సంక్రాతి నుంచి ఈ రాశుల తలరాత మారిపోతుంది.. డబ్బు, లక్కుతో పాటు కెరీర్, ఆర్థిక, విద్యా రంగాల్లో అవకాశాలతో పాటు ఎన్నెన్నో

2027 జనవరి 14 రాత్రి సుమారు 9:14 గంటలకు సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గోచారాన్ని పురస్కరించుకుని జనవరి 15న మకర సంక్రాంతి జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడి మకర ప్రవేశం ఉద్యోగం, గౌరవం, ఆర్థిక పరిస్థితి, కెరీర్ వంటి అంశాలపై ప్రభావం చూపుతుంది. 

Published on: Nov 29, 2026, 09:32:02 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కొత్త ఏడాది మొదలయ్యే వేళ గ్రహాల గమనంలో కీలక మార్పులు కనిపిస్తాయి. జనవరిలో సూర్యుడు ధనుస్సు రాశి నుంచి బయలుదేరి మకర రాశిలోకి అడుగుపెడతాడు. జనవరి 14 రాత్రి ఈ రాశి మార్పు జరుగుతుంది. ఇదే సమయంలో మకర సంక్రాంతి పండుగ వస్తుంది. అయితే సూర్యుడి ప్రవేశం రాత్రి వేళ జరుగుతున్నందున జనవరి 15న మకర సంక్రాంతి జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో గౌరవ మర్యాదలు, హోదా, ప్రతిష్ఠ, ప్రభుత్వ రంగానికి సూర్యుడిని కారకుడిగా పరిగణిస్తారు. అందుకే సూర్యుడు మకరంలోకి వెళ్లడం అనేక రాశుల వారికి ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితిపైనా ఈ గోచారం ప్రభావం చూపుతుంది.

సంక్రాతి నుంచి ఈ రాశుల తలరాత మారిపోతుంది.. డబ్బు, లక్కుతో పాటు కెరీర్, ఆర్థిక, విద్యా రంగాల్లో అవకాశాలతో పాటు ఎన్నెన్నో
సంక్రాతి నుంచి ఈ రాశుల తలరాత మారిపోతుంది.. డబ్బు, లక్కుతో పాటు కెరీర్, ఆర్థిక, విద్యా రంగాల్లో అవకాశాలతో పాటు ఎన్నెన్నో

నాలుగు రాశుల వారికి ఈ మార్పు అనుకూలంగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే కొత్త పంటలు, భోగి మంటలు, కనుమ సందళ్లు, ఆధ్యాత్మిక పుణ్యస్నానాలతో ప్రత్యేక వాతావరణం నెలకొంటుంది. సూర్యుడు మకరంలోకి ప్రవేశించే వేళ దానధర్మాలు, సూర్య ఆరాధనకు ప్రజలు ప్రాధాన్యం ఇస్తారు. అయితే సాధారణ గోచార ఫలితాలు అందరికీ ఒకేలా ఉండవు. వ్యక్తిగత జాతకంలోని దశలు, గ్రహబలాలను బట్టి ఫలితాల్లో తేడాలు ఉంటాయి.

సూర్యుడి గోచార సమయం.. సంక్రాంతి విశేషం

పంచాంగం ప్రకారం 2027 జనవరి 14 రాత్రి సుమారు 9:14 గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడి ఈ సంచారంతోనే ధనుర్మాసం ముగుస్తుంది. మకర సంక్రాంతి రోజున పుణ్యస్నానాలు, దానాలకు విశేష ప్రాధాన్యం ఉంది. ఆ రోజు సూర్య భగవానుడిని పూజించే సంప్రదాయం కొనసాగుతోంది.

మకర సంక్రాతి నుంచి ఈ రాశుల వారి తలరాత మారిపోతుంది

1.మేష రాశి:

వృత్తిపరంగా మేష రాశి వారికి సూర్యుడి గోచారం విశేషంగా ఉంటుంది. మీ రాశి నుంచి పదో ఇంట్లోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. ఈ భావం ఉద్యోగం, పని ప్రదేశంతో ముడిపడి ఉంటుంది. దీనివల్ల పని రంగంలో మీ స్థానం బలపడుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యత అందవచ్చు. చాలా కాలంగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నవారికి మంచి వార్త వినే అవకాశం ఉంది. వ్యాపారస్తులకూ కొత్త పనులు ప్రారంభించే వీలుంది.

2.వృషభ రాశి:

వృషభ రాశి వారికి సూర్యుడి రాశి మార్పు భాగ్య స్థానంలో జరుగుతుంది. ఈ సమయంలో పనుల విషయంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగం మార్చాలని ఆలోచించేవారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. వ్యాపారం నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లోనూ మునుపటి కంటే మెరుగైన పరిస్థితి ఏర్పడుతుందని ఆశించవచ్చు.

3.కన్య రాశి:

కన్య రాశి వారికి సూర్యుడి గోచారం విద్య, సంతానం అంశాలపై ప్రభావం చూపుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి శ్రమకు తగిన ఫలం లభించవచ్చు. ఉద్యోగంలో తమ ప్రతిభ చూపే అవకాశం దక్కుతుంది. కొత్త ప్రణాళికపై పని చేస్తున్నవారికి ముందుకు సాగే వీలుంది. అయితే తొందరపడి పెద్ద నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్త పడాలి.

4.మీన రాశి:

ఆదాయం పరంగా మీన రాశి వారికి సూర్యుడి గోచారం ముఖ్యమైనది. మీ రాశి నుంచి పదకొండో ఇంట్లోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. జ్యోతిష్యంలో ఈ స్థానాన్ని ఆదాయం, లాభాలతో ముడిపెట్టి చూస్తారు. దీనివల్ల ఉద్యోగులకు ఆదాయం పెరిగే అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు కొత్త పరిచయాల ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందే ఆశలు కనిపిస్తాయి.

జనవరి 14న సూర్యుడు మకరంలోకి ప్రవేశించడం మేషం, వృషభం, కన్య, మీనం రాశుల వారికి కెరీర్, ఆర్థిక, విద్యా రంగాల్లో కొత్త అవకాశాలు తెస్తోంది. ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు సాగితే ఈ మార్పుల ఫలితాలను బాగా పొందవచ్చు.

ABOUT THE AUTHOR

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు