Lunar Eclipse: మార్చి మూడున 2026లో ఏర్పడే మొదటి చంద్ర గ్రహణం.. కన్యా రాశితో పాటు ఈ రాశుల జీవితాల్లో పెను మార్పులు!

ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మార్చి మూడున మధ్యాహ్నం 3:20 నిమిషాల నుంచి సాయంత్రం 6:47 వరకు ఉంటుంది. ఇది భారతదేశంలో కనపడుతుంది. కాబట్టి సూతక కాలం కూడా వర్తిస్తుంది. ఆసియా, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాతో పాటు పసిఫిక్ ఐలాండ్స్‌లో కూడా కనబడుతుంది. భారతదేశంలో కూడా దీని ప్రభావం ఉంటుంది.

Published on: Feb 27, 2026, 09:05:39 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఏటా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడడం చూస్తూ ఉంటాం. ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మార్చి మూడున మధ్యాహ్నం 3:20 నిమిషాల నుంచి సాయంత్రం 6:47 వరకు ఉంటుంది. ఇది భారతదేశంలో కనపడుతుంది. కాబట్టి సూతక కాలం కూడా వర్తిస్తుంది. ఆసియా, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాతో పాటు పసిఫిక్ ఐలాండ్స్‌లో కూడా కనబడుతుంది. భారతదేశంలో కూడా దీని ప్రభావం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు వహించాలి.

Lunar Eclipse: మార్చి మూడున 2026లో ఏర్పడే మొదటి చంద్ర గ్రహణం (pinterest)
Lunar Eclipse: మార్చి మూడున 2026లో ఏర్పడే మొదటి చంద్ర గ్రహణం (pinterest)

చంద్ర గ్రహణం 2026

గ్రహణ సమయంలో కొన్ని నియమాలను పాటించాలి. గ్రహణ సమయంలో జపాలు, భగవాన్ నామస్మరణ వంటివి విశేష ఫలితాలను తీసుకొస్తాయి. అయితే ఈ గ్రహణం 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో కొన్ని రాశుల వారిపై ఎక్కువ ప్రభావం పడుతుంది. చాలెంజ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చంద్రగ్రహణం వల్ల ఏ రాశుల వారికి సమస్యలు వస్తాయి, ఎవరు జాగ్రత్తలు వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మార్చి మూడున చంద్ర గ్రహణం.. కన్య రాశి వారితో పాటు ఈ రాశులను ప్రభావితం చేస్తుంది.

1.వృషభ రాశి

రాశి వారు చంద్ర గ్రహణం వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సహనంతో ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరింత సహనంగా ఉండాలి. పని ప్రదేశంలో సమస్యలు, ఆలస్యం వంటివి చూడొచ్చు. కాబట్టి ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు మరింత శ్రద్ధ పెట్టండి.

అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అయితే ఈ సమయంలో సక్సెస్‌ను అందుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దు. ఒకవేళ విఫలమైనా మళ్లీ నెమ్మదిగా ప్రయత్నం చేయండి.

2.కన్య రాశి

కన్య రాశి వారికి చంద్ర గ్రహణం సమయంలో శుభ ఫలితాలు కలగవు. ఈ సమయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కొత్త పనులను మొదలు పెట్టడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పని ప్రదేశంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

వీలైనంత వరకు మర్యాదపూర్వకంగా ఉండాలి. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం మంచిది కాదు. పిల్లలు చదువుపై శ్రద్ధను కోల్పోతారు. కాబట్టి వారి పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. చిన్న సమస్యలు కూడా పెద్దవిగా మారే అవకాశం ఉంది.

3.కుంభ రాశి

కుంభ రాశి వారికి చంద్ర గ్రహణం సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. బాధ్యతలు పెరుగుతాయి. పని ప్రదేశంలో కూడా సమస్యలు వస్తాయి. కుటుంబ జీవితంలో బ్యాలెన్స్ ఉండేటట్లు చూసుకోండి.

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. పని ప్రదేశంలో ఆచితూచి వ్యవహరించండి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More