...
...
Next Story

Kumara Swamy Birth: కుమార స్వామి పార్వతీ పుత్రుడా, గంగా పుత్రుడా? కుమార స్వామికి ఈ పేర్లు ఎలా వచ్చాయో కూడా తెలుసుకోండి!

కుమార స్వామి పార్వతీదేవి పుత్రుడా, గంగాదేవి పుత్రుడా అని.. ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలుసా? కుమారస్వామి ఎవరి పుత్రుడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నిప్పుముద్ద ఒడ్డు నుంచి పళ్లానికి జారి పడినందుకు స్కందుడు అనే పేరు వచ్చింది. కృత్తికా స్త్రీలు పెంచినందుకు కార్తికేయుడు అనే పేరు వచ్చింది.

Published on: Feb 23, 2026, 13:31:07 IST
Advertisement

చాలా మందికి ఈ విషయం తెలియదు. కుమారస్వామి పార్వతీదేవి పుత్రుడా, లేదంటే గంగాదేవి పుత్రుడా అని.. ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలుసా? కుమారస్వామి ఎవరి పుత్రుడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కుమార స్వామి పార్వతీదేవి పుత్రుడా, గంగాదేవి పుత్రుడా?

పుత్రుడిగా జన్మించాలని కోరుకున్న శివుడు

కుమార స్వామి పార్వతీదేవి పుత్రుడా, గంగాదేవి పుత్రుడా? (pinterest)
కుమార స్వామి పార్వతీదేవి పుత్రుడా, గంగాదేవి పుత్రుడా? (pinterest)

బ్రహ్మ మానసపుత్రుడు అయిన సనత్కుమారుడు ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉండేవాడు. ఎల్లవేళలా ఆయన తపస్సులోనే నిమగ్నం అయ్యేవాడు. వైరాగ్యమూర్తి అయిన సనత్కుమారుడికి ఇంకో జన్మ ఉందని తెలిసిన పార్వతీ పరమేశ్వరులు తపోనిష్ఠగా గరిష్ఠుడైన సనత్కుమారుడిని పుత్రుడిగా పొందాలని అనుకున్నారు. అందుకు సంకల్పించి పరమేశ్వరుడు తపస్సు చేస్తున్న సనత్కుమారుడి దగ్గరకు వెళ్లి, “సనత్కుమారా! నువ్వు నాకు పుత్రుడిగా జన్మించాలని నేను కోరుకుంటున్నాను” అని అడగగా, సనత్కుమారుడు అలాగే అవుతుందని వరం ఇచ్చాడు.

సనత్కుమారుడికి చెప్పినా ఫలితం లేదు

ఇది తెలిసిన పార్వతీదేవి ఎంతో ఆశ్చర్యపోయింది. “పురుషుడైన నీవు నాకు పుత్రుడిగా జన్మించు అని ఎలా అడిగావు? అది అవ్వదు. కాబట్టి మాకు పుత్రుడిగా జన్మించమని అడుగు” అని పరమేశ్వరుణ్ని పంపింది. పరమేశ్వరుడు ఈ విషయాన్ని సనత్కుమారుడికి చెప్పాడు. కానీ ఫలితం లేకపోయింది.

నిప్పు ముద్దగా పరమేశ్వరుడు

కొంతకాలానికి సనత్కుమారుడు నిప్పుముద్దగా పరమేశ్వరుడులోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఆ నిప్పుముద్ద భరించలేనంత వేడితో శివుని త్రినేత్రం నుంచి వేగంగా బయటకు వచ్చేసింది. శరవణ తటాకం, అనగా గంగలో పడింది. ఆ వేడిని భరించలేని గంగ ఆ నిప్పుముద్దను ఒడ్డుకు నెట్టేసింది. అది మెల్లగా ఒడ్డుకి కొంచెం పల్లంలో ఉన్న రెళ్ళు గడ్డిలోకి జారిపోయింది. అక్కడికి వచ్చిన ఆరుగురు కృత్తికా స్త్రీలు స్థనాలను (తల్లి పాలు) ఇవ్వబోగా, కుమారుడిగా మారిపోయింది.

మొదట కుమారస్వామి నిప్పుముద్ద రూపంలో ఉన్నందుకు అగ్నిపుత్రుడు అనే పేరు వచ్చింది.

అలాగే ప్రపంచంలో ఉన్న ఎలాంటి వస్తువునైనా దహించి, వాటిలో ఉన్న చెడును తొలగించే శక్తి అగ్నికి ఉన్నందుకు సుబ్రహ్మణ్యుడు అనే పేరు కూడా వచ్చింది.

ఆ నిప్పుముద్ద శరవణ తటాకంలో పడినందుకు శరవణభవుడు అనే పేరు వచ్చింది.

నిప్పుముద్ద గంగలో కొంచెం దూరం ప్రయాణం చేసినందుకు గంగాపుత్రుడు, గాంగేయుడు అని కూడా అంటారు.

నిప్పుముద్ద ఒడ్డు నుంచి పళ్లానికి జారి పడినందుకు స్కందుడు అనే పేరు వచ్చింది.

కృత్తికా స్త్రీలు పాలను ఇచ్చి పెంచినందుకు కార్తికేయుడు అనే పేరు వచ్చింది.

నిప్పుముద్ద తేజోవంతుడైన కుమారునిగా మారినందుకు కుమారుడు అనే పేరు వచ్చింది. దేవత కళలు ఉట్టిపడుతుండడంతో కుమారస్వామి అనే పేర్లు వచ్చాయి. ఆరు ముఖాలతో వెలిగిపోవడంతో షణ్ముఖుడు అనే పేరు కూడా వచ్చింది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe