...
...
Next Story

Kindest Rasis: పరోపకారంలో ఈ నాలుగు రాశుల వారే టాప్.. వీరి మనసు వెన్న, ఎదుటివారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు!

Kindest Rasis: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నాలుగు రాశుల వారు దయాగుణం, సేవాభావంలో ఎప్పుడూ ముందుంటారు. నిస్వార్థంగా సాయం చేయడంలో వీరిది ప్రత్యేక శైలి. వీరి మనసు వెన్న, ఎదుటివారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు. మాటలే సగం బాధను పోగొడతాయి. ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు. వీరిలో మీరూ ఉన్నారా?

Published on: Apr 15, 2026, 09:30:28 IST
Advertisement

Kindest Rasis: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి స్వభావం వారి రాశి చక్రంపై ఆధారపడి ఉంటుంది. కొందరు కోపంగా ఉంటే, మరి కొందరు అత్యంత సున్నిత మనస్కులుగా ఉంటారు. అయితే, పన్నెండు రాశుల్లో నాలుగు రాశుల వారు మాత్రం పరోపకారానికి మారుపేరుగా నిలుస్తారు. వీరు తమ సౌకర్యాలను సైతం పక్కన పెట్టి ఎదుటివారికి అండగా నిలుస్తారు. కేవలం మాటలతోనే కాకుండా, చేతల్లోనూ మానవత్వాన్ని చాటుకునే ఆ రాశుల విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

1.కర్కాటక రాశి:

పరోపకారంలో ఈ నాలుగు రాశుల వారే టాప్.. వీరి మనసు వెన్న
పరోపకారంలో ఈ నాలుగు రాశుల వారే టాప్.. వీరి మనసు వెన్న

కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడి ప్రభావం వల్ల వీరు అత్యంత సౌమ్యులుగా, భావోద్వేగభరితమైన వ్యక్తులుగా ఉంటారు. తమ కుటుంబ సభ్యులే కాకుండా, కష్టాల్లో ఉన్న అపరిచితులకు కూడా వీరు వెంటనే స్పందిస్తారు. తమ మనసులో ఎన్ని బాధలు ఉన్నా, ఇతరుల కన్నీళ్లను తుడవడంలో వీరు ముందుంటారు. కర్కాటక రాశి వారు ఎదుటివారి కష్టాన్ని తమ కష్టంగా భావిస్తారు. వారి ఓదార్పు మాటలే సగం బాధను పోగొడతాయి.

2.తులా రాశి:

శుక్రుడు అధిపతిగా ఉన్న తులా రాశి వారు సామాజికంగా చాలా యాక్టివ్‌గా ఉంటారు. వీరు స్నేహితులను కూడా సొంత కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటారు. ఎక్కడ అన్యాయం జరిగినా వీరు సహించరు.

సమాజంలో సమతుల్యతను కాపాడటంతో పాటు, ఆపదలో ఉన్నవారికి తమ వంతు సాయం అందించడంలో వెనకాడరు. ఎదుటివారి ముఖంలో చిరునవ్వు చూడటమే వీరి పరమావధి. వీరు తమ వ్యక్తిగత పనులను వాయిదా వేసుకుని మరీ ఇతరులకు అండగా నిలబడటం వీరి గొప్పతనం.

3.ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారు పుట్టుకతోనే పరోపకారులు. సాయం చేయడాన్ని వీరు ఒక ధర్మంగా భావిస్తారు. సమాజ సేవ, దానధర్మాలు చేయడంలో వీరికి వీరే సాటి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే చాలు, తమ శక్తిని మొత్తం ధారపోసి ఆ సమస్యను పరిష్కరించే వరకు నిద్రపోరు. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయడం ధనుస్సు రాశి వారి ప్రత్యేకత. వీరి దయా గుణం వల్ల సమాజంలో వీరికి ప్రత్యేక గౌరవం లభిస్తుంది.

4.మీన రాశి:

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe