Happy Vijayadashami 2026: బంధువులు, స్నేహితులకు పంపించేందుకు బెస్ట్ తెలుగు విషెస్!
నవరాత్రుల తొమ్మిది రోజులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి, పదో రోజున విజయదశమి పండుగను జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో శుభాకాంక్షలను పంచుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తాము. అలాగే దశమి నాడు విజయ దశమి పండుగను జరుపుకుంటాము. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకతగా విజయదశమి పండుగను జరుపుకుంటున్నాము. ఈ విజయదశమికి మీ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరికీ విషెస్‌ను పంచుకోవాలనుకుంటున్నారా? అయితే, వారి కోసం అద్భుతమైన విషెస్ ఇదిగో!

ఈ విజయదశమిని విజయవంతంగా వారందరూ జరుపుకోవాలని, విజయాలు ఎప్పుడూ వారితోనే ఉండాలని అనుకుంటూ విషెస్‌ను తెలపడానికి.. ఈ విషెస్ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. మరి ఇప్పుడే వీటిని మీ స్నేహితులతో షేర్ చేసుకోండి.
విజయదశమి 2026 విషెస్.. మీ బంధువులు, స్నేహితులతో షేర్ చేసుకోండి మరి
ఆ దుర్గమ్మ ఆశీస్సులతో మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి, సుఖసంతోషాలు నిండాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు!
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ విజయదశమి. పండుగ మీ జీవితంలో కూడా విజయాలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయదశమి శుభాకాంక్షలు!
కలలు నిజమవ్వాలని, ఆశయాలన్నీ నెరవేరాలని, ప్రతి ప్రయత్నంలో విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ విజయదశమి!
దుర్గమ్మ దీవెనలతో మీ ఇంట్లో ఆనందం ఉండాలి. ఎల్లప్పుడూ ప్రశాంతంగా, సిరిసంపదలతో ఉండాలని ఆ భగవంతురాలైన అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. దసరా శుభాకాంక్షలు!
విజయదశమి జీవితంలో కొత్త ఆశలకు, కొత్త ఆరంభాలకు, విజయాలకు నాంది కావాలని కోరుకుంటున్నాను. విజయదశమి 2026 శుభాకాంక్షలు!
సకల శుభాలను అందించే అమ్మవారి ఆశీస్సులు మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు!
ఆ జగన్మాత ఆశీస్సులతో అడ్డంకులన్నీ తొలగిపోయి, విజయపథంలో ముందుకు సాగాలని, ఎలాంటి కష్టమైనా ఇట్టే దాటేసే శక్తిని మీకు అందించాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు!
జమ్మి ఆకుల బంగారు కాంతుల్లా మీ జీవితం సిరిసంపదలతో మెరిసిపోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. విజయదశమి శుభాకాంక్షలు!
దుర్గమ్మ ధైర్యాన్ని, లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని, సరస్వతీదేవి జ్ఞానాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దసరా శుభాకాంక్షలు!
మీ ఇంట సిరి సంపదలు వెల్లివిరిసి, మీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలని, జీవితాంతం శుభప్రదంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అమ్మవారి ఆశీస్సులతో అపారమైన శక్తి, అచంచలమైన ఆత్మవిశ్వాసం, అద్భుతమైన విజయాలు లభించాలని ఆ దుర్గమ్మను ప్రార్థిస్తున్నాను. విజయదశమి శుభాకాంక్షలు!
విజయదశమి వేళ దుర్గామాత మీకు విజయాలను, శాంతిని అందించాలని, ఎప్పుడూ మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ విజయదశమి!
కుటుంబంలో నవ్వులు పూయాలి, మనసులో ఆశలు చిగురించాలి, జీవితంలో విజయాలు పరిమళించాలి. హ్యాపీ విజయదశమి!
దసరా పండుగ జీవితంలోని చీకట్లను తొలగించాలని, ఆశల వెలుగులను నింపాలని, సరికొత్త విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు!
జీవితంలో ప్రతి ఉదయం కొత్త ఆశతో మొదలై, ప్రతి సాయంత్రం విజయానందంతో ముగియాలని కోరుకుంటున్నాను. హ్యాపీ విజయదశమి!
మీ బంధాలు బలపడాలి, కలలు నిజం అవ్వాలి, కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలి. మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు!
జమ్మి ఆకుల బంగారం మీ ఇంటికి శుభాన్ని తీసుకురావాలి. అమ్మవారి ఆశీస్సులతో మీ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. హ్యాపీ విజయదశమి!
శక్తికి ప్రతీక అయిన దుర్గాదేవి ధైర్యాన్ని, విజయాన్ని, శుభాలను ప్రసాదించి, జీవితాన్ని ఆనందమయంగా మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు!
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


