నవరాత్రుల్లో రెండవ రోజు గాయత్రీ దేవిని పూజించాలి. గాయత్రీ అమ్మవారిని ఆరాధించడం వలన అమ్మవారి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రూపాల్లో అమ్మవారిని పూజించి, రకరకాల నైవేద్యాలను సమర్పిస్తారు. గాయత్రీ దేవిని ఈరోజు ఆరాధించేటప్పుడు చదువుకోవాల్సిన మంత్రాలు, పూజా విధానం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గాయత్రీ దేవి పూజ చేయడం వలన మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. గాయత్రీ దేవి జ్ఞానం, పవిత్రత, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక. గాయత్రీ దేవిని ఆరాధిస్తే ఆలోచనల్లో స్పష్టత కలుగుతుంది. నవరాత్రుల్లో గాయత్రీ దేవిని ఎలా పూజించాలి? ఏ మంత్రాన్ని జపించాలి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు గాయత్రీ దేవి ఎవరు?
గాయత్రీ దేవిని వేదమాతగా ఆరాధిస్తారు. గాయత్రీ మంత్రం శక్తివంతమైన మంత్రాల్లో ఒకటి. ఈ మంత్రం సూర్యుని దివ్య తేజస్సును ధ్యానిస్తూ, బుద్ధిని సన్మార్గంలో నడిపించాలని ప్రార్థిస్తుంది అని పండితులు తెలిపారు.
గాయత్రీ దేవి పూజ చేసేటప్పుడు వీటిని కచ్చితంగా పాటించేటట్టు చూసుకోండి
పూజా స్థలాన్ని శుభ్రం: గాయత్రీ దేవిని ఆరాధించడానికి ముందు పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని, గాయత్రీ దేవి ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టండి.
దీపారాధన చేయండి: నెయ్యి లేదా నూనెతో దీపారాధన చేయండి. గణపతిని కూడా స్మరించుకోండి.
పూలను సమర్పించండి: అమ్మవారికి భక్తితో పూలను సమర్పించండి. అలాగే దీప, ధూప నైవేద్యాలు, పసుపు, కుంకుమలు, అక్షతలను కూడా సమర్పించండి.
గాయత్రీ మంత్రాన్ని ప్రశాంతంగా ఒకచోట కూర్చుని జపించండి. ఈ మంత్రాన్ని 11, 21 లేదా 108 సార్లైనా జపించవచ్చు. నైవేద్యం సమర్పించాక చివరిగా హారతి ఇవ్వండి.
గాయత్రీ దేవికి పాలు, పాయసం, ఇంట్లో తయారు చేసిన సాత్విక ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు.
నవరాత్రుల్లో గాయత్రీ మంత్రాన్ని ఎప్పుడు జపిస్తే మంచిది?
{{/usCountry}}గాయత్రీ దేవికి పాలు, పాయసం, ఇంట్లో తయారు చేసిన సాత్విక ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు.
నవరాత్రుల్లో గాయత్రీ మంత్రాన్ని ఎప్పుడు జపిస్తే మంచిది?
{{/usCountry}}ఉదయం సూర్యోదయం సమయంలో గాయత్రీ మంత్రాన్ని జపించవచ్చు. లేదంటే సాయంత్రం కూడా ప్రశాంతంగా కూర్చుని గాయత్రీ మంత్రాన్ని జపించవచ్చు. నవరాత్రుల్లో వీలైన సమయంలో భక్తితో ఈ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలను చూడొచ్చు.
గాయత్రీ దేవి పూజ వలన కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు
గాయత్రీ దేవిని ఆరాధించడం వలన ఏకాగ్రత, ఆత్మపరిశీలన అలవాట్లను పెంపొందించుకోవడానికి వీలవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ శ్రేయస్సు కోసం ఈ మంత్రాన్ని రోజూ జపించండి.