కాళ్లు కూడా మన గురించి చాలా విషయాలు చెప్తాయి. మన జాతకం అంటే మనకి అరచేతి రేఖలే గుర్తొస్తాయి. కానీ భారతీయ సంప్రదాయంలో సాముద్రిక శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శరీర భాగాల ఆకృతి, లక్షణాలను బట్టి కూడా ఒక వ్యక్తి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పొచ్చు. అలాగే భవిష్యత్తు గురించి కూడా అంచనా వేయడానికి వీలవుతుంది.

ముఖ్యంగా పాదాల అమరిక వ్యక్తి ఆర్థిక స్థితిని, అదృష్టాన్ని ప్రతిబింబిస్తాయని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. పాదాల ఆకారం ఎలా ఉంది, వేళ్లలో ఏ వేలు పొడుగ్గా ఉంది అనే అంశాలు జీవితంలోని ఒడిదుడుకులను సూచిస్తాయి. మరి ఈ ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే పూర్తిగా చూసేయండి.
రెండవ వేలు పొడవుగా ఉంటే
కాలి బొటనవేలు కంటే పక్క వేలు పొడవుగా ఉన్నట్లయితే వారు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెప్తోంది. నాయకత్వ లక్షణాలు ఇలా వేలు పొడుగ్గా ఉన్న వాళ్లలో మెండుగా ఉంటాయి. ఏ పని చేసినా కూడా అందరూ ప్రశంసిస్తారు. ఇంట్లో, ఆఫీసులో కూడా మీ మాటకు విలువ ఉంటుంది. పట్టుదలతో ఉంటారు. విభేదాలు ఒక్కోసారి వచ్చే అవకాశం ఉంది. మహిళలకు రెండవ వేలు పొడుగ్గా ఉన్నట్లయితే జీవిత భాగస్వామిని బాగా చూసుకుంటారు. కుటుంబ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించగల శక్తి ఉంటుంది.
కాలి బొటనవేలు ఆకృతి
కాలి బొటనవేలు వెడల్పుగా, దృఢంగా ఉన్నట్లయితే వారు చాలా మేధావులు. ఏ విషయాన్నైనా బాగా అర్థం చేసుకుంటారు. సృజనాత్మక ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటారు. అదే బొటన వేలు చిన్నగా ఉంటే ఇతరుల ప్రభావానికి లోనవుతారు. బొటన వేలు, రెండవ వేలు మధ్య గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే వారు చాలా స్వేచ్ఛగా ఉంటారు. ఏ పని చేయడానికి ఏ మాత్రం ఇష్టపడరు.
ధన యోగం ఎవరికి?
కాలి వేళ్లన్నీ కూడా ఒకే క్రమంలో ఉన్నట్లయితే అత్యంత ధనవంతులు అని శాస్త్రం చెప్తోంది. వేళ్ల మధ్య ఖాళీలు ఏమీ లేకుండా దగ్గరగా ఉన్నట్లయితే డబ్బులు జాగ్రత్తగా దాచుకుంటారట. వీరి దగ్గర సంపద ఎప్పుడూ నిండుగా ఉంటుంది. వేళ్ల మధ్య ఖాళీలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎంత సంపాదించినా ఖర్చులు ఎక్కువైపోతాయని అర్థం. చేయి దాటిపోయే ఖర్చుల రాయుడు అని వీరిని పిలవచ్చు.
మూడవ వేలు పొడుగ్గా ఉంటే
{{/usCountry}}కాలి వేళ్లన్నీ కూడా ఒకే క్రమంలో ఉన్నట్లయితే అత్యంత ధనవంతులు అని శాస్త్రం చెప్తోంది. వేళ్ల మధ్య ఖాళీలు ఏమీ లేకుండా దగ్గరగా ఉన్నట్లయితే డబ్బులు జాగ్రత్తగా దాచుకుంటారట. వీరి దగ్గర సంపద ఎప్పుడూ నిండుగా ఉంటుంది. వేళ్ల మధ్య ఖాళీలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎంత సంపాదించినా ఖర్చులు ఎక్కువైపోతాయని అర్థం. చేయి దాటిపోయే ఖర్చుల రాయుడు అని వీరిని పిలవచ్చు.
మూడవ వేలు పొడుగ్గా ఉంటే
{{/usCountry}}కాలి మూడో వేలు పొడుగ్గా ఉన్నట్లయితే వారు శ్రమ జీవులు. చాలా చురుకుగా ఉంటారు. ఏ పనినైనా వాయిదా వేయకుండా పూర్తి చేస్తారు. కెరీర్‌లో మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యక్తిగత జీవితాన్ని కూడా బాగా సరదాగా గడుపుతారు. పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది సాధించేదాకా వీరు నిద్రపోరు.
చిన్నగా చిటికెన వేలు ఉంటే
కాలి చిటికెన వేలు చాలా చిన్నగా ఉన్నట్లయితే పిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు. బాధ్యతల కంటే ఎక్కువగా సరదాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా ఉండాలని ఫీల్ అవుతారు.
గమనిక: పురాణాలు, శాస్త్రాలు ఈ విషయాలను సరదాగా మరియు వ్యక్తిత్వ విశ్లేషణ కోసమే చెప్పాయి. మనిషి అదృష్టం అనేది కష్టంపై కూడా ఆధారపడి ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి.