...
...
Next Story

Dreams: కలల వెనుక దాగున్న ధన సంకేతాలు.. ఈ 10 కలలు వస్తే త్వరలో డబ్బు రావడం ఖాయం అంటున్న జ్యోతిష్యం!

మనం నిద్రలో కనే కలలు కేవలం ఊహలు మాత్రమే కావు, అవి మన భవిష్యత్తుకు సూచికలని స్వప్న శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా కొన్ని రకాల కలలు వస్తే మీకు అపారమైన ధనలాభం కలగబోతుందని అర్థం. ఈ కలలు వస్తే త్వరలో డబ్బు రావడం ఖాయం అంటున్న జ్యోతిష్యం.

Published on: May 11, 2026, 10:31:00 IST
Advertisement

మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు కంటూ ఉంటాం. కొన్ని కలల్ని నిద్రలేచిన వెంటనే మర్చిపోతూ ఉంటాం కూడా. అయితే మన కలలు చాలా విషయాలను తెలుపుతాయి. స్వప్న శాస్త్రం ప్రకారం మనకి వచ్చే కలలు ఆధారంగా అవి శుభ కలలా, అశుభ కలలా అనేది తెలుసుకోవచ్చు. కొన్ని కలలు మంచి ఫలితాలను ఇస్తే, కొన్ని కలలు ద్వారా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కలలు వస్తే మాత్రం డబ్బు రావడం ఖాయం. జ్యోతిష్యం ప్రకారం ఈ కలలు వస్తే మాత్రం విపరీతమైన లాభాలు కలుగుతాయి.

ఈ కలలు వస్తే త్వరలో డబ్బు రావడం ఖాయం అంటున్న జ్యోతిష్యం

1.అగ్ని గురించి కలలు

కలల వెనుక దాగున్న ధన సంకేతాలు.. ఈ 10 కలలు వస్తే త్వరలో డబ్బు రావడం ఖాయం అంటున్న జ్యోతిష్యం! (pinterest)
కలల వెనుక దాగున్న ధన సంకేతాలు.. ఈ 10 కలలు వస్తే త్వరలో డబ్బు రావడం ఖాయం అంటున్న జ్యోతిష్యం! (pinterest)

కలలో అగ్ని కనపడితే అది ధన సంపదకు సూచనగా భావించాలి. అగ్ని కనిపించడం వలన సంపద పెరుగుతుందట. కలలో దీపం లేదా కొవ్వొత్తి కనపడితే కూడా విపరీతమైన అదృష్టం కలుగుతుంది. దీంతో వేగంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి.

2.నీటి గురించి కలలు

స్వప్న శాస్త్రం ప్రకారం నీరు సంపదకు సంకేతం. నదులు కలలో కనపడితే ధనలాభం కలుగుతుంది. నీటిని తాగుతున్నట్లు కల వస్తే అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. పడవలో నీరు కనపడితే సంపద పెరుగుతుందని అర్థం. బావిలో మట్టి కనపడితే కూడా సంపద పెరగబోతుందని, బావిలో నీరు మరిగినట్లు కనబడితే ఆర్థిక విజయాలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి.

3.చేపలు, పురుగుల గురించి కలలు

చేపలు, పాము, తాబేలు లాంటి జీవులు కలలో కనపడితే శుభ సూచకంగా భావించాలి. చేపల గుంపు ఈదుతున్నట్లు కనబడితే మాత్రం ఆర్థిక లాభం కలుగుతుంది. తాబేలు, పాము ఎదురెదురుగా కనపడితే ఆర్థికపరంగా లాభాలు కలగబోతున్నాయని అర్థం. తేనెటీగ కుట్టినట్లు కలలు వచ్చినట్లయితే ఆనందం, సంపద పెరగబోతున్నాయని అర్థం చేసుకోవాలి.

4.ధాన్యాలు, మొక్కలు

గోధుమలు, బియ్యం లాంటి ధాన్యాలు కలలో కనపడితే సంపద పెరగబోతుందని అర్థం. పంటలు బాగా పండుతున్నట్లు కనబడితే ఆర్థిక అభివృద్ధి జరుగుతోందని అర్థం. పొలాల్లో గడ్డి కనపడితే ధనలాభం కలుగుతుంది. పెద్ద చెట్లను నరుకుతున్నట్లు కనబడితే ఆర్థిక లాభం కలుగుతుందని అర్థం చేసుకోవాలి.

5.శవపేటికలు, మరణించిన వారి గురించి కలలు

కలలో రక్తం కనబడితే సంపదకు సంకేతంగా భావించాలి. రక్తం ప్రవహించే నది కనబడితే కూడా అదృష్టంగా భావించాలి.

7.జంతువుల గురించి కలలు

కలలో జంతువులు కనబడితే కొన్నిసార్లు అదృష్టంగా భావించాలి. డ్రాగన్, పాము, కొంగ, చెట్టుపై కోడి కనబడితే ఆర్థిక లాభాలు కలగనున్నాయని అర్థం. పిల్లి ఎలుకను పట్టుకున్నట్లు కనపడితే ఆర్థిక లాభాలను చూడొచ్చు. గాడిద కలలో కనపడితే కూడా అదృష్టమే.

8.లోహ వస్తువులు

కలలో లోహ వస్తువులు కనపడితే శుభ సంకేతంగా, ధనలాభంగా భావించాలి. ఇనుప వస్తువులు కలలో కనపడితే సంపద పెరుగుతుంది. అల్యూమినియం కనబడితే ధనలాభం కలుగుతుంది.

9.జీవిత సంఘటనలు

ఎవరైనా జైలుకు వెళ్లినట్లు కనబడితే అదృష్టంగా భావించాలి. అవమానించినట్లు కల వస్తే ధనలాభం రాబోతోందని అర్థం. కలలో ఎవరైనా తన్నినట్లు కనపడితే ఆర్థిక ప్రయోజనాలు రాబోతున్నాయని అర్థం. రంగురంగుల కాగితాలు కలలో కనపడితే భారీగా లాభాలు రాబోతున్నాయని అర్థం. భర్తను కౌగిలించుకున్నట్లు కల వస్తే సంపద పెరగబోతుందని అర్థం.

10.కత్తి, కత్తెర

కలలో కత్తి పట్టుకున్నట్లు కనబడితే లాభాలు కలగబోతున్నాయని అర్థం. కత్తెరతో వస్తువులు కోస్తున్నట్లు కనుక కలగంటే సంపదకు సంకేతంగా భావించాలి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe