Dhana Yogam: జూన్ 17 నుంచి ధనవర్షం! ఈ 4 రాశుల వారికి రాజయోగంతో కోట్ల అదృష్టం
జూన్ నెలలో కర్కాటక రాశిలో గురు, శుక్ర, చంద్రుల కలయిక వల్ల అత్యంత శక్తివంతమైన ధనయోగం, గజకేసరి యోగాలు ఏర్పడనున్నాయి. దీనివల్ల నాలుగు రాశుల వారికి అయాచిత ధనలాభం, వృత్తిలో తిరుగులేని విజయం లభిస్తాయి.
గ్రహాల సంచారానికి మన జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ గ్రహాల అనుకూలత కారణంగా కొన్నిసార్లు అకస్మాత్తుగా అదృష్టం వస్తుంది. గ్రహాల లెక్కల ప్రకారం జూన్ నెలలో కొన్ని అద్భుతమైన గ్రహాల కలయికలు చూడొచ్చు. గురువు, శుక్రుడు, చంద్రుడు ఒకే రాశిలో ఉండడంతో అరుదైన రాజయోగాలు కూడా రాబోతున్నాయి. ధనయోగం కూడా చాలా విశేషమైనది. ఈ యోగం కూడా త్వరలో రాబోతోంది.

ఇప్పటికే జూన్ 2న ఎంతో పవిత్రమైన హంస రాజయోగం ఏర్పడింది. అలాగే జూన్ 8న కర్కాటక రాశిలోకి శుక్రుడు అడుగుపెట్టాడు. గురు-శుక్రుల కలయికతో గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది. అలాగే జూన్ 17న చంద్రుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో గజకేసరి యోగంతో పాటు ఇంకో మూడు యోగాలు ఏర్పడతాయి. ఈ త్రిగ్రహ కూటమి వలన కర్కాటక, కన్య, తుల, మీన రాశుల వారికి భారీగా లాభాలు కలగబోతున్నాయి.
ధన యోగం
జూన్ 17న కర్కాటక రాశిలోకి చంద్రుడు అడుగుపెడతాడు. దీంతో గురువు-చంద్రుల కలయికతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. శుక్రుడు-చంద్రుల కలయికతో కళాత్మక యోగం, ఏర్పడుతుంది. గురువు, శుక్రుడు, చంద్రుల కలయికతో ధనయోగం ఏర్పడుతుంది. ధనయోగంతో ఈ రాశుల వారికి భారీగా లాభాలు, ఐశ్వర్యం, కీర్తి, ప్రతిష్టలు, కెరీర్‌లో పురోగతి కలుగుతాయి.
1.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ యోగంతో లాభాల శాతం 95 శాతంగా ఉంది. ఈ యోగం కారణంగా ఈ రాశి వారి ఆకర్షణ శక్తి ఇంకా పెరుగుతుంది. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి. వివిధ మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనేక లాభాలను చూస్తారు. ప్రమోషన్లు రావచ్చు. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది.
2.తులా రాశి
తులా రాశి వారికి లాభాల శాతం 90గా ఉంది. తులా రాశికి శుక్రుడు కారణంగా ఈ రాశి వారు ప్రయోజనాలను పొందుతారు. వృత్తిపరంగా ఈ రాశి వారికి బాగుంటుంది. ఉద్యోగులు పదోన్నతిని పొందుతారు. బాధ్యతలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ, మర్యాదలు మునుపటికంటే ఇంకా పెరుగుతాయి.
3.కన్యా రాశి
ఈ రాశి వారికి లాభాల శాతం 92గా ఉంది. ఈ రాశి వారు ఈ సమయంలో ఆర్థికపరంగా లాభాలను పొందుతారు. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. చాలా కాలంగా ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఆగిపోయిన పనులు కూడా విజయవంతం అవుతాయి. వ్యాపారస్తులకు కూడా ఇది శుభప్రదమైన సమయం.
4.మీన రాశి
ఈ రాశి వారికి లాభాల శాతం 91గా ఉంది. అన్ని రంగాల్లో విజయాలను అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. సంతానం నుంచి శుభవార్తలను వింటారు. కళలు, సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి బాగుంటుంది. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఈ సమయంలో ఈ రాశి వారు పెట్టుబడుల నుంచి భారీగా లాభాలను పొందుతారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


