గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చిందంటే చాలు, మన జీవితంలో కూడా ఎంతో మార్పు వస్తుంది. ఒక్కోసారి గ్రహాల కారణంగా అద్భుతమైన ఫలితాలు కలిగితే, ఒక్కోసారి మాత్రం చిన్నపాటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మరో నెలతో 2026 పూర్తి కాబోతోంది. 2027లోకి రానున్నాము. జనవరి 2027లో 5 గ్రహాలు తమ స్థానాలను మార్చుకోబోతున్నాయి. దాంతో 12 రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. కొన్ని రాశుల వారు మాత్రం భారీగా లాభాలను పొందుతారు. జనవరి ప్రారంభంలోనే కొన్ని రాశుల వారు అద్భుతమైన లాభాలను పొందబోతున్నారు.
శుక్రుడు, బుధుడు ఒకసారి కాదు, ఏకంగా రెండుసార్లు తమ స్థానాలను మార్చుకోబోతున్నారు. శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుండగా, బుధుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు సింహ రాశిలో తిరోగమనం చెందుతాడు. అలాగే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో గురువు తిరోగమనం చెందుతాడు. కుంభ రాశిలోకి బుధుడు ప్రవేశిస్తాడు. అలాగే జనవరి నెలలోనే శుక్రుడు మళ్లీ ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా గ్రహాల మార్పు వల్ల కొన్ని రాశుల వారు మాత్రం అద్భుతమైన లాభాలను పొందబోతున్నారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.
జనవరి 2027 ఈ రాశుల వారికి శుభ సమయం.. అద్భుతమైన లాభాలను పొందుతారు, అదృష్టం కలిసి వస్తుంది!
మకర రాశి:
మకర రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. జనవరి నెలలో ఈ రాశి వారు భారీగా ప్రయోజనాలను పొందుతారు. జనవరి 10న బుధుడు మీ లగ్నంలోకి వస్తాడు. ఈ గోచారంతో నిలిచిపోయిన పనులు తిరిగి మళ్లీ ప్రారంభమవుతాయి. వ్యాపారస్తులకు కూడా ఇది శుభసమయం అని చెప్పొచ్చు. ఆస్తులను కొనుగోలు చేస్తారు. భాగస్వాములతో వ్యాపారం వృద్ధి చెందుతుంది. భూమి సంబంధిత నిర్ణయాలకు కూడా ఇది శుభ సమయమని చెప్పొచ్చు. అలాగే మకర రాశి వారు జనవరి 2027లో అద్భుతమైన విషయాలను పొందుతారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను పొందుతారు.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి కూడా ఇది శుభ సమయమని చెప్పొచ్చు. జనవరి 2027 ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. శుక్ర ప్రభావం వల్ల ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతిని చూస్తారు. ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న వారు భారీగా ప్రయోజనాలను పొందుతారు. అలాగే సహోద్యోగుల నుంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అనుకున్న వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. అదృష్టం కూడా మీ వెనుక ఉంటుంది.
వృశ్చిక రాశి:
{{/usCountry}}ధనుస్సు రాశి వారికి కూడా ఇది శుభ సమయమని చెప్పొచ్చు. జనవరి 2027 ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. శుక్ర ప్రభావం వల్ల ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతిని చూస్తారు. ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న వారు భారీగా ప్రయోజనాలను పొందుతారు. అలాగే సహోద్యోగుల నుంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అనుకున్న వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. అదృష్టం కూడా మీ వెనుక ఉంటుంది.
వృశ్చిక రాశి:
{{/usCountry}}వృశ్చిక రాశి వారికి కూడా జనవరి బాగా కలిసి వస్తుంది. శుక్రుడు మీ లగ్నంలోకి ప్రవేశిస్తాడు. ఈ గోచారం అద్భుతంగా కలిసి వస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కెరీర్, ఆర్థిక పరంగా బాగుంటుంది. ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. సానుకూల మార్పులను చూస్తారు. పిల్లల విద్యా విషయాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి శ్రద్ధ పెడతారు. ఇల్లు, వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు కూడా భారీగా కనిపిస్తున్నాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కూడా 2027 జనవరి బాగా కలిసి వస్తుంది. జనవరి 25న గురువు మీ లగ్నంలోకి రావడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక స్పష్టత కూడా పెరుగుతుంది. ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సామాజిక సంబంధాలను బలోపేతం చేస్తారు. కుటుంబ వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది. మంచి మంచి మార్పులు ఉంటాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
కుంభ రాశి:
శుక్ర ప్రభావం వల్ల ఈ రాశి వారికి జనవరి 2027 బాగా కలిసి వస్తుంది. కుంభ రాశి వారికి బుధుడు జనవరి 28న మీ లగ్నంలోకి ప్రవేశించడం వల్ల బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్లను చూస్తారు. వృత్తి, ఆర్థిక రంగాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. కుంభ రాశి వారు పై అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు. కొత్త పెట్టుబడుల ద్వారా భారీగా లాభం ఉంటుంది. ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ సమయం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలుగా చక్కటి లాభాలను చూస్తారు.
ABOUT THE AUTHOR
పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు