...
...
Next Story

గజకేసరి రాజయోగంతో నాలుగు రాశులకు శుభ ఫలితాలు.. ఉద్యోగం, డబ్బు విషయంలో లాభాలేనా?

జ్యోతిష్య అంచనాల ప్రకారం, నవంబర్ 2, 2026న చంద్రుడు సింహ రాశిలోకి ప్రవేశించడంతో గురువుతో కలయిక ఏర్పడి గజకేసరి రాజయోగం ఏర్పడనుందని ఈ కథనం పేర్కొంటోంది. ఈ యోగం ప్రభావంతో కర్కాటక, మేష, సింహ, వృశ్చిక రాశుల వారికి అనుకూల ఫలితాలు కలగవచ్చని చెబుతున్నారు

Published on: Oct 27, 2026, 11:00:36 IST
Advertisement

గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకువస్తుంది. ఒక్కోసారి గ్రహాల కారణంగా మంచి ఫలితాలు ఏర్పడితే, ఒక్కోసారి సమస్యలు కలుగుతాయి.

గజకేసరి రాజయోగంతో నాలుగు రాశులకు శుభ ఫలితాలు.. ఉద్యోగం, డబ్బు విషయంలో లాభాలేనా? (AI)
గజకేసరి రాజయోగంతో నాలుగు రాశులకు శుభ ఫలితాలు.. ఉద్యోగం, డబ్బు విషయంలో లాభాలేనా? (AI)

జ్యోతిషం ప్రకారం చూసినట్లయితే, నవంబర్ నెలలో గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారు అద్భుతమైన ప్రయోజనాలను పొందబోతున్నారు. గజకేసరి రాజయోగంతో ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది?

జ్యోతిష్య లెక్కల ప్రకారం, నవంబర్ 2న ఉదయాన్నే చంద్రుడు కర్కాటక రాశిని వదిలేసి సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. సింహ రాశిలో ఇప్పటికే గురువు సంచారం జరుగుతుండడంతో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దీంతో గజకేసరి రాజయోగం కలిగి, కొన్ని రాశుల వారి జీవితాన్ని మార్చేస్తుంది. ఈ యోగం వల్ల 12 రాశుల వారిపై ప్రభావం పడినప్పటికీ, కొన్ని రాశుల వారు మాత్రం భారీగా లాభాలను పొందుతారు. అదృష్ట రాశులు ఏవి అనేది ఇప్పుడే చూసేద్దాం.

నవంబర్ 2న శక్తివంతమైన గజకేసరి రాజయోగం.. ఈ నాలుగు రాశుల వారి జీవితం మారిపోతుంది!

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి గజకేసరి రాజయోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు భారీగా ప్రయోజనాలను పొందుతారు. ఈ యోగం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. ఆర్థికపరంగా కూడా ప్రయోజనాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

మేష రాశి

సింహ రాశి వారికి గజకేసరి రాజయోగం అద్భుతమైన లాభాలను అందిస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అనేక విధాలుగా ప్రయోజనాలను చూస్తారు. బాధ్యతలను సరిగ్గా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తుల జీతం పెరుగుతుంది. ఏదైనా కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టాలనుకుంటే, ఇది అద్భుతమైన సమయం. అలాగే, ఈ రాశి వారు వైవాహిక జీవితంలో ఆనందాన్ని చూస్తారు. అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి కూడా ఇది శుభ సమయం. చంద్రుడు, గురువుల కలయికతో ఏర్పడే ఈ రాజయోగం అనేక విధాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. పని ప్రదేశంలో శుభవార్తలను వింటారు. ప్రమోషన్లు వస్తాయి. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారపు అలవాట్లను పాటిస్తే మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks