Ketu Transit 2026: కేతువు అనుగ్రహంతో ఈ నాలుగు రాశుల వారి కష్టాలు తొలగిపోతాయి, అదృష్టం, డబ్బుతో పాటు మరెన్నో!
గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారిపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్నిసార్లు సానుకూల మార్పులు వస్తే, కొన్నిసార్లు ప్రతికూలతతో బాధపడాల్సి ఉంటుంది. కేతువు కూడా కాలానుగుణంగా తన నక్షత్రాలను, రాశులను మారుస్తూ ఉంటాడు. కేతువు అనుగ్రహంతో ఈ రాశుల వారి కష్టాలు తొలగిపోతాయి.
గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారిపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్నిసార్లు సానుకూల మార్పులు వస్తే, కొన్నిసార్లు ప్రతికూలతతో బాధపడాల్సి ఉంటుంది. కేతువు కూడా కాలానుగుణంగా తన నక్షత్రాలను, రాశులను మారుస్తూ ఉంటాడు.

కేతువు సంచారం కూడా అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకు వస్తుంది. నీడ గ్రహమైనటువంటి కేతువు మఖ నక్షత్రం మూడవ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. ఇది అన్ని రాశుల వారి జీవితాల్లో వివిధ మార్పులను తీసుకొస్తుంది.
కేతువు సంచారం 2026
కేతువు సంచారంలో మార్పు మే 31, 2026 ఆదివారం ఉదయం 2:28కి జరుగుతుంది. ఈ సమయంలో కేతువు మఖ నక్షత్రం మూడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీంతో అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.
ఈ సంచారం ఆగస్టు 2 వరకు కొనసాగుతుంది. అయితే కొన్ని రాశుల వారు సమస్యలు ఎదుర్కొంటే, కొన్ని రాశుల వారు మాత్రం అనేక విధాలుగా లాభాలను పొందుతారు. మరి కేతువు సంచారంతో ఏ రాశి వారికి లాభాలు కలుగుతాయి? ఆ అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.
కేతువు అనుగ్రహంతో ఈ రాశుల వారి కష్టాలు తొలగిపోతాయి, అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి
1.వృషభ రాశి
వృషభ రాశి వారికి కేతువు నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు వ్యాపారంలో కొత్త అవకాశాలను పొందుతారు. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. సానుకూల మార్పులను చూస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. మతపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
2.మిథున రాశి
మిథున రాశి వారికి కేతువు నక్షత్ర సంచారం వివిధ లాభాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు చక్కటి మార్పులను చూస్తారు. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో ఎక్కువగా లాభాలు చూస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగులకు కూడా ఇదే శుభప్రదమైన సమయం. ప్రయాణాలు చేయాలనుకునే వారికి కూడా ఇది అద్భుతమైన సమయం.
3.తులా రాశి
తులా రాశి వారికి కేతువు నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పురోగతిని చూస్తారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. కెరీర్‌లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. ఈ సమయంలో ఈ రాశి వారి పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. టెన్షన్లు అన్నీ తొలగిపోతాయి. ప్రశాంతత ఉంటుంది.
4.కుంభ రాశి
ఈ రాశి వారికి ఇది శుభప్రదమైన సమయం. కుంభ రాశి వారికి కేతువు నక్షత్ర సంచారం అనేక లాభాలను తీసుకొస్తుంది. కెరీర్‌లో మంచి మార్పులు చూస్తారు. ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే భారీగా లాభాలు వస్తాయి. జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. కెరీర్‌లో బాగా కలిసి వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


