ఈరోజే అక్షయ నవమి 2026: ఈ 5 వస్తువులు దానం చేస్తే అక్షయ పుణ్యం లభిస్తుందా? ఉసిరి చెట్టు పూజ విశిష్టత ఇదే!

హిందూ సంప్రదాయంలో కార్తీక మాసంలో వచ్చే అక్షయ నవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున పూజలు, జపాలు, తపస్సుతో పాటు దానధర్మాలు చేయడం వల్ల అక్షయ పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. 

Published on: Nov 18, 2026, 08:01:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఈరోజే అక్షయ నవమి. హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఈ నెలలో వచ్చే అక్షయ నవమి కూడా చాలా విశేషమైనది. ఈరోజు చేసే పూజలు, జపాలు, తపస్సు, దానధర్మాలతో ఎంతో పుణ్యఫలాన్ని పొందవచ్చు.

ఈరోజే అక్షయ నవమి 2026: ఈ 5 వస్తువులు దానం చేస్తే అక్షయ పుణ్యం లభిస్తుందా? ఉసిరి చెట్టు పూజ విశిష్టత ఇదే! (AI)
ఈరోజే అక్షయ నవమి 2026: ఈ 5 వస్తువులు దానం చేస్తే అక్షయ పుణ్యం లభిస్తుందా? ఉసిరి చెట్టు పూజ విశిష్టత ఇదే! (AI)

అలాగే అక్షయ నవమి నాడు చేసే దానాలు ఏవి? వేటిని దానం చేయడం వలన అక్షయ పుణ్యం లభిస్తుంది? పురాణాలు ఏం చెబుతున్నాయి? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నదానం

అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని హిందూ ధర్మంలో చెబుతారు. అన్నదానాన్ని మహాదానంగా భావిస్తారు. ఆకలితో ఉన్నవాళ్లకు అన్నాన్ని అందిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. అక్షయ నవమి నాడు పేదలకు, అవసరమైన వారికి అన్నదానం చేయడం మంచిది. ఉసిరి చెట్టు కింద వనభోజనాలు ఏర్పాటు చేసి అందరూ కలిసి కూర్చుని భోజనం చేయడం వలన బంధాలు బలపడతాయి. అలాగే ఈ పర్వదినం నాడు చాలా మంది ఈ పద్ధతిని పాటిస్తారు.

ఉసిరికాయ దానం

అక్షయ నవమి నాడు ఉసిరి చెట్టును పూజించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. ఉసిరి చెట్టులో మహావిష్ణువు కొలువై ఉంటాడు. అందుకనే ఉసిరి చెట్టును మహావృక్షంగా చెబుతారు. ఈరోజు ఉసిరికాయలను దానం చేస్తే కూడా మంచిది.

వస్త్రదానం

అక్షయ నవమి నాడు వస్త్రదానం చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి. అవసరమైన వారికి కొత్త బట్టలు లేదా ఉపయోగించడానికి అనువైన శుభ్రమైన వస్త్రాలను ఇస్తే ఎంతో పుణ్యం వస్తుంది.

గుమ్మడికాయ దానం

అక్షయ నవమి నాడు గుమ్మడికాయను దానం చేయడం మంచిదే. దీనిని దానం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. మహావిష్ణువు కూష్మాండకుడు అనే రాక్షసుడిని సంహరించినప్పుడు, అతని శరీరం నుంచి గుమ్మడికాయ తీగ ఉద్భవించిందని పురాణాలు తెలుపుతున్నాయి. అందుకే ఆరోజు గుమ్మడికాయ దానం చేయడం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు.

దీపదానం

కార్తీక మాసంలో దీపదానం చేయడం చాలా మంచిది. దేవాలయాల్లో లేదా పవిత్రమైన ప్రదేశాల్లో దీపాలను వెలిగించి, నూనె లేదా దీప సామగ్రిని అవసరమైన వారికి ఇస్తే శుభఫలితాలు కలుగుతాయి.

అక్షయ నవమి దానాల వెనుక ఉన్న విశిష్టత

అక్షయ నవమి నాడు చేసే దానాలు అక్షయ పుణ్యఫలితాన్ని అందిస్తాయి. దానంలో వస్తువు విలువ కంటే దానం చేసే వ్యక్తి మనసు నిస్వార్థమైనదిగా ఉండటం ముఖ్యం.

ఉసిరి చెట్టు - లక్ష్మీదేవి

ఒకసారి లక్ష్మీదేవి భూలోక సంచారానికి వచ్చినప్పుడు, విష్ణువుతో పాటు శివుడిని కూడా ఒకేసారి పూజించాలని అనుకుంటుంది. విష్ణుమూర్తి ఆరాధనకు తులసి దళాలు, శివుడి పూజకు బిల్వపత్రాలు చాలా ముఖ్యమైనవి. ఈ రెండింటినీ ఒకేసారి సమర్పించి హరిహరులను ఆరాధించే మార్గం గురించి ఆమె ఆలోచించింది. అప్పుడు ఉసిరి చెట్టులో తులసి, మారేడు వృక్షాల దైవిక గుణాలు ఉన్నాయని, ఈ చెట్టులో హరిహరులు ఇద్దరూ కొలువై ఉంటారని తెలుస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More