డబుల్ రాజయోగాల ధమాకా: జ్యోతిష్య శాస్త్రంలో రాజయోగాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. గ్రహాల నడక మారినప్పుడల్లా కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలోనే జూన్ నెలలో రెండు అత్యంత శక్తివంతమైన రాజయోగాలు సాకారం కాబోతున్నాయి. ప్రస్తుతం జూన్ 4వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు అంత్యంత పవిత్రమైన 'గజకేసరి రాజయోగం' నడుస్తోంది. జాతకంలో చంద్రుడికి కేంద్ర స్థానంలో (1, 4, 7, 10 ఇళ్లలో) గురు గ్రహం ఉన్నప్పుడు ఈ గజకేసరి యోగం ఏర్పడుతుంది. అలాగే చంద్రుడు నీచ స్థానంలో లేకుండా, అస్తమించకుండా ఉండి.. శుక్ర, బుధ, గురు గ్రహాల వీక్షణం ఉన్నప్పుడు కూడా ఈ అద్భుత యోగం పడుతుంది.

"గజకేసరి యోగంలో జన్మించిన వారు లేదా ఈ యోగ ప్రభావం ఉన్న కాలంలో వ్యక్తులు శత్రువులపై విజయం సాధిస్తారు. వీరి మాటతీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. రాచరికపు సుఖాలు, సకల సద్గుణాలు కలిగి ఉంటూ దీర్ఘాయుష్షును పొందుతారు," అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు. ఈ యోగం వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరగడంతో పాటు సమాజంలో ఉన్నత స్థాయి జీవనాన్ని గడుపుతారు.
జూన్ 8 నుంచి గజలక్ష్మి రాజయోగం
గజకేసరి యోగం ముగిసిన వెంటనే జూన్ 8వ తేదీ నుంచి మరో అద్భుతమైన 'గజలక్ష్మి రాజయోగం' ప్రారంభం కానుంది. దేవగురు బృహస్పతి, శుక్రుడు ఒకే రాశిలో కలిసినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం గురు భగవానుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 8న సంపదలకు అధిపతి అయిన శుక్రుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.
జూలై వరకు శుక్రుడు ఇదే రాశిలో ఉంటాడు. దీనివల్ల కర్కాటక రాశిలో గురు, శుక్రుల కలయిక జరిగి గజలక్ష్మి రాజయోగం సాకారమవుతుంది. ఈ రెండు రాజయోగాల బ్యాక్-టు-బ్యాక్ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇప్పుడు చూద్దాం.
మేష రాశి
మేష రాశి వారికి గజలక్ష్మి రాజయోగం కెరీర్ పరంగా ఊహించని విజయాలను తెచ్చిపెడుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్లతో పాటు జీతాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం రెట్టింపు కావడంతో పాత అప్పుల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.
వృషభ రాశి
{{/usCountry}}మేష రాశి వారికి గజలక్ష్మి రాజయోగం కెరీర్ పరంగా ఊహించని విజయాలను తెచ్చిపెడుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్లతో పాటు జీతాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం రెట్టింపు కావడంతో పాత అప్పుల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.
వృషభ రాశి
{{/usCountry}}వృషభ రాశి వారికి ఈ సమయంలో అదృష్టం పూర్తిగా అండగా నిలుస్తుంది. ఎక్కడో నిలిచిపోయిన డబ్బు లేదా గతంలో ఎవరికైనా ఇచ్చి రాదనుకున్న నగదు అకస్మాత్తుగా మీ చేతికి అందుతుంది. గత పెట్టుబడుల నుంచి భారీగా రిటర్న్స్ వస్తాయి. ధన ప్రవాహం నిరంతరం కొనసాగడం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.
కర్కాటక రాశి
ఈ గజలక్ష్మి రాజయోగం కర్కాటక రాశిలోనే ఏర్పడుతుండటంతో ఈ రాశి వారికి లక్ష్మీదేవి అపరిమితమైన అనుగ్రహాన్ని ఇస్తుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. శుక్రుడి సంచారం వల్ల విలాసవంతమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ కాలం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది, వారి అదృష్టం వల్ల మీ పనులన్నీ సజావుగా సాగుతాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త ఆర్డర్లు, విదేశీ అవకాశాలు వస్తాయి. ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది.
గమనిక: పైన పేర్కొన్న వివరాలు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, వివిధ గ్రంథాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనిని నమ్మడం అనేది మీ వ్యక్తిగత విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ఖచ్చితమైన వివరాల కోసం నిపుణులను సంప్రదించగలరు.