చాంద్రమానానికి, సౌరమానానికి మధ్య ఉండే 11 రోజుల వ్యత్యాసాన్ని సరి చేయడానికి మూడేళ్లకు ఒకసారి అధికమాసం వస్తుంది. ఈ ఏడాది మే నెలలో అధికమాసం వచ్చింది. ఇది అధిక జ్యేష్ఠ మాసం. ప్రతి మూడు సంవత్సరాలకు వచ్చే ఈ అధికమాసం అనేది చాలా విశేషమైనది. మే 17 నుంచి ఈ అధిక జ్యేష్ఠ మాసం మొదలైంది. జూన్ 16 నుంచి నిజ జ్యేష్ఠ మాస. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం లేదా మలమాసం అని కూడా అంటారు.
దానాలతో ఎంతో పుణ్యం

అధిక మాసంలో దానధర్మాలు చేస్తే విశేషమైన ఫలితాలను పొందడానికి వీలవుతుంది. ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే అవసరమైన వారికి ఆహారం, ధనం, వస్త్రాలు వంటివి ఇస్తే కృష్ణుని అనుగ్రహం కలిగి కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం లభిస్తాయి.
ఈ నెలలో భక్తిశ్రద్ధలతో, నియమనిష్ఠలతో చేసే పూజలు, దానాలు కుటుంబ సభ్యులందరికీ శుభ ఫలితాలను అందిస్తాయి. అధిక మాసంలో ఏ రాశి వారు వేటిని దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా మీ రాశి ప్రకారం దానాలు చేయడం వలన గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. శాంతి లభిస్తుంది.
అధిక మాసంలో ద్వాదశ రాశుల వారు వేటిని దానం చేయాలి? పూర్తి లిస్టు ఇదిగో..
మేష రాశి, వృశ్చిక రాశి, సింహ రాశి
ఈ మూడు రాశుల వారు కూడా నెయ్యి, బెల్లం, రాగి, గోధుమలు, కందిపప్పు, ఎరుపు వస్త్రాలు, కుంకుమను దానం చేయడం చాలా మంచిది. కుజుడు, సూర్యుడికి సంబంధించిన ఈ రాశుల వారు దానిమ్మ పండ్లు, అరటిపండ్లను దానం చేస్తే కూడా ప్రయోజనాలు కలుగుతాయి. శ్రీహరి అనుగ్రహం లభిస్తుంది. శుభ ఫలితాలను చూడొచ్చు. కష్టాలన్నీ తొలగిపోతాయి.
వృషభ రాశి, తులా రాశి, మిథున రాశి, కన్యా రాశి
ఈ నాలుగు రాశుల వారు శుక్రుడు, బుధుడికి సంబంధించినవి. ఈ రాశుల వారు తెల్లటి వస్త్రాలు, పంచదార, సువాసన ద్రవ్యాలు, బియ్యం, పెసలతో పాటు కంచు పాత్రలు, ఆకుపచ్చ వస్త్రాలు దానం చేస్తే మంచి ఫలితాలను చూస్తారు. వెండి, చీరలు, పచ్చ రత్నాలు దానం చేస్తే కూడా ఈ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. అధిక మాసంలో ఈ రాశుల వారు వీటిని దానం చేయడం వలన విష్ణు అనుగ్రహం లభించి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
కర్కాటక రాశి, ధనస్సు రాశి, మీన రాశి
{{/usCountry}}ఈ నాలుగు రాశుల వారు శుక్రుడు, బుధుడికి సంబంధించినవి. ఈ రాశుల వారు తెల్లటి వస్త్రాలు, పంచదార, సువాసన ద్రవ్యాలు, బియ్యం, పెసలతో పాటు కంచు పాత్రలు, ఆకుపచ్చ వస్త్రాలు దానం చేస్తే మంచి ఫలితాలను చూస్తారు. వెండి, చీరలు, పచ్చ రత్నాలు దానం చేస్తే కూడా ఈ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. అధిక మాసంలో ఈ రాశుల వారు వీటిని దానం చేయడం వలన విష్ణు అనుగ్రహం లభించి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
కర్కాటక రాశి, ధనస్సు రాశి, మీన రాశి
{{/usCountry}}ఈ మూడు రాశుల వారు చంద్రుడు, గురువుకి సంబంధించిన వారు. ఈ రాశుల వారు పెరుగు, పాలు, బియ్యం, నెయ్యి, పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తే మంచిది. అలాగే పసుపు, శెనగపప్పు, పుస్తకాలు వంటి వాటిని దానం చేస్తే కూడా విశేషమైన ఫలితాలను పొందవచ్చు. విష్ణు అనుగ్రహంతో దేనికి లోటు ఉండదు.
మకర రాశి, కుంభ రాశి
ఈ రెండు రాశుల వారు శని గ్రహానికి సంబంధించినవి. ఈ రాశుల వారు నూనె, నువ్వులు, నల్లటి వస్త్రాలు, దుప్పట్లు వంటి వాటిని దానం చేస్తే ప్రత్యేక ఫలితాలు కలుగుతాయి. అలాగే సేవ చేయడం వలన కూడా శుభ ఫలితాలను చూడొచ్చు.
అధిక మాసంలో దానం చేసేటప్పుడు ఈ నియమాలను పాటించండి
- అధిక మాసంలో దానాలు చేసేవారు శక్తికి తగ్గట్టుగా దానాలు చేయాలి.
- యజ్ఞాలు, గ్రహణాల సమయంలో దానం చేస్తే అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి.
- రాత్రిపూట దానం చేయకూడదు.