11:11 కనిపిస్తే కోరిక కోరాలా? ఏంజెల్ నంబర్స్ గురించి ఆశ్చర్యకర నిజాలు తెలుసుకోండి!

గడియారాన్ని చూసిన వెంటనే, 11:11, 2:22 లేదా 4:44 వంటి సంఖ్యలు పదేపదే కనిపిస్తాయి. ఇది ఒకటి లేదా రెండుసార్లు జరగడం యాదృచ్ఛికం కావచ్చు, కానీ అదే విషయం మళ్లీ మళ్లీ జరగడం ప్రారంభించినప్పుడు, ప్రజలు దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు.

Published on: Jun 15, 2026, 16:00:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలా మందికి అనుభవంలోకి వచ్చే విషయం ఇది. గడియారం వైపు చూసిన ప్రతిసారీ 11:11, 2:22 లేదా 4:44 వంటి ఒకే రకమైన అంకెలు (Repeating Numbers) కనిపిస్తుంటాయి. ఒకసారి ఇలా జరగడం సహజమే అయినా, పదే పదే ఇలాగే జరగడం వెనుక ఏదో అర్థం ఉందనేది ఆధ్యాత్మిక నిపుణుల మాట. అంకెలు లేదా సంఖ్యాశాస్త్రం ప్రకారం వీటిని 'ఏంజెల్ నంబర్స్' (Angel Numbers) అని పిలుస్తారు. అసలు ఈ అంకెలు మనకు ఏమి చెబుతున్నాయి?

11:11 కనిపిస్తే కోరిక కోరాలా? ఏంజెల్ నంబర్స్ గురించి ఆశ్చర్యకర నిజాలు తెలుసుకోండి!
11:11 కనిపిస్తే కోరిక కోరాలా? ఏంజెల్ నంబర్స్ గురించి ఆశ్చర్యకర నిజాలు తెలుసుకోండి!

ఏంజెల్ నంబర్స్ అంటే ఏమిటి?

సంఖ్యాశాస్త్రం ప్రకారం, మన చుట్టూ ఉన్న విశ్వం మనకు ఏదో ఒక సంకేతం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఇలాంటి అంకెలు పదే పదే కనిపిస్తుంటాయి. వీటిని దైవిక సంకేతాలుగా లేదా విశ్వం పంపే సందేశాలుగా చాలా మంది నమ్ముతారు. ఇవి మన ఆలోచనలకు, జీవిత ప్రయాణానికి దిశానిర్దేశం చేస్తాయని చెబుతారు.

వివిధ అంకెల వెనుక ఉన్న అర్థాలు:

11:11 - కొత్త ప్రారంభానికి సంకేతం: ఇది అత్యంత శక్తివంతమైన ఏంజెల్ నంబర్‌గా పరిగణించబడుతుంది. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుందని సూచిస్తుంది. 1వ అంకె సూర్యుడికి ప్రతిరూపం, అంటే ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని, గుర్తింపును మరియు ఎదుగుదలను సూచిస్తుంది. మీరు కొత్త అవకాశాల కోసం సిద్ధంగా ఉండాలని ఇది చెబుతుంది. చాలా మంది 11:11 కనిపిస్తే కోరిక కోరుకుంటూ వుంటారు.

2:22 - ఓర్పు మరియు సమతుల్యత: 2వ అంకె చంద్రుడికి చిహ్నం, ఇది భావోద్వేగాలకు, సంబంధాలకు (Relationships) సంబంధించింది. ఈ అంకె మీకు ఓపిక పట్టమని చెబుతోంది. మీరు ఏదైనా విషయంలో ఆందోళన చెందుతుంటే, సమయం గడిచేకొద్దీ అంతా సర్దుకుంటుందని, ప్రశాంతంగా ఉండమని ఈ అంకె సూచిస్తుంది.

4:44 - కష్టానికి ప్రతిఫలం: 4వ అంకెను స్థిరత్వానికి చిహ్నంగా భావిస్తారు. మీరు చేస్తున్న కృషి సరైన దిశలోనే ఉందని, కష్టపడటం ఆపవద్దని ఈ అంకె మీకు భరోసా ఇస్తుంది. ఇది మీకు దైవిక రక్షణ ఉందని, మీ పనిపై మీరు నిరంతరం దృష్టి పెట్టాలని సూచిస్తుంది.

ఎందుకు కనిపిస్తాయి?

జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మనం జీవితంలో ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు లేదా ఏదైనా పెద్ద మార్పుకు సిద్ధమవుతున్నప్పుడు మన మనస్సు విశ్వంతో అనుసంధానించబడుతుంది. ఆ సమయంలో మన దృష్టి ఇలాంటి సంఖ్యల వైపు మళ్లుతుంది. కొందరు దీనిని ఆధ్యాత్మిక సంకేతం అని భావిస్తే, మరికొందరు దీనిని మనస్సు యొక్క ఏకాగ్రత (Psychological Coincidence) అని అంటారు.

ఇలాంటి అంకెలు కనిపించినప్పుడు ఏమి చేయాలి?

పదే పదే ఒకే రకమైన అంకెలు కనిపిస్తుంటే, భయపడాల్సిన అవసరం లేదు. దీనిని ఒక సానుకూల సంకేతంగా భావించండి:

సానుకూల దృక్పథం: మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోండి.

ఏకాగ్రత: మీరు చేసే పనిపై మరింత దృష్టి పెట్టండి.

ప్రశాంతత: ఓర్పుతో నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకోండి.

ఆత్మవిశ్వాసం: విశ్వం మీకు తోడుగా ఉందనే నమ్మకంతో ముందుకు సాగండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More