చాలా మంది కార్తీక మాసంలో భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు దేవుని ఏకాదశిని జరుపుకుంటాము. ఈ ఏడాది దేవుత్తాన ఏకాదశి ఈరోజు అంటే నవంబర్ 1న వచ్చింది. ఈరోజు నుంచి శుభకార్యాలు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత రోజు తులసి వివాహం చేస్తారు. ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు విష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు. అప్పుడు శుభకార్యాలు ఆగుతాయి.

చతుర్మాస్య వ్రత దీక్ష ముగిసాక కార్తీక శుక్ల ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల పాటు పితృకార్యాలు జరుపుతారు. ఈరోజు నుంచి అంటే దేవుత్తాన ఏకాదశి నుంచి మళ్లీ శుభకార్యాలు మొదలవుతాయి. దేవుత్తాన ఏకాదశి నాడు పాపాలన్నీ తొలగిపోవాలంటే ఈ పనులు చేయండి. ఇక అంతా మంచే జరుగుతుంది:
దేవుత్తాన ఏకాదశి నాడు ఇలా చేస్తే ఎంతో మంచి జరుగుతుంది:
- ఈ ఏకాదశి నాడు విష్ణువుకు పంచామృతాలతో అభిషేకం చేయండి. ఇలా ఈ రోజు చేయడం వలన వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది. నైపుణ్యాలను ప్రదర్శించడానికి కొత్త అవకాశాలను పొందవచ్చు.
- ఈరోజు చేసే దానాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. పేదవారికి, అవసరమైన వారికి వస్త్రాలు, ఆహారం వంటి వాటిని దానంగా ఇవ్వండి.
- వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నట్లయితే ఈ ఏకాదశి నాడు తులసి, విష్ణుమూర్తిని ఆరాధించండి. దంపతులు ఇద్దరూ కలిసి ఆరాధిస్తే దాంపత్య జీవితంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవికి, తులసి మాతకు అలంకరణ వస్తువులు సమర్పిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.
- ఈ విశేషమైన రోజు భాగవతాన్ని పఠిస్తే కూడా మంచి జరుగుతుంది.
- ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లయితే, బ్రహ్మముహూర్తంలో విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించండి. తమలపాకులపై “ఓం విష్ణవే నమః” అని రాసి విష్ణు పాదాల దగ్గర పెట్టండి. ఆ తర్వాత రోజు ఈ ఆకును పసుపు వస్త్రంలో పెట్టి భద్రంగా విలువైన వస్తువులు దాచుకునే చోట ఉంచండి.
- ఈరోజు రావి చెట్టు కింద నెయ్యితో దీపారాధన చేస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. ఆ తర్వాత ప్రదక్షిణలు చేసి విష్ణువుతో పాటుగా లక్ష్మీదేవిని ఆరాధించండి. విష్ణు, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి పేదరికం నుంచి కూడా బయటపడవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
{{/usCountry}}గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
{{/usCountry}}