బంగారం ఈ రాశులకు నష్టాలను కలిగిస్తుంది, అదృష్టం తగ్గిపోతుంది.. బంగారం వల్ల కలిగే లాభాలు, నష్టాలను తెలుసుకోండి!

బంగారం సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది. అయితే, బంగారాన్ని ఎంత డబ్బుగా భావించినా, సానుకూల శక్తి తీసుకొచ్చినా, కొన్ని రాశుల వారికి మాత్రం ఇబ్బందులను కలిగిస్తుంది. ప్రయోజనాలకు బదులుగా, కొన్ని రాశుల వారు నష్టాలనే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈసారి బంగారాన్ని ధరించే ముందు ఈ విషయాలను గమనించడం మంచిది

Published on: Mar 24, 2026, 15:00:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మన సనాతన ధర్మంలో బంగారాన్ని డబ్బుగా భావిస్తారు. లక్ష్మీదేవికి చిహ్నంగా నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రంలో చూసినట్లయితే, దేవగురువు బృహస్పతి మరియు సూర్యదేవుడితో ఇది నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. బంగారం సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది. అయితే, బంగారాన్ని ఎంత డబ్బుగా భావించినా, సానుకూల శక్తి తీసుకొచ్చినా, కొన్ని రాశుల వారికి మాత్రం ఇబ్బందులను కలిగిస్తుంది. ప్రయోజనాలకు బదులుగా, కొన్ని రాశుల వారు నష్టాలనే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈసారి బంగారాన్ని ధరించే ముందు ఈ విషయాలను గమనించడం మంచిది. బంగారాన్ని లక్ష్మీదేవిగా భావించి కొలుస్తాము. అయితే, కొన్ని రాశుల వారు మాత్రం బంగారం ధరించకూడదు. వీరికి ఇబ్బందులు కలుగుతాయి.

బంగారం ఏ రాశుల వారికి నష్టాలను కలిగిస్తుంది? (pinterest)
బంగారం ఏ రాశుల వారికి నష్టాలను కలిగిస్తుంది? (pinterest)

బంగారంతో గ్రహాల సంబంధం:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, బంగారం అనేది అగ్నికి సంబంధించినది. బంగారానికి అధిపతి గురువు మరియు సూర్యుడు. అయితే జాతకంలో శని, రాహువు, కేతువుల ప్రభావం ఎక్కువగా ఉన్న రాశుల వారు బంగారాన్ని ధరిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమస్యలు కలగవచ్చు. కాబట్టి కొన్ని రాశుల వారికి బంగారం ఎట్టి పరిస్థితుల్లో కలిసి రాదని గుర్తుపెట్టుకోండి.

బంగారం ఏ రాశుల వారికి నష్టాలను కలిగిస్తుంది?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి బంగారం వలన ఇబ్బందులు కలుగుతాయి. కొన్ని రాశుల వారు ధరించే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి ఆధిపతి గ్రహాలు బంగారానికి సంబంధించిన గ్రహాలతో అనుకూలంగా ఉండవు.

వృషభ రాశి:

ఈ రాశికి అధిపతి శుక్రుడు. గురువు, శుక్రుడి మధ్య విరోధం ఉంటుంది. కాబట్టి బంగారం ధరిస్తే అభివృద్ధి కలగదు. అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడతాయి.

మకర రాశి, కుంభ రాశి:

ఈ రెండు రాశులకు అధిపతి శని. శని, సూర్యుల మధ్య విరోధం ఉంటుంది. కాబట్టి ఈ రాశుల వారు బంగారాన్ని ధరిస్తే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి:

ఈ రాశికి అధిపతి కుజుడు. కుజుడి ఉగ్ర స్వభావం మరియు బంగారం శక్తి కారణంగా ఎక్కువ కోపం, కలహాలు వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి ఈ రాశి వారు కూడా బంగారాన్ని ధరిస్తే ఇబ్బందులను, అశుభ ఫలితాలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

శని, రాహువు, కేతువు మహాదశ లేదా అంతర్దశలో ఉన్నట్లయితే, బంగారం ధరించకపోవడం మంచిది. జాతకంలో సూర్యుడు నీచస్థానంలో ఉన్నా కూడా బంగారం ధరించడం వల్ల శుభ ఫలితాలు తగ్గి, ఆత్మవిశ్వాసం తగ్గిపోవచ్చు.

ఈ రాశుల వారికి బంగారం రాజయోగం తీసుకొస్తుంది:

మేష రాశి, సింహ రాశి, ధనుస్సు రాశి, మీన రాశి వారికి బంగారం ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. వారి ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారంలో, కెరీర్‌లో కూడా లాభాలను చూస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More