Jupiter Transit: జూన్ 2026 నుంచి దేవగురువు కటాక్షం.. కర్కాటకంలోకి బృహస్పతి.. ఈ రాశుల వారికి అదృష్టం పట్టినట్టే!
Jupiter Transit: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన గ్రహంగా భావించే దేవగురు బృహస్పతి (గురువు) తన గమనాన్ని మార్చబోతున్నారు. 2026 జూన్ 2వ తేదీన గురువు తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించనున్నారు. ఈ అరుదైన గోచారం వల్ల ద్వాదశ రాశుల జీవితాల్లో కీలక మార్పులు రానున్నాయి.
జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన గ్రహంగా భావించే దేవగురు బృహస్పతి (గురువు) తన గమనాన్ని మార్చబోతున్నారు. 2026 జూన్ 2వ తేదీన గురువు తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించనున్నారు. ఈ అరుదైన గోచారం వల్ల ద్వాదశ రాశుల జీవితాల్లో కీలక మార్పులు రానున్నాయి.

అక్టోబర్ వరకు గురుపాలన: ఆ రాశుల వారికి స్వర్ణయుగమే!
వేద జ్యోతిష్యం ప్రకారం గురువు ధనం, జ్ఞానం, సంతానం మరియు వైవాహిక జీవితానికి కారకుడు. 2026 జూన్ 2వ తేదీ ఉదయం 6:30 కి గురువు కర్కాటక రాశిలోకి అడుగుపెడతారు. సాధారణంగా గురువుకు కర్కాటక రాశి అంటే అత్యంత ఇష్టం. ఇక్కడ ఆయన తన పూర్తి శక్తిని ప్రదర్శిస్తారు. అక్టోబర్ 31, 2026 వరకు గురువు ఇదే రాశిలో ఉండి ప్రజల జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తారు. మరి ఈ ఐదు నెలల కాలం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం.
ద్వాదశ రాశుల ఫలితాలు ఇవే:
మేష రాశి:
కుటుంబంలో ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఆస్తి తగాదాలు పరిష్కారమై ఊరట లభిస్తుంది. అయితే, మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దవద్దు. మృదువుగా వ్యవహరిస్తేనే పనులు సాఫీగా సాగుతాయి.
వృషభ రాశి:
మీరు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు కూడా ఊహించని లాభాలను తెచ్చిపెడతాయి. తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది. కానీ, బద్ధకాన్ని దరి చేరనీయకండి. వాయిదా వేసే తత్వం వల్ల చేతికి అందాల్సిన అద్భుతమైన అవకాశాలు చేజారిపోయే ప్రమాదం ఉంది.
మిథున రాశి:
ఆర్థికంగా ఈ కాలం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ వస్తాయి. పొదుపు మంత్రాన్ని పాటిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
కర్కాటక రాశి:
గురువు మీ రాశిలోనే సంచరించడం వల్ల మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగు పడుతుంది. అయితే, అతి విశ్వాసంవల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, జాగ్రత్త!
సింహ రాశి:
ఖర్చులు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇవి విలాసాల కోసం కాకుండా శుభకార్యాల కోసం లేదా అవసరాల కోసమే అవుతాయి. విదేశీ ప్రయాణాలు లేదా ఇతర ప్రాంతాల నుంచి లాభాలు పొందుతారు. ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి.
కన్య రాశి:
ఆదాయం పెంచుకోవడానికి ఇది సరైన సమయం. పాత మిత్రుల సహకారం మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కోరికలు ఇప్పుడు నెరవేరుతాయి. ఎప్పుడూ చురుగ్గా ఉండేలా ప్లాన్ చేసుకోండి.
తులా రాశి:
ఈ సమయంలో ఈ రాశి వారికి ఉద్యోగ మార్పులు లేదా ప్రమోషన్లకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. బాధ్యతలు పెరిగినా మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సహోద్యోగులతో సఖ్యతగా ఉండండి. నేను అనే అహాన్ని వీడితేనే వృత్తిలో రాణిస్తారు.
వృశ్చిక రాశి:
అదృష్టం మీ వెంటే ఉంటుంది. తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు ఉన్నత విద్యలో విజయం సాధిస్తారు. చిన్నపాటి మనస్పర్థలను పెద్దవి చేయకుండా సర్దుకుపోవడం ఉత్తమం.
ధనుస్సు రాశి:
మీకు ఈ కాలం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఒక్కోసారి పనులు వేగంగా పూర్తవుతాయి, మరోసారి ఆటంకాలు ఎదురవుతాయి. డబ్బు విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. అనారోగ్య సమస్యల పట్ల అశ్రద్ధ వద్దు.
మకర రాశి:
వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. కొత్త ప్రణాళికలు అమలు చేయడానికి ఇది మంచి సమయం. తొందరపాటు నిర్ణయాలు వద్దు.
కుంభ రాశి:
కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కానీ కొంచెం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. ఓర్పుతో వ్యవహరిస్తే విజయం మీదే. ఖర్చులను అదుపులో పెట్టుకోవడం ఈ సమయంలో చాలా ముఖ్యం.
మీన రాశి:
జీవితంలో కొత్త మలుపులు వచ్చే అవకాశం ఉంది. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా, అవి భవిష్యత్తులో మీ విజయానికి పునాదులు వేస్తాయి. మానసిక ప్రశాంతత దొరుకుతుంది. బంధాలు మరింత ధృడపడతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


