దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాము. దీపావళి నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తాము. ఆ రోజు లక్ష్మీదేవికి, కుబేరుడికి ప్రత్యేకంగా పూజలు చేసి, శుభ ఫలితాలను పొందాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాము. అయితే, దీపావళికి ముందు వచ్చేది ధన త్రయోదశి కూడా చాలా విశేషమైనది.

చాలా చోట్ల దీపావళి పండుగను ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ధన త్రయోదశి నాడు ధన్వంతరి స్వామిని, లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజిస్తాము. ధన త్రయోదశి నాడు బంగారం, వెండి, ఇత్తడి, రాగి పాత్రలు కొనుగోలు చేసే సంప్రదాయం కూడా ఉంది. ధన త్రయోదశి నాడు కొన్ని కొత్త వస్తువులను ఇంటికి తీసుకురావడం వలన సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం. అలాగే, ఆ రోజు కొన్ని వస్తువులు కొనకూడదనే సంప్రదాయం కూడా ఉంది.
ధన త్రయోదశి నాడు ఏ వస్తువులను కొనుగోలు చేయాలి? వేటిని కొనుగోలు చేయకూడదు? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే, ఈ ఏడాది ధన త్రయోదశి ఎప్పుడు వచ్చిందో కూడా చూసేద్దాం.
ధన త్రయోదశి 2026 తేదీ, సమయం
ధన త్రయోదశి ఎప్పుడు అనే కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంది. ధన త్రయోదశి ఈ సంవత్సరం నవంబర్ 6, శుక్రవారం నాడు వచ్చింది. ధన త్రయోదశి తిథి ప్రారంభం విషయానికి వస్తే, నవంబర్ 6, శుక్రవారం ఉదయం 10:30కు త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. నవంబర్ 7, శనివారం ఉదయం 10:47తో ముగుస్తుంది. ఈ లెక్కన ధన త్రయోదశిని నవంబర్ 6, శుక్రవారం నాడు జరుపుకోవాలి. ఆ రోజు ఈ వస్తువులను కొనుగోలు చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే, ఈ పొరపాట్లు కూడా చేయకుండా చూసుకోండి.
వీటిని కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు
బంగారం, వెండి: ధన త్రయోదశి నాడు బంగారం, వెండి కొనుగోలు చేయడం చాలా మంచిది. సంపద, ఐశ్వర్యానికి వీటిని ప్రత్యేకంగా భావిస్తారు.
{{/usCountry}}బంగారం, వెండి: ధన త్రయోదశి నాడు బంగారం, వెండి కొనుగోలు చేయడం చాలా మంచిది. సంపద, ఐశ్వర్యానికి వీటిని ప్రత్యేకంగా భావిస్తారు.
{{/usCountry}}ఇత్తడి, రాగి, స్టీల్ పాత్రలు: ధన త్రయోదశి నాడు ఇత్తడి, రాగి, స్టీల్ పాత్రలు కొనుగోలు చేయడం కూడా శుభ ఫలితాలను అందిస్తుంది. కొత్త పాత్రలను ఇంటికి తీసుకురావడం వలన మంచి జరుగుతుంది. వాటిని ఇంటికి తీసుకువచ్చి నీళ్లు లేదా ధాన్యాలతో నింపడం మంచిది.
చీపురు: చీపురుతో ఇంటి పరిశుభ్రత ముడిపడి ఉంటుంది. ధన త్రయోదశి నాడు చీపురును కొనుగోలు చేసే సంప్రదాయం కూడా ఉంది.
గోమతి చక్రాలు: ధన త్రయోదశి నాడు గోమతి చక్రాలను కొనుగోలు చేయడం వలన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని నమ్ముతారు. ఈ గోమతి చక్రాలు సుఖసంతోషాలు, ఐశ్వర్యానికి చిహ్నాలుగా భావిస్తారు.
ధన త్రయోదశి నాడు ఈ తప్పులు చేయొద్దు
ధన త్రయోదశి నాడు కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని నమ్ముతారు. ఆ తప్పులు ఏమిటో కూడా తెలుసుకుందాం.
ఇనుప వస్తువులు: ధన త్రయోదశి నాడు ఇనుప వస్తువులను కొనుగోలు చేయకూడదని చెబుతారు. ఇవి మంచి ఫలితాలను తీసుకురావని కొందరి నమ్మకం.
పదునైన వస్తువులు: అలాగే, ధన త్రయోదశి నాడు పదునైన వస్తువులను కొనుగోలు చేయకూడదు. అంటే కత్తులు, కత్తెరలు వంటివి కొనుగోలు చేయకూడదని సంప్రదాయం చెబుతోంది.
ఖాళీ పాత్రలు: ఖాళీ పాత్రలను ధన త్రయోదశి నాడు ఇంటికి తీసుకురావడం కూడా మంచిది కాదని భావిస్తారు.
నలుపు రంగు వస్తువులు: నలుపు రంగు వస్తువులను కూడా ధన త్రయోదశి నాడు కొనుగోలు చేయడం మంచిది కాదని కొందరు నమ్ముతారు. అవి ప్రతికూల శక్తిని, సమస్యలను తీసుకొస్తాయని భావిస్తారు.