దిండు కింద ఈ వస్తువులు పెడితే అదృష్టం కలిసొస్తుందట.. జ్యోతిష్య పరిహారాలు ఇవే!

దిండు కింద నెమలి ఈక, పసుపు కొమ్ము, లవంగాలు, యాలకులు, వెండి నాణెం, తులసి ఆకులు, పటిక ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి జ్యోతిష్య విశ్వాసాలు ఏమి చెబుతున్నాయో తెలుసుకోండి. మానసిక ప్రశాంతత, సానుకూల శక్తి, అదృష్టానికి సంబంధించిన సంప్రదాయ పరిహారాల వివరాలు చదవండి.

Published on: Jul 20, 2026, 16:00:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలామంది రకరకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఏదైనా ఇబ్బంది వస్తే జ్యోతిష్య నిపుణుల సలహాలు కూడా తీసుకుంటూ ఉంటారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, అదృష్టం కలగడానికి ఈ పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయని నమ్ముతారు. చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నా కుదరకపోతున్నట్లయితే, ఈ పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయని చెబుతారు. అలాగే సానుకూల శక్తిని, మానసిక ప్రశాంతతను కూడా పెంపొందిస్తాయని విశ్వసిస్తారు.

దిండు కింద ఈ వస్తువులు పెడితే అదృష్టం కలిసొస్తుందట.. జ్యోతిష్య పరిహారాలు ఇవే! (pinterest)
దిండు కింద ఈ వస్తువులు పెడితే అదృష్టం కలిసొస్తుందట.. జ్యోతిష్య పరిహారాలు ఇవే! (pinterest)

నిద్రపోయేటప్పుడు మన చుట్టూ ఉండే వస్తువులు మనపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని నమ్మకం. నిద్రపోయేటప్పుడు కొన్ని వస్తువులను దిండు కింద పెట్టినట్లయితే అదృష్టం, మానసిక ప్రశాంతత, సానుకూల శక్తి పెరుగుతాయని చెబుతారు. మరి ఈసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. జ్యోతిష్యం ప్రకారం ఈ వస్తువులను దిండు కింద పెట్టుకుంటే అదృష్టం కలుగుతుందని విశ్వసిస్తారు.

నెమలి ఈక

నెమలి ఈకకు కృష్ణుడితో ప్రత్యేకమైన అనుబంధం ఉందని విశ్వాసాలు చెబుతున్నాయి. దిండు కింద నెమలి ఈకను పెట్టుకుని నిద్రిస్తే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. చెడు కలలు కూడా తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంతోషం, శ్రేయస్సు, శుభం కలుగుతాయని నమ్ముతారు.

పసుపు కొమ్ము, లవంగాల పరిహారం

పసుపు గురు గ్రహానికి, శుభానికి ప్రతీకగా భావిస్తారు. దిండు కింద పసుపు కొమ్ము పెట్టుకుని నిద్రపోవడం వల్ల అనేక విధాలుగా లాభాలు కలుగుతాయని నమ్ముతారు. వివాహం, విద్య, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని చెబుతారు.

అలాగే, దిండు కింద లవంగాలు పెట్టుకుని నిద్రపోవడం వల్ల ప్రతికూల శక్తి తొలగి సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు. ఆందోళన తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతారు.

యాలకులు, వెండి నాణెం

ఈ రెండు కూడా అద్భుతంగా పనిచేస్తాయని విశ్వసిస్తారు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే, రాత్రి నిద్రపోయేటప్పుడు ఒకటి లేదా మూడు పచ్చ యాలకులను దిండు కింద ఉంచండి. మరుసటి రోజు వాటిని ఎవరికైనా దానం చేయండి. ఇలా చేస్తే బుధ గ్రహం అనుకూలంగా మారి మంచి ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు.

వెండి నాణెాన్ని చంద్ర గ్రహానికి ప్రతీకగా భావిస్తారు. నిద్రపోయేటప్పుడు ఒక వెండి నాణెాన్ని దిండు కింద పెట్టుకుంటే మానసిక ప్రశాంతత లభించి, ఒత్తిడి తగ్గి, ఆర్థిక స్థిరత్వం కలుగుతుందని చెబుతారు.

తులసి ఆకులు

నిద్రపోయేటప్పుడు దిండు కింద ఎండిన తులసి ఆకులను చిన్న వస్త్రంలో కట్టి పెట్టినట్లయితే సానుకూల శక్తి పెరిగి, మానసిక ప్రశాంతత కూడా పొందవచ్చని విశ్వసిస్తారు.

పటిక

నిద్రపోయేటప్పుడు ఎర్రటి వస్త్రంలో పటికను చుట్టి దిండు కింద పెట్టుకుంటే దృష్టిదోషం, ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతాయని నమ్ముతారు. ప్రశాంతంగా, సంతోషంగా ఉండొచ్చని, కష్టాలు కూడా తొలగిపోతాయని చెబుతారు.

ప్రశాంతమైన మనసు

ఈ పరిహారాలను పాటించడంతో పాటు సానుకూల ఆలోచనలను కూడా కలిగి ఉండాలి. ప్రశాంతమైన మనసుతో, మంచి సంకల్పంతో ఈ పరిహారాలను ఆచరిస్తే సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More