస్తుంది.
అరటి ఆకులు, అరటి మొక్క:
అరటి మొక్క, అరటి ఆకులు అభివృద్ధి, సంతోషం, ఆరోగ్యాన్ని సూచిస్తాయి. చాలా మంది ఉగాదికి ఇంటిని అలంకరించేటప్పుడు వీటిని వాడతారు.
ఉగాది నాడు అదృష్టం కలగాలంటే ఇవి కూడా పాటించండి
అభ్యంగన స్నానం:
నూనెతో స్నానం చేయడం ఉగాదికి చాలా శుభం. తలకు నూనె రాసుకుని, ఒంటికి కూడా నూనె రాసుకుని తలస్నానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. నువ్వుల నూనె వాడితే మరింత మంచిది.
వీటిని చూసి నిద్రలేవడం:
ఉగాది రోజు నెయ్యి, బంగారం, అద్దం మొదట చూసి నిద్రలేస్తే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. సంపద కూడా పెరుగుతుంది.
దీపారాధన:
ఉగాది రోజు శుభ్రంగా స్నానం చేసి దీపారాధన చేస్తే కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు. సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తికి దూరంగా ఉండొచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


