...
...
Next Story

డిసెంబర్ నెలలో అదృష్టం తలుపు తడుతుంది, కనక వర్షం.. ఈ రాశులకు ధనలాభం, విజయాలు!

జ్యోతిష్య అంచనాల ప్రకారం డిసెంబర్ నెలలో బుధుడు, రాహు-కేతువులు, శని, గురుడు, సూర్యుడు వంటి ప్రధాన గ్రహాల సంచార మార్పులు ద్వాదశ రాశులపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా మిథునం, తులా, వృశ్చికం, కుంభ రాశుల వారికి ఈ గ్రహాల మార్పులు అనుకూల ఫలితాలను అందించనున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Published on: Nov 12, 2026, 11:00:26 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం డిసెంబర్ నెల గ్రహాల కదలికల పరంగా అత్యంత కీలకమైనదిగా నిలిచింది. ఈ ఒక్క నెలలోనే పలు ప్రధాన గ్రహాలు తమ రాశులను మారుస్తుండటంతో పాటు ఉదయించడం, అస్తమించడం వంటివి వున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 2న బుధ సంచారంతో మొదలయ్యే ఈ గ్రహాల పరంపరలో రాహు-కేతువులు, శని, గురు మరియు సూర్యుడు తమ స్థానాలను మారుస్తున్నారు.

డిసెంబర్ నెలలో అదృష్టం తలుపు తడుతుంది, కనక వర్షం.. ఈ రాశులకు ధనలాభం, విజయాలు! (AI)
డిసెంబర్ నెలలో అదృష్టం తలుపు తడుతుంది, కనక వర్షం.. ఈ రాశులకు ధనలాభం, విజయాలు! (AI)

ఈ ఖగోళ మార్పుల ప్రభావం ద్వాదశ రాశులపై స్పష్టంగా ఉండనుంది. అయితే ఈ విశేష గ్రహ స్థితి కారణంగా కొన్ని అదృష్ట రాశుల వారికి ఈ నెల తిరుగులేని రాజయోగం పట్టనుందని జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మిథున రాశి:

మిథున రాశి వారికి డిసెంబర్ నెల సర్వవిధాలా అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి మరియు వ్యాపార రంగాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువులు, ప్రత్యర్థుల వ్యూహాలను మీరు సులభంగా తిప్పికొడతారు. పోటీ ప్రపంచంలో మీదే పైచేయి అవుతుంది.

మీ అవసరాలకు తగిన వనరులు సమకూరడంతో పాటు మీ జీవనశైలి మెరుగవుతుంది. వ్యాపారంలో ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు ఆర్జిస్తారు. కోర్టు వ్యవహారాలు లేదా లీగల్ వివాదాలలో మీకు అనుకూలమైన తీర్పు వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు తెరచుకోవడంతో సంపద పెరుగుతుంది.

తులా రాశి:

తులా రాశి వారికి ఈ మాసం అపారమైన శుభఫలితాలను తీసుకురానుంది. ప్రభుత్వ రంగం నుంచి ఊహించని స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఉన్నతాధికారుల అండదండలతో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ వేగంగా పూర్తవుతాయి.

వృశ్చిక రాశి వారికి ఈ నెల ప్రథమార్థం నుంచే సానుకూల ఫలితాలు ఎదురుచూస్తున్నాయి. ఆర్థిక పరంగా ఈ మాసం మీకు గోల్డెన్ పీరియడ్ లాంటిది. ఎక్కడో ఆగిపోయిన లేదా రావాల్సిన బాకీలు అకస్మాత్తుగా మీ చేతికి అందుతాయి.

వ్యాపారంలో నూతన భాగస్వామ్యాలు లాభసాటిగా మారుతాయి. భవిష్యత్తు కోసం మంచి పెట్టుబడి మార్గాలను ఎంచుకుంటారు. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు అత్యధిక లాభాలను అందిస్తాయి.

కుంభ రాశి:

కుంభ రాశి జాతకులకు డిసెంబర్ నెల అత్యంత అదృష్టవంతంగా మారుతుంది. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులపై సంతకాలు చేసే అద్భుతమైన అవకాశాన్ని అందుకుంటారు.

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. రాజకీయ లేదా సామాజిక రంగాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు లేదా గుర్తింపు దక్కే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా బలపడటంతో పాటు విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. శత్రువులపై సంపూర్ణ విజయం సాధించి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks