ఏకాదశి తిథికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఏకాదశి నాడు విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు. సనాతన ధర్మంలో ఏకాదశి శ్రీమహావిష్ణువు ఆరాధనకు అత్యంత పవిత్రమైనది. ఆషాఢ కృష్ణపక్ష కామిక ఏకాదశి ఈ ఏడాది ఆగస్టు 9, ఆదివారం నాడు వచ్చింది.

ఏకాదశి తిథి ప్రారంభం: ఆగస్టు 8, శనివారం మధ్యాహ్నం 1:59 గంటలకు
ఏకాదశి తిథి ముగింపు: ఆగస్టు 9, ఆదివారం ఉదయం 11:04 గంటలకు
ధార్మిక విశ్వాసాల ప్రకారం, ఏకాదశి నాడు శ్రీమహా విష్ణువును విధివిధానాలతో పూజించి ఉపవాసం ఉండడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి. మహాలక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి కూడా వీలవుతుంది. ఆ రోజు చేసే శుభకార్యాలు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయని నమ్మకం. కామిక ఏకాదశి రోజున ఈ పరిహారాలను కూడా పాటిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. విష్ణుమూర్తి, మహాలక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు.
తులసి పూజ, విష్ణు ఆరాధన
కామిక ఏకాదశి నాడు తులసి పూజ చేయడం వల్ల మంచి ఫలితాలను చూడొచ్చు. తులసి మొక్క ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. "ఓం వాసుదేవాయ నమః" మంత్రాన్ని జపిస్తూ 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి. ప్రతికూల శక్తుల నుంచి కూడా బయటపడవచ్చని నమ్మకం.
అభిషేకం, మంత్ర జపం, పారాయణం
ఏకాదశి నాడు స్నానం చేసిన తర్వాత కుంకుమపువ్వు కలిపిన పాలతో శ్రీమహావిష్ణువుకు అభిషేకం చేయండి. ఆ తర్వాత తులసి మాలతో "ఓం నమో భగవతే వాసుదేవాయ నమః" అనే మంత్రాన్ని జపించండి. శ్రీమద్భాగవతం పారాయణం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి.
విష్ణువు, లక్ష్మీదేవి ఆరాధన
శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మీ దేవిని కలిసి ఆ రోజు ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. పసుపు రంగు పూలను, పసుపు రంగు పండ్లను సమర్పించండి. పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఆర్థికాభివృద్ధి, ధన లాభం కలుగుతుందని విశ్వాసం.
వస్త్రాలు, ధాన్యాల దానం
{{/usCountry}}శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మీ దేవిని కలిసి ఆ రోజు ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. పసుపు రంగు పూలను, పసుపు రంగు పండ్లను సమర్పించండి. పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఆర్థికాభివృద్ధి, ధన లాభం కలుగుతుందని విశ్వాసం.
వస్త్రాలు, ధాన్యాల దానం
{{/usCountry}}పసుపు రంగు వస్త్రాలు, ధాన్యాలు, పండ్లను పేదలకు లేదా అవసరమైన వారికి దానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం ద్వారా సానుకూల శక్తి పెరిగి, ఐశ్వర్యం లభిస్తుందని నమ్ముతారు.
దక్షిణావర్తి శంఖం, రావి చెట్టు పూజ
ధార్మిక విశ్వాసాల ప్రకారం రావి చెట్టులో శ్రీమహా విష్ణువు నివసిస్తాడని అంటారు. కనుక ఈ ఏకాదశి నాడు రావి చెట్టుకు నీరు సమర్పించండి. అలాగే దక్షిణావర్తి శంఖాన్ని పూజించడం వల్ల లక్ష్మీదేవి, శ్రీమహావిష్ణువుల అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. ఇలా కామిక ఏకాదశి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే ఐశ్వర్యం, అదృష్టం పెరిగి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని విశ్వసిస్తారు.