Vastu: ఈ 5 వస్తువులను పొరపాటున బాత్‌రూమ్‌లో పెట్టకండి, లేదంటే తీవ్రమైన నష్టం రావచ్చు!
వాస్తు ప్రకారం పాటించడం వలన చాలా రకాల లాభాలను పొందవచ్చు. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అలాగే వాస్తు ప్రకారం పాటించినట్లయితే ఏ ఇబ్బంది రాదు. బాత్రూం కి సంబంధించి కూడా కొన్ని వాస్తు నియమాలని పాటించాలి. ఇంట్లో ఈ నియమాలని పాటించినట్లయితే చాలా సమస్యలు రావు.
చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన చాలా రకాల లాభాలను పొందవచ్చు. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అలాగే వాస్తు ప్రకారం పాటించినట్లయితే ఏ ఇబ్బంది రాదు. బాత్రూం కి సంబంధించి కూడా కొన్ని వాస్తు నియమాలని పాటించాలి.

ఇంట్లో ఈ నియమాలని పాటించినట్లయితే చాలా సమస్యలు రావు. బాత్రూంలో చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇది ప్రతికూల శక్తిని తీసుకొచ్చి సానుకూల శక్తిని దూరం చేస్తుంది. మరి బాత్రూంలో వేటిని ఉంచకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.
బాత్రూంలో పొరపాటున కూడా వీటిని పెట్టకండి.. ఇవి ప్రతికూల శక్తిని తీసుకొస్తాయి
బాత్రూంలో పొరపాటున కూడా వీటిని పెట్టకూడదు. ఆర్థిక ఇబ్బందులతో పాటు మరికొన్ని అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి బాత్రూంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడే తెలుసుకుందాం.
1.క్యాక్టస్ మొక్క
బాత్రూంలో పొరపాటున కూడా క్యాక్టస్ మొక్క పెట్టకండి. ముళ్ళ మొక్కలను బాత్రూంలో పెట్టడం వలన ప్రతికూల శక్తి ఏర్పడుతుంది, సానుకూల శక్తి తొలగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. అలాగే పిల్లలు చదువు విషయంలో కూడా అంతరాయం కలుగుతుంది. ఇంట్లో వాతావరణం ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. కేవలం బాత్రూంలోనే కాదు, ముళ్ళ మొక్కలను ఇంట్లో ఎక్కడా పెట్టకండి. వీటి వలన నష్టాలు, ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది.
2.పగిలిపోయిన గాజు సామాన్లు
పగిలిపోయిన, విరిగిపోయిన గాజు సామాన్లను బాత్రూంలో పెట్టడం మంచిది కాదు. దీని వలన చాలా నష్టం కలుగుతుంది. వాస్తు దోషాలతో బాధపడాల్సి ఉంటుంది. ఆనందం, శ్రేయస్సు కూడా దెబ్బతింటాయి.
3.చనిపోయిన పూర్వికుల ఫోటోలు
చాలా మంది బాత్రూం అటకలపై ఖాళీగా ఉందని చనిపోయిన పూర్వికుల ఫోటోలను పెడుతూ ఉంటారు. బాత్రూం గోడలకు, బాత్రూం అటకపై కానీ చనిపోయిన పూర్వికుల ఫోటోలను పెట్టకూడదు. అస్వస్థత, అప్పులు, మానసిక ఒత్తిడి వంటివి కలుగుతాయి. అలాగే బాత్రూంలో ఫోటోలకు వేసిన పాత దండలు, విరిగిపోయిన ధూపం స్టాండ్లు, చిన్న విగ్రహాలు వంటివి పెట్టకూడదు. ఇలా చేయడం వలన అనేక రకాల సమస్యలు వస్తాయి. ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.
4.బాత్రూం రంగులు
బాత్రూంలో ఉండే గోడలకు నలుపు, ముదురు నీలం రంగులు వేయించకూడదు. గోడలకు లైట్ కలర్స్ వేయించుకుంటే మంచిది. ఈ ముదురు రంగులు ప్రతికూలతను పెంచుతాయి. సానుకూల వాతావరణం తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. బాత్రూం గోడలు లేత నీలం, పచ్చ, క్రీమ్ కలర్ ఉంటే సమస్యలు రావు. పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది.
5.మురికి బట్టలు
మురికి బట్టలు, చెప్పులు వంటి వాటిని బాత్రూంలో ఉంచకూడదు. అవసరమైనప్పుడు ఉంచి ఆ తర్వాత తొలగించాలి. మాసిపోయిన బట్టలు బాత్రూంలో పెట్టడం వలన దుర్వాసన వస్తుంది, వ్యతిరేక శక్తి కూడా ఎక్కువ అవుతుంది. ఎప్పటికప్పుడు బాత్రూంని శుభ్రంగా ఉంచాలి. ప్రతిరోజూ బాత్రూంలో కొంచెం ఉప్పు వేసి తుడిస్తే ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఎల్లప్పుడూ బాత్రూం తలుపుని కూడా మూసి ఉంచాలి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


