...
...
Next Story

రేపటి నుంచి గురు, శుక్రుల ప్రత్యేక యోగంతో ఈ 4 రాశుల వారికి పట్టనున్న అదృష్టం!

గురు, శుక్ర గ్రహాలు 60 డిగ్రీల కోణంలో ఉండటం వల్ల లాభదృష్టి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ యోగం శుభప్రదమైనదిగా భావిస్తారు. గురువు జ్ఞానం, తెలివితేటలకు, శుక్రుడు ప్రేమ, సంతోషం, సంపదకు కారకులుగా పరిగణిస్తారు.

Published on: Nov 27, 2026, 12:01:03 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు నక్షత్రాలను, రాశులను మార్చడం సహజం. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అందరిపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి గ్రహాల వల్ల శుభ ఫలితాలు కలిగితే, ఒక్కోసారి సమస్యలు రావచ్చు. ఎప్పుడు ఏది జరుగుతుందనేది గ్రహాల ఆధారంగా తెలుసుకుని, దానికి తగ్గట్టుగా వ్యవహరించడం మంచిది. శుక్రుడు సంతోషాలు, డబ్బు, ప్రేమ, అభిలాషలు మొదలైన వాటికి కారకుడు. గురువు జ్ఞానం, తెలివితేటలు మొదలైన వాటికి కారకుడు. ఈ రెండు గ్రహాలు కలిసి లాభ దృష్టి యోగాన్ని తీసుకురాబోతున్నారు. అది కూడా రేపే.

రేపటి నుంచి గురు, శుక్రుల ప్రత్యేక యోగంతో ఈ 4 రాశుల వారికి పట్టనున్న అదృష్టం! (AI)
రేపటి నుంచి గురు, శుక్రుల ప్రత్యేక యోగంతో ఈ 4 రాశుల వారికి పట్టనున్న అదృష్టం! (AI)

జ్యోతిష్య లెక్కల ప్రకారం చూసినట్లయితే, గురు, శుక్రులు కలిసి లాభదృష్టి యోగాన్ని రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు తీసుకురాబోతున్నారు. ఈ రెండు గ్రహాలు 60 డిగ్రీల కోణంలో సంయోగం చెందినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా శుభప్రదమైన యోగం. ఈ యోగం కారణంగా 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కానీ కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి. లాభదృష్టి యోగంతో ఈ రాశుల వారికి భారీగా ప్రయోజనాలు, అదృష్టం రెట్టింపు అవుతుంది. అనేక విధాలుగా ప్రయోజనాలను చూస్తారు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ లాభదృష్టి యోగం శుభప్రదమైనది. ఈ సమయంలో ఈ రాశి వారు బాగా ప్రయోజనాలను పొందుతారు. కొత్త బాధ్యతలను చేపడతారు. అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది. అవకాశాలను సరిగ్గా వినియోగించుకుంటే ఆదాయంగా మారతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ప్రేమ జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి శుక్ర, గురు గ్రహాలు మంచి ఫలితాన్ని తీసుకురాబోతున్నాయి. ఈ రెండు గ్రహాలు ఈ రాశి వారికి మంచి రోజులు తీసుకురాబోతున్నాయి. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో దృఢంగా మారుతుంది. విదేశీ ప్రయాణాలు చేస్తారు. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.

తులా రాశి

ఈ రాశి వారికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. ఈ రాశి వారు సానుకూల మార్పులను చూస్తారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. పని ప్రదేశంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా ఉంటుంది.

 

ABOUT THE AUTHOR

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks