Kaala Sarpa Yogam: జాగ్రత్త! మే 11న అరిష్ట కాలసర్ప యోగం.. ఈ 4 రాశుల వారు అప్పులు, గొడవలకు దూరంగా ఉండాలి!

Kaala Sarpa Yogam: ఆకాశంలో అరుదైన గ్రహ సంచారం జరగబోతోంది. రాహువు, కేతువుల మధ్యలోకి గ్రహాలన్నీ చేరడంతో కాలసర్ప యోగం ఏర్పడనుంది. దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తప్పవని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Published on: May 7, 2026, 14:30:39 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కాల సర్ప యోగం అనేది చాలా ముఖ్యమైనది. అన్ని గ్రహాలు రాహువు, కేతువుల మధ్య ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఇలాంటి అరుదైన యోగం మే 11న ఏర్పడబోతోంది. సింహ రాశిలో ఉన్న కేతువు, కుంభరాశిలో ఉన్న రాహువు మధ్య అన్ని గ్రహాలు ఆ రోజు ఉండడంతో ఈ కాలసర్పయోగం ఏర్పడింది. ఈ యోగం మే 26 వరకు ఉంటుంది.

Kaala Sarpa Yogam: జాగ్రత్త! మే 11న అరిష్ట కాలసర్ప యోగం (pinterest)
Kaala Sarpa Yogam: జాగ్రత్త! మే 11న అరిష్ట కాలసర్ప యోగం (pinterest)

ఈ సమయంలో 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అనేక విధాలుగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి కాలసర్పయోగం వలన ఏ రాశుల వారికి సమస్యలు వస్తాయి? ఎవరు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

అరుదైన కాలసర్పయోగం... నాలుగు రాశుల వారికి ప్రమాదాలు, జాగ్రత్తగా ఉండాలి

1.వృషభ రాశి:

వృషభ రాశి వారికి ఈ యోగం వలన ఇబ్బందులు వస్తాయి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రత్యర్థులు పనిలో చాలా ముందుంటారు. కాబట్టి మీరు ఏ పనినైనా జాగ్రత్తగా పూర్తి చేయడం మంచిది.

2.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి కూడా ఇది చాలెంజింగ్ టైమ్ అని చెప్పొచ్చు. రాహు, కేతువుల ప్రభావం వలన ఒత్తిడి పెరుగుతుంది. భయం కూడా పెరుగుతుంది. పని ప్రదేశంలో చికాకులు, సమస్యలు ఉండొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు మాటను అదుపులో ఉంచుకోవడం మంచిది. రిలేషన్‌షిప్ కూడా దెబ్బతినకుండా చూసుకోవాలి.

3.కుంభ రాశి:

కుంభ రాశి వారికి ఇది ఇబ్బందులను తీసుకువచ్చే సమయం. ఈ సమయంలో ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న గొడవలు లేకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యమైన ప్రాజెక్టుల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉదర సమస్యలు, గొంతు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

4.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి కూడా ఇది ఇబ్బందులను తీసుకొచ్చే సమయం. కాలసర్ప యోగం వలన ఈ రాశి వారికి టెన్షన్లు పెరిగిపోతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా కొత్తవారిని నమ్మకండి. ఖర్చులు పెరిగిపోయే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More