...
...
Next Story

ఈరోజు రాశి ఫలాలు: బుధ ప్రదోషం వేళ శివయ్య కటాక్షం.. ఆ రాశుల వారికి ధనయోగం!

ఏప్రిల్ 15, బుధవారం నాడు బుధ ప్రదోష వ్రతం సందర్భంగా ద్వాదశ రాశుల వారి జాతకాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. శివయ్య అనుగ్రహం వల్ల మేషం, మిథునం, కుంభ రాశుల వారికి అదృష్టం వరించనుండగా.. వృషభం, వృశ్చిక రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి.

Published on: Apr 15, 2026, 04:01:02 IST
Advertisement

ఈరోజు ఏప్రిల్ 15, బుధవారం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికల ఆధారంగా ప్రతి రోజూ మన భవిష్యత్తు మారుతూ ఉంటుంది. సాధారణంగా బుధవారం అంటే గణనాథుడిని పూజిస్తాం. మరొక విశేషం ఉంది. అదే 'బుధ ప్రదోష వ్రతం'. ప్రదోష కాలంలో పరమశివుడిని ఆరాధించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి, కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి.

నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు

ముఖ్యంగా సుఖ సంతోషాలు, సిరిసంపదల కోసం శివారాధన చేయడం ఉత్తమం. ఈ నేపథ్యంలో 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికి శుభం కలుగుతుంది? ఎవరికి సవాళ్లు ఎదురవుతాయి? అనే పూర్తి వివరాలు మీకోసం.

నేటి రాశి ఫలాలు

మేష రాశి:

ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. అయితే, మీ భావోద్వేగాలపై కొంచెం నియంత్రణ ఉంచుకోవడం మంచిది. సహనంతో వ్యవహరించండి. వ్యాపారంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు.

వృషభ రాశి:

గ్రహాల స్థితి వల్ల మనస్సు కొంచెం కలత చెందవచ్చు. ఆత్మవిశ్వాసం తగ్గడం వల్ల పనులు ఆగిపోయే అవకాశం ఉంది. ఆత్మనిగ్రహం, ఓపిక చాలా ముఖ్యం. వ్యాపారం కోసం కుటుంబం నుండి ఆర్థిక సహాయం అందే సూచనలు ఉన్నాయి.

మిథున రాశి:

నేడు మిథున రాశికి సమయం చాలా బాగుంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. మేధోపరమైన పనుల వల్ల సమాజంలో గౌరవం లభిస్తుంది. స్నేహితుల సహకారంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

కర్కాటక రాశి:

నేడు సింహ రాశి వారి మనస్సు సంతోషంగా ఉన్నప్పటికీ, ఆత్మవిశ్వాసంలో కొంత లోటు కనిపిస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల మద్దతు లభిస్తుంది. కానీ, ఉద్యోగ రీత్యా కుటుంబానికి దూరంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు.

కన్యా రాశి:

మీపై మీరు కొంచెం నియంత్రణ ఉంచుకోవాలి. సహనంగా ఉండటానికి ప్రయత్నించండి. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వ్యాపారంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది, స్నేహితుల సహకారం అందుతుంది.

తులా రాశి:

ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండవచ్చు, మనస్సు నిలకడగా ఉండదు. వ్యాపారంలో వృద్ధి కనిపిస్తుంది. లాభదాయకమైన అవకాశాలు వస్తాయి, కానీ ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి.

వృశ్చిక రాశి:

నేడు వృశ్చిక రాశి వారి మనస్సు కొంచెం ఆందోళనగా ఉండవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు పెరగవచ్చు, జీవనశైలి కొంచెం అస్తవ్యస్తంగా మారుతుంది.

ధనుస్సు రాశి:

ఆత్మవిశ్వాసంలో కొంత లోటు ఉన్నట్లు అనిపిస్తుంది, మనస్సు కాస్త ఇబ్బంది పడవచ్చు. కానీ దీని గురించి అతిగా ఆందోళన చెందకండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తండ్రి మద్దతుతో వ్యాపారంలో లాభాలు పొందుతారు.

మకర రాశి:

ఈ రోజు మీకు చాలా బాగుంటుంది. మీ ప్రేమ జీవితంలో మధురమైన క్షణాలు ఎదురవుతాయి. ఆర్థికంగా కూడా మీరు పురోగతి సాధిస్తారు. అయితే ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి.

కుంభ రాశి:

ఈ రోజు కుంభ రాశి వారు పూర్తి ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. పఠనాసక్తి పెరుగుతుంది. మిత్రుల మద్దతుతో మీ ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మర్చిపోకండి.

మీన రాశి:

మీకు సమయం చాలా అనుకూలంగా ఉంది. అయితే మీ మాట తీరు నిర్ణయాల విషయంలో ఆలోచించి అడుగు వేయండి. వివేకంతో నిర్ణయాలు తీసుకుంటేనే మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks