జ్యోతిష్య రంగంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గ్రహాల గమనం రాబోయే వారంలో పూర్తిగా మారనుంది. శని, శుక్ర, రాహువులు తమ రాశులు మరియు నక్షత్రాలను మారుస్తుండటంతో దేశవ్యాప్తంగా పన్నెండు రాశులపై తీవ్ర ప్రభావం పడనుంది. జూలై 27న శని దేవుడు మీన రాశిలో వక్రీ గమనంలోకి ప్రవేశిస్తాడు. అలాగే జూలై 28న శుక్రుడు ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నారు.

ఆగస్టు 1న శుక్రుడు తన నీచ రాశి అయిన కన్యలోకి మారడంతో పాటు, రాహువు ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ మహా గ్రహాల సంచారం కారణంగా రాబోయే ఏడు రోజులు ఆరు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు లభించనున్నాయి.
వృషభ రాశి: పెరగనున్న ఉత్సాహం - ఆర్థిక లాభాలు
ఈ రాశి వారికి రాబోయే వారం అపారమైన సుఖసంతోభాలను, అదృష్టాన్ని తీసుకురానుంది. మీలోని శక్తి సామర్థ్యాలు మరింత పెరుగుతాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం వరిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడం వల్ల క్లిష్టమైన నిర్ణయాలను కూడా సులభంగా తీసుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
కర్కాటక రాశి: కెరీర్ లో ఊహించని పదోన్నతులు
కర్కాటక రాశి జాతకులకు ఈ వారం ఆకర్షణ శక్తి, ఆత్మవిశ్వాసం తారాస్థాయికి చేరుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు లేదా కొత్త ప్రాజెక్టుల బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. ఎప్పడూ వాయిదా పడుతూ వచ్చిన పనులన్నీ ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అనుకోని మార్గాల ద్వారా ధన లాభం కలుగుతుంది. వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం.
కన్యా రాశి: సిరుల పంట - ఉద్యోగంలో ప్రశంసలు
ఈ వారం కన్యా రాశి వారికి ధన-ధాన్యాలృద్ధి కలుగుతుంది. మీ పనితీరును చూసి తోటి ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారులు కూడా అభినందిస్తారు. పెట్టుబడుల ద్వారా మంచి రాబడులు వచ్చే సూచనలున్నాయి. పెళ్లి కాని వారికి త్వరలోనే మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. వివాహితులు తమ జీవిత భాగస్వామితో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు.
వృశ్చిక రాశి: ఆధ్యాత్మిక చింతన - కొత్త ఆదాయ మార్గాలు
{{/usCountry}}ఈ వారం కన్యా రాశి వారికి ధన-ధాన్యాలృద్ధి కలుగుతుంది. మీ పనితీరును చూసి తోటి ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారులు కూడా అభినందిస్తారు. పెట్టుబడుల ద్వారా మంచి రాబడులు వచ్చే సూచనలున్నాయి. పెళ్లి కాని వారికి త్వరలోనే మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. వివాహితులు తమ జీవిత భాగస్వామితో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు.
వృశ్చిక రాశి: ఆధ్యాత్మిక చింతన - కొత్త ఆదాయ మార్గాలు
{{/usCountry}}వృశ్చిక రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు అవేంటో మీకే బోధపడతాయి. కోర్టు వ్యవహారాలు మీ అనుకూలంగా మారే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే అదృష్టం కలుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.
తులా రాశి: శుభవార్తల ప్రవాహం - కోరుకున్న గమ్యస్థానానికి బదిలీ
తులా రాశి వారికి ఈ వారం ఎన్నో శుభవార్తలు ఎదురుచూస్తున్నాయి. కెరీర్‌లో మీరు కోరుకున్న మార్పులు సంభవిస్తాయి. కొందరికి మనసుకి నచ్చిన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ తరుణం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీ లక్ష్యాలను సాధించడంలో అదృష్టం పూర్తి మద్దతుగా నిలుస్తుంది.
కుంభ రాశి: విదేశీ ప్రయాణాలు - ఆర్థిక స్థిరత్వం
కుంభ రాశి వారికి ఈ కాలం అత్యంత అద్భుతంగా గడుస్తుంది. మీరు ఆశించిన ఫలితాలన్నీ చేతికి అందుతాయి. ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కొంతమందికి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం లభిస్తుంది. కుటుంబంలో పెద్దల ఆశీస్సులు, తండ్రి సహకారం మెండుగా లభిస్తాయి. వ్యాపారంలో భారీగా లాభాలు ఆర్జిస్తారు. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న మానసిక ఆందోళనల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.