...
...
Next Story

సూర్య గ్రహణం నాడే రెండు సార్లు చంద్ర సంచారంలో మార్పు, ఈ 4 రాశులకు సమస్యలు రావచ్చు!

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితంలో కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి శుభ ఫలితాలను తీసుకొస్తే, ఒక్కోసారి అశుభ ఫలితాలను కలిగిస్తుంది. సూర్యగ్రహణం నాడు చంద్రుని సంచారంలో రెండు సార్లు మార్పు రాబోతోంది.

Published on: Feb 12, 2026, 13:30:39 IST
Advertisement

సూర్య గ్రహణం నాడు చంద్రుడు తన రాశి, నక్షత్రాన్ని రెండూ కూడా మార్చబోతున్నాడు. ఇది కొన్ని రాశుల వారి జీవితంలో సమస్యలను తీసుకొచ్చే అవకాశం ఉంది. గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితంలో కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి శుభ ఫలితాలను తీసుకొస్తే, ఒక్కోసారి అశుభ ఫలితాలను కలిగిస్తుంది.

సూర్య గ్రహణం నాడే రెండు సార్లు చంద్ర సంచారంలో మార్పు (pinterest)
సూర్య గ్రహణం నాడే రెండు సార్లు చంద్ర సంచారంలో మార్పు (pinterest)

ఈ ఏడాది వచ్చే మొదటి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న రాబోతోంది. మధ్యాహ్నం 3:26కి ప్రారంభమై, రాత్రి 7:57తో ముగుస్తుంది. ద్రిక్ పంచాంగం ప్రకారం, ఆ రోజు రాత్రి 9:15కి చంద్రుడు కుంభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ రాశికి అధిపతి శని. అలాగే 9:15కి శతభిష నక్షత్రంలోకి అడుగు పెడతాడు. దీంతో కొన్ని రాశుల వారి పై ప్రతికూల ప్రభావం పడుతుంది. సూర్యగ్రహణం నాడు చంద్రుని సంచారంలో రెండు సార్లు మార్పు రాబోతున్నందున కొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కొంటారు. మరి ఏ రాశుల వారికి సమస్యలు ఎదురవుతాయి, ఎవరు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.

సూర్య గ్రహణం నాడే రెండు సార్లు చంద్ర సంచారంలో మార్పు.. నాలుగు రాశుల వారికి సమస్యలు

1.మేష రాశి:

మేష రాశి వారికి సూర్య గ్రహణం నాడు రెండు సార్లు చంద్ర సంచారంలో మార్పు రావడంతో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారికి మానసికంగా చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం కూడా కాస్త దెబ్బతింటుంది. వివాహమైన వారు కాస్త టెన్షన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రేమ జీవితంలో ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రాజెక్టుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

2.కర్కాటక రాశి:

తులా రాశి వారికి రెండు సార్లు చంద్ర సంచారంలో మార్పు రావడంతో ఇబ్బందులు వస్తాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి కుటుంబంలో సమస్యలు వస్తాయి. ఆర్థికపరంగా కూడా ఇబ్బందులు రావచ్చు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన డీల్స్‌ను పోస్ట్‌పోన్ చేసుకోవడం మంచిది.

4.కుంభ రాశి:

కుంభ రాశి వారికి ఈ సమయంలో ఇబ్బందులు రావచ్చు. చంద్ర సంచారంలో రెండుసార్లు మార్పు రావడంతో కష్టాలు ఎదురవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఉదర సంబంధిత సమస్యలు ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పై కూడా శ్రద్ధ వహించాలి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks