చిత్తా నక్షత్రంలోకి బుధుడు - ఇవాళ్టి నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టం తలుపుతట్టనున్నది!
గ్రహాల యువరాజు బుధుడు సెప్టెంబర్ 21న కుజుడికి చెందిన చిత్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అక్టోబర్ 1 వరకు కొనసాగే ఈ సంచారం వల్ల నాలుగు రాశుల వారి జాతకం మారనుంది.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు, నక్షత్ర మార్పులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా మాట్లాడే విధానం, కమ్యూనికేషన్, బుద్ధి కుశలత మరియు వ్యాపారానికి అధిపతి అయిన 'గ్రహాల యువరాజు' బుధుడి కదలికల్లో వచ్చే మార్పులు ద్వాదశ రాశుల జీవితాలపై నేరుగా ప్రభావం చూపుతాయి. బుధుడి అనుగ్రహం ఉంటే వ్యాపారంలో ఊహించని లాభాలు, ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు.

ఈ క్రమంలోనే బుధ దేవుడు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. వైదిక పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 21, 2026 రాత్రి 10:45 గంటలకు బుధుడు, అంగారకుడి (కుజుడు) యాజమాన్యంలోని 'చిత్తా నక్షత్రం'లోకి ప్రవేశించనున్నాడు. అక్టోబర్ 1వ తేదీ ఉదయం వరకు…. అంటే దాదాపు 11 రోజుల పాటు బుధుడు ఇదే నక్షత్రంలో పయనిస్తాడు. కుజ నక్షత్రంలోకి గ్రహాల యువరాజు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం తలపు తట్టనుంది. ప్రసిద్ధ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ 11 రోజుల నక్షత్ర సంచారం వల్ల ఏయే రాశుల వారికి మహర్దశ పట్టబోతోందో ఇక్కడ తెలుసుకోండి….
సింహ రాశి
కుజుడి చిత్తా నక్షత్రంలో బుధుడి సంచారం సింహ రాశి వారికి అత్యంత లాభదాయకంగా మారనుంది. ఈ కాలంలో మీ ఆదాయ మార్గాలు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కెరీర్‌లో సరికొత్త శిఖరాలను చేరుకోవడానికి ఇది అనుకూలమైన సమయం.
మిథున రాశి
బుధుడి నక్షత్ర మార్పు మిథున రాశి వారికి గోల్డెన్ పీరియడ్‌ని తీసుకువస్తోంది. ఆర్థికంగా మీ స్థితి మునుపటి కంటే చాలా బలంగా మారుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన లేదా రావాల్సిన మొండి బాకీలు వసూలై చేతికి అందుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు ఈ నక్షత్ర సంచారం అన్ని విధాలా కలసి వస్తుంది. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత పెరిగి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
మకర రాశి
మకర రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించని లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడులకు ఇది సరైన సమయం. ఇక ఇప్పటివరకు ఒంటరిగా ఉన్న యువతీ యువకుల జీవితంలోకి కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది. వివాహ యత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

