కర్కాటక రాశిలోకి దేవగురువు.. ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం.. 5 నెలల వరకు డబ్బే డబ్బు!
దేవగురువు బృహస్పతి నేడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు. దీనివల్ల ఏర్పడే హంస మహాపురుష రాజయోగం కారణంగా మేష, మకర, వృశ్చిక రాశుల జాతకుల అదృష్టం ఒక్కసారిగా మారిపోనుంది. ఆ రాశుల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా దేవగురువుగా పిలిచే బృహస్పతి (గురుడు) రాశి మార్పును అత్యంత కీలకమైన అంశంగా జ్యోతిష్య నిపుణులు పరిగణిస్తారు. ఇతర గ్రహాలతో పోలిస్తే గురు గ్రహం చాలా నెమ్మదిగా కదులుతుంది. ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్లడానికి గురుడికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. అదృష్టం, సంతానం, సంపద, విద్య, జ్ఞానానికి కారకుడైన బృహస్పతి.. తాజాగా తన స్థానాన్ని మార్చుకుంటున్నారు.

ప్రస్తుతం బుధ గ్రహానికి చెందిన మిథున రాశిలో ఉన్న గురుడు.. నేటి అర్థరాత్రి దాటాక (అంటే సోమవారం తెల్లవారుజామున) 02 గంటల 25 నిమిషాలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు. చంద్రుడు అధిపతిగా ఉండే కర్కాటక రాశిలో అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం వరకు గురుడు కొలువుదీరనున్నారు. గురుడు తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించడం వల్ల జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన 'హంస మహాపురుష రాజయోగం' ఏర్పడబోతోంది. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ, ఈ మూడు రాశుల వారికి మాత్రం ఊహించని రీతిలో అదృష్టం వరించనుంది.
ఈ రాశులకు ఐదు నెలల వరకు బోలెడు లాభాలు
1.మేష రాశి
కర్కాటక రాశిలో గురుడి సంచారం మేష రాశి జాతకులకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. వీరి జీవితంలోకి సుఖశాంతులు వెల్లువెత్తుతాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పురోగతి లభిస్తుంది.
సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా, స్నేహితుల నుంచి కీలక సహాయ సహకారాలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలం. త్వరలోనే శుభవార్తలు వింటారు.
2.మకర రాశి
మకర రాశి వారికి ఈ గురు గోచారం విశేషమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోయి, అనుబంధం మరింత బలపడుతుంది. కెరీర్ పరంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం.
ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారులు గతంలో వేసుకున్న ప్రణాళికలు ఇప్పుడు సక్సెస్ అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
3.వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు గురుడి మార్పు వల్ల గోల్డెన్ డేస్ మొదలవుతాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పెద్ద ప్రాజెక్టులు లేదా డీల్స్ దక్కే అవకాశం ఉంది. ఇది మీ కెరీర్‌ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది.
విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో మీ పరపతి పెరగడమే కాకుండా, ఆర్థిక నిలకడ లభిస్తుంది.
గమనిక: పైన అందించిన సమాచారం జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాలు మరియు పంచాంగం ఆధారంగా రూపొందించినది. ఇవి కేవలం ప్రాథమిక అంచనాలు మాత్రమే. వ్యక్తిగత జాతక చక్రాల ఆధారంగా ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. మరింత ఖచ్చితమైన విశ్లేషణ కోసం నిపుణులైన సిద్ధాంతులను సంప్రదించడం ఉత్తమం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


