సంవత్సరంలో చివరిదైన చంద్ర గ్రహణం ఆగస్టు 28, 2026 న ఏర్పడనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహణ సమయాల్లో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. ఈసారి చంద్ర గ్రహణం సమయంలో చంద్రుడు శని కుంభ రాశిలో, రాహువు శతభిషా నక్షత్రంలో సంచరించనున్నారు.

చంద్రుడికి శని, రాహువులు అత్యంత వ్యతిరేక శక్తులుగా భావిస్తారు. ఈ గ్రహాల కలయిక వల్ల మానవ జీవితాలపై, దేశ ప్రపంచ పరిస్థితులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ప్రముఖ జ్యోతిష్యులు నరేంద్ర ఉపాధ్యాయ స్పష్టం చేశారు.
మానసిక ఒత్తిడి.. కుటుంబంలో కలహాలు
గ్రహణ సమయంలో శని, రాహువుల ఉచ్చులో చంద్రుడు చిక్కుకోవడం వల్ల ప్రజల్లో మానసిక ఆందోళన పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు మనసును కమ్ముకుంటాయి. ఈ సమయంలో భూమి, గృహం, వాహనాలకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు తలెత్తవచ్చు. తల్లుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అపార్థాలు పెరిగి, గృహ కలహాలకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
ఈ నాలుగు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి
గ్రహణ సమయంలో చంద్రుడు తన శత్రువుల ప్రభావంలో ఉండటం వల్ల నాలుగు రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ రాశుల వివరాలు ఇక్కడ చూద్దాం.
కర్కాటక రాశి:
కర్కాటక రాశికి అధిపతి చంద్రుడే కావడం గమనార్హం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. రక్తపోటు పెరగడం, తీవ్రమైన తలనొప్పి, కంటి సంబంధిత సమస్యలు వేధించవచ్చు. ఆర్థిక నష్టాలు వచ్చే సూచనలు ఉన్నందున ఎలాంటి పెట్టుబడులు, లావాదేవీలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పుడు మార్గాల వైపు మనసు మళ్లకుండా జాగ్రత్తపడాలి.
సింహ రాశి:
సింహ రాశి వారు ఆర్థిక విషయాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. విపరీతమైన ఖర్చులు పెరిగి మానసిక ప్రశాంతతను కోల్పోతారు. కుటుంబంలో అనవసర గొడవలు రాకుండా మీ మాటలపై అదుపు ఉంచుకోవడం మంచిది. లేదంటే మీ మాటల వల్ల మీ సన్నిహితులు మనస్థాపం చెందుతారు. ఉద్యోగ రంగంలో పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది.
వృశ్చిక రాశి:
{{/usCountry}}సింహ రాశి వారు ఆర్థిక విషయాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. విపరీతమైన ఖర్చులు పెరిగి మానసిక ప్రశాంతతను కోల్పోతారు. కుటుంబంలో అనవసర గొడవలు రాకుండా మీ మాటలపై అదుపు ఉంచుకోవడం మంచిది. లేదంటే మీ మాటల వల్ల మీ సన్నిహితులు మనస్థాపం చెందుతారు. ఉద్యోగ రంగంలో పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది.
వృశ్చిక రాశి:
{{/usCountry}}వృశ్చిక రాశి వారికి ఈ కాలం శారీరకపరంగా ఒడుదొడుకులతో సాగుతుంది. ఆరోగ్యం క్షీణించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై కూడా నిఘా ఉంచడం అవసరం. డబ్బుకు సంబంధించిన ఏ నిర్ణయాన్నీ తొందరపాటుతో తీసుకోవద్దు. పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లు ఎదురవుతాయి.
మీన రాశి:
మీన రాశి వారు ఈ సమయంలో ఎలాంటి పెద్ద, కీలకమైన నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త పెట్టుబడులు పెట్టడం, ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం వంటివి చేస్తే తీవ్ర నష్టాల్లో కూరుకుపోతారు. కార్యాలయంలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కోపాన్ని అణచిపెట్టుకోవడం, వాదనలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం.
రాహు-కేతువులు చంద్రుడిని ఎందుకు గ్రహణ రూపంలో పీడిస్తారు?
పౌరాణిక కథల ప్రకారం, సముద్ర మదనం సమయంలో 'స్వరభాను' అనే రాక్షసుడు దొంగచాటుగా అమృతాన్ని సేవించాడు. దీనిని గమనించిన సూర్యచంద్రులు వెంటనే భగవాన్ విష్ణువుకు ఫిర్యాదు చేశారు. దీంతో విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి తలను (రాహువు), శరీరాన్ని (కేతువు) వేరు చేశారు. ఆనాటి పగ కారణంగానే పౌర్ణమి రోజున రాహు-కేతువులు చంద్రుడిని కమ్ముకుని గ్రహణాన్ని కలిగిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
భారత్‌లో గ్రహణ సమయం.. సూతకం వర్తిస్తుందా?
ఈ చంద్ర గ్రహణం మొత్తం కాలం సుమారు 5 గంటల 39 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఆగస్టు 28న ఉదయం 06:53 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:31 గంటల వరకు ఇది ఉంటుంది. అయితే, ఈ గ్రహణం సంభవించే సమయానికి భారతదేశంలో పగటి పూట ఉంటుంది. అందువల్ల ఈ చంద్ర గ్రహణం ప్రభావం భారత్‌లో కనిపించదు. ఫలితంగా దేశంలో ఎలాంటి సూతక కాలం కూడా వర్తించదని పండితులు స్పష్టం చేస్తున్నారు.