...
...
Next Story

కాలసర్ప, పితృ దోషాల నుంచి విముక్తి పొందాలంటే.. శివుడికి ఇలా పూజ చేయండి!

జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం కాలసర్ప దోషం, పితృ దోషాల నివారణలో శివారాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కాలసర్ప దోషం రాహు–కేతువుల మధ్య అన్ని గ్రహాలు ఉండే జాతక స్థితితో సంబంధం కలిగి ఉంటుందని జ్యోతిష్య పద్ధతులు చెబుతాయి.

Published on: Sep 28, 2026, 12:30:42 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైనవిగా భావించే కాలసర్ప దోషం, పితృ దోషాల నివారణకు శివారాధన ఎంతో విశిష్టమైనది. సరైన పూజా విధానం, ప్రత్యేక మంత్రాల జపంతో జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను ఎలా తొలగించుకోవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.

కాలసర్ప, పితృ దోషాల నుంచి విముక్తి పొందాలంటే.. శివుడికి ఇలా పూజ చేయండి!
కాలసర్ప, పితృ దోషాల నుంచి విముక్తి పొందాలంటే.. శివుడికి ఇలా పూజ చేయండి!

హిందూ జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి మనిషి జాతకంలో గ్రహాల గమనం వారి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా కాలసర్ప దోషం మరియు పితృ దోషాలు ఉంటే కెరీర్ పరంగా, ఆర్థికంగా మరియు కుటుంబ జీవితంలో తీవ్రమైన ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడటానికి మన పురాణాల్లో కొన్ని ప్రత్యేక పరిహారాలు, పూజా విధానాలను సూచించారు. లయకారుడైన మహాశివుడిని పూజించడం ద్వారా ఈ దోషాల తీవ్రతను గణనీయంగా తగ్గించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

కాలసర్ప దోషం అంటే ఏమిటి? దాని ప్రభావం ఎలా ఉంటుంది?

జాతక చక్రంలో రాహువు, కేతువుల మధ్య అన్ని గ్రహాలు బంధించబడినప్పుడు కాలసర్ప దోషం ఏర్పడుతుంది. దీనివల్ల జీవితంలో అనుకోని అడ్డంకులు, మానసిక సంఘర్షణలు పెరుగుతాయి. ఈ దోష నివారణకు సాక్షాత్తు నాగభూషణుడైన శివుని ఆరాధన అత్యంత శక్తివంతమైన మార్గంగా నమ్ముతారు. సోమవారం, నాగపంచమి, అమావాస్య వంటి పవిత్ర తిథులలో శివాలయంలో విశేష పూజలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

సర్ప గాయత్రి జపంతో ప్రత్యేక ఫలితాలు

కాలసర్ప దోష నివారణ కోసం భక్తిశ్రద్ధలతో 'సర్ప గాయత్రీ మంత్రం' జపించడం మంచిది.

రాహు కేతు మంత్రం

ఉదయాన్నే తలస్మ్రానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి శివాలయానికి వెళ్లాలి. శివలింగానికి రుద్రాభిషేకం లేదా జలాభిషేకం చేసిన తర్వాత, రాగి లేదా వెండితో తయారు చేసిన జంట నాగులకు సమర్పించాలి. ఆ తర్వాత భక్తితో సర్ప గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూజ ముగిసిన తరువాత ఆ జంట నాగులను ఆలయంలో దానం చేయడం వల్ల దోష ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు.

పితృ దోషం - కారణాలు, నివారణ మార్గాలు

పూర్వీకుల తప్పులు, అసంపూర్తిగా మిగిలిన అంత్యక్రియలు లేదా వారి పట్ల చేయాల్సిన కర్మలు సక్రమంగా జరగకపోతే జాతకంలో పితృ దోషం ఏర్పడుతుంది. దీనివల్ల కుటుంబంలో అనవసర కలహాలు, ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుంటాయి. పితృ దోష విముక్తి కోసం పితృ పక్షంలో శ్రాద్ధ తర్పణాలు చేయడం ఎంత ముఖ్యమో, పరమశివుని రుద్ర రూపాన్ని ఆరాధించడం కూడా అంతే ముఖ్యం.

శివ గాయత్రీ మరియు మహామృత్యుంజయ మంత్రాలు

పితృ దోషాల నుంచి ఉపశమనం పొందడానికి శివ గాయత్రీ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మంత్రంతో పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. సాయంత్రం వేళ దక్షిణ దిశగా వెలుగుతున్న నూనె దీపాన్ని వెలిగించడం పితృ సంప్రదాయంలో భాగమే. అలాగే నల్లటి నువ్వులు కలిపిన నీటితో దక్షిణ దిశగా తర్పణం వదలడం వల్ల పితృ దోషం క్రమంగా తొలగిపోతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks