గ్రహాల గమనం మానవ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మనస్సుకారకుడైన చంద్రుడు రాశి మారుతున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. అక్టోబర్ 29వ తేదీ రాత్రి చంద్ర భగవానుడు వృషభ రాశి నుంచి బుధుడి ఆధిపత్యం ఉన్న మిథున రాశిలోకి ప్రవేశించనున్నారు.

నవంబర్ 1వ తేదీ రాత్రి వరకు చంద్రుడు ఇదే రాశిలో సంచరించనున్నారు. చంద్రుడి ఈ రాశి మార్పు వల్ల ఏకంగా ఏడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ సంచార కాలంలో మేషం మొదలుకుని మీనం వరకు ఏయే రాశుల వారు ఎలాంటి లాభాలు అందుకుంటారో తెలుసుకుందాం.
మేష రాశి:
చంద్రుడి రాశి మార్పు మేష రాశివారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ 29 రాత్రి నుంచి ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. చేపట్టే ప్రతి పనిలోనూ పూర్తి పట్టుదలతో వ్యవహరించి సక్సెస్ సాధిస్తారు. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ వేగవంతం అవుతాయి. పెట్టిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మిథున రాశి:
చంద్రుడు నేరుగా మీ సొంత రాశిలోకి ప్రవేశిస్తుండటంతో మిథున రాశి వారికి రాబోయే కొన్ని రోజులు ఎంతో సానుకూలంగా ఉంటాయి. మనసు ప్రశాంతంగా, ఉల్లాసంగా మారుతుంది. ఇతరులతో మాట్లాడే తీరు ద్వారానే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు జరగడంతో పాటు కొత్త ప్రయాణాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం.
సింహ రాశి:
సూర్యుడి ఆధిపత్యం గల సింహ రాశి వారికి ఈ గోచార కాలంలో ఆర్థికపరమైన లాభాలు అందే బలమైన సూచనలున్నాయి. ఊహించని మార్గాల నుంచి ధనలాభం కలగడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన పనులన్నీ ఆర్థిక సహకారంతో పూర్తవుతాయి. ఈ కాలంలో చేసే చిన్నపాటి ప్రయాణాలు కూడా భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి.
కన్యా రాశి:
{{/usCountry}}సూర్యుడి ఆధిపత్యం గల సింహ రాశి వారికి ఈ గోచార కాలంలో ఆర్థికపరమైన లాభాలు అందే బలమైన సూచనలున్నాయి. ఊహించని మార్గాల నుంచి ధనలాభం కలగడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన పనులన్నీ ఆర్థిక సహకారంతో పూర్తవుతాయి. ఈ కాలంలో చేసే చిన్నపాటి ప్రయాణాలు కూడా భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి.
కన్యా రాశి:
{{/usCountry}}కన్యా రాశి వారికి చంద్రుడి సంచారం అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది. ఉద్యోగస్తులకు ఆఫీస్‌లో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలతో పాటు అనుకూలమైన మార్పులు ఉంటాయి. ప్రభుత్వ రంగం నుంచి ఊహించని లబ్ధి చేకూరుతుంది. వ్యాపారస్తులకు నూతన లాభాలు అందడంతో పాటు, కొత్త ప్లానింగ్‌లు సమర్థవంతంగా అమలవుతాయి.
తులా రాశి:
తులా రాశి వారికి ఈ గోచార సమయంలో అదృష్టం పూర్తిగా వెన్నంటి ఉంటుంది. గత కొంతకాలంగా వివిధ కారణాల వల్ల ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా ముందుకు కదులుతాయి. సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో మానసిక ఉత్సాహం పెరుగుతుంది.
ధనుస్సు రాశి:
మిథున రాశిలో చంద్రుడి సంచారం ధనుస్సు రాశి వారి వైవాహిక జీవితంలో కొత్త వెలుగులు నింపుతుంది. భాగస్వామితో గతంలో ఉన్న మనస్పర్థలు, పొరబాట్లు తొలగిపోయి బంధం మరింత బలపడుతుంది. ఇద్దరూ కలిసి సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఓపికతో వ్యవహరిస్తే సంసారంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
మీన రాశి:
చంద్రుడి గమనం మీన రాశి వారికి మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని ఇస్తుంది. ఆస్తి, భూములు లేదా నూతన వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం. దీనికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక పరమైన ముందడుగు వేయడానికి ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉంది.