...
...
Next Story

నవంబర్ 16న వృశ్చిక రాశిలోకి సూర్య సంచారం, మూడు రాశులకు గోల్డెన్ డేస్.. డబ్బు, అదృష్టంతో పాటు బోలెడు లాభాలు!

సూర్యుడు కూడా ఎప్పటికప్పుడు తన రాశులను మారుస్తూ ఉంటాడు. గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు ప్రతి నెల తన రాశిని మారుస్తూ ఉంటాడు. అది ద్వాదశ రాశుల వారి జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది. వృశ్చిక రాశిలోకి సూర్యుడు అడుగుపెట్టడంతో కొన్ని రాశుల వారి భవితవ్యం మారబోతోంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు?

Published on: Nov 11, 2025, 08:00:04 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో అశుభ యోగాలు, శుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. సూర్యుడు కూడా ఎప్పటికప్పుడు తన రాశులను మారుస్తూ ఉంటాడు. గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు ప్రతి నెల తన రాశిని మారుస్తూ ఉంటాడు. అది ద్వాదశ రాశుల వారి జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది.

వృశ్చిక రాశిలోకి సూర్యుడు

వృశ్చిక రాశిలోకి సూర్యుడు.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం (pinterest)
వృశ్చిక రాశిలోకి సూర్యుడు.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం (pinterest)

నవంబర్ నెలలో అంటే ఈ నెలలోనే సూర్యుడు తన రాశి మార్పు చెందబోతున్నాడు. నవంబర్ 16 ఆదివారం మధ్యాహ్నం 1:44కు సూర్యుడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి అడుగుపెడతాడు. ఈ రాశిలోనే డిసెంబర్ 16 ఉదయం 4:26 నిమిషాల వరకు ఉంటాడు. వృశ్చిక రాశిలోకి సూర్యుడు అడుగుపెట్టడంతో కొన్ని రాశుల వారి భవితవ్యం మారబోతోంది. డబ్బుకి కూడా లోటు ఉండదు. కెరీర్‌లో పురోగతిని చూస్తారు.

ఇది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకురాబోతోంది. కానీ ముఖ్యంగా కొన్ని రాశులు ఎక్కువ లాభాలను పొందుతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? సూర్య సంచారంతో ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.

వృశ్చిక రాశిలోకి సూర్యుడు.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం

1.వృషభ రాశి:

వృషభ రాశి వారికి సూర్య సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితాలను చూస్తారు. పూర్వీకుల నుంచి ఆస్తులు లభించే అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలను పొందుతారు. విజయవంతమైన జీవితాన్ని గడుపుతారు. డబ్బుకి కూడా లోటు ఉండదు.

2.ధనుస్సు రాశి:

వృశ్చిక రాశి వారికి సూర్య సంచారం బాగా కలిసి వస్తుంది. అనేక విధాలుగా లాభాలను పొందుతారు. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. కొత్త వ్యాపారాలను మొదలు పెట్టడానికి కూడా ఇదే శుభ సమయం. కెరీర్‌లో పురోగతిని చూస్తారు. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. అనుకున్న వాటిని పూర్తి చేస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe