Gold Secrets : కొందరి ఇళ్లలో బంగారం ఎందుకు నిలవదు? కారణాలు చూడండి?

Gold Secrets : హిందూ మతంలో బంగారాన్ని సంపద, శ్రేయస్సు, లక్ష్మికి చిహ్నంగా భావిస్తారు. అయితే చాలా ఇళ్లలో డబ్బులాగే.. బంగారం కూడా ఎక్కువ కాలం నిలవదు. దీనికి దారితీసే తప్పులను పరిశీలిద్దాం.

Published on: May 6, 2026, 13:13:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బంగారాన్ని మన్నికైన ఆస్తిగా పరిగణిస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరూ డబ్బు ఆదా చేసి గోల్డ్ కొనుక్కోని ఇంట్లో బంగారాన్ని ఉంచుకుంటారు. అయితే చాలా ఇళ్లలో బంగారం ఎక్కువ కాలం నిలవదు. బంగారు ఆభరణాలు తరచుగా విరిగిపోతాయి, పోగొట్టుకుంటారు, లేదా ఏదో ఒక కారణంతో అమ్ముకోవలసి వస్తుంది.

బంగారం వాస్తు చిట్కాలు
బంగారం వాస్తు చిట్కాలు

బంగారం ఇంట్లో నిలవకపోవడం కూడా ఒక వాస్తు దోషం. శాస్త్రాలు దీనికి అనేక మతపరమైన, శక్తిపరమైన కారణాలను పేర్కొన్నాయి. బంగారం ఇంట్లో నిలవకపోవడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం.. నిరంతరం చిందరవందరగా ఉండే వస్తువులు, పగిలిన పాత్రలు, చెత్తాచెదారం లేదా మురికి ఉన్న ఇళ్ళు ప్రతికూల శక్తిని కలిగి ఉంటాయి. లక్ష్మీదేవి అటువంటి ఇళ్లలో నివసించదు. అందువల్ల సంపద లేదా బంగారం అటువంటి ఇళ్లలో ఉండదు.

వాస్తులో దిశకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు ప్రకారం బంగారం, వెండిని ఎప్పుడూ దక్షిణం లేదా ఆగ్నేయ దిశలో ఉంచకూడదు. ఈ దిశలలో సంపద, ఆస్తి ఎప్పుడూ స్థిరంగా ఉండవు. శాస్త్రాల ప్రకారం.. అప్పు, రుణం లేదా వడ్డీతో కొనుగోలు చేసిన బంగారాన్ని ఉపయోగించడం కూడా అశుభంగా పరిగణిస్తారు. అటువంటి బంగారం ఇంట్లో ఎప్పటికీ నిలవదు, పైగా ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. మీ జాతకంలో శుక్ర, గురు గ్రహాలు బలహీనంగా ఉంటే బంగారం ఎక్కువ కాలం నిలవదు.

నైరుతి మూల నగలను ఉంచడానికి ఇది అత్యంత శుభప్రదమైన స్థానం. ఈ మూలలో బరువు ఉండటం వల్ల ఇంట్లో సంపద స్థిరంగా ఉంటుంది. ఉత్తరం కుబేరుడి స్థానం కాబట్టి, ఇక్కడ బంగారం ఉంచడం వల్ల సంపద వృద్ధి చెందుతుంది. బీరువాను నైరుతిలో ఉంచి, అది ఉత్తరం వైపు తెరుచుకునేలా చూడాలి.

బాత్‌రూమ్ గోడలకు ఆనుకుని ఉన్న అల్మారాల్లో లేదా మురికిగా ఉన్న ప్రదేశాల్లో బంగారం ఉంచకూడదు. బంగారాన్ని దక్షిణ దిశలో ఉంచడం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతుంటారు.

బంగారం పోగొట్టుకోవడం అశుభంగా భావిస్తారు. ఇది రాబోయే ఆర్థిక కష్టాలకు లేదా ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. దారిలో దొరికిన బంగారాన్ని నేరుగా ఇంటికి తీసుకురావడం లేదా వాడుకోవడం వాస్తు దోషం కలిగిస్తుంది. దానివల్ల వేరొకరి ప్రతికూల శక్తి మీకు వచ్చే అవకాశం ఉంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More