ప్రతి మనిషి పుట్టిన తేదీ ఎంతో ముఖ్యపాత్ర వహిస్తుంది. న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే, రాడిక్స్ సంఖ్యలు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. ఈ సంఖ్యల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది.

ప్రతి ఒక్కరు కూడా మరొకరితో పోల్చుకుంటే కాస్త భిన్నంగా ఉంటారు. కొంతమందికి అవి బలాలు అయితే, అవే బలహీనతలు మరికొంతమందికి కావచ్చు. కొంతమంది వ్యక్తులు ఎక్కడికి వెళ్లినా సరే ప్రత్యేకతను చాటుకుంటారు. ఎంతమందిలో ఉన్నా కూడా వారి ప్రవర్తన, మాట తీరు అందర్నీ ఆకట్టుకుంటాయి. పుట్టుకతోనే వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఏ తేదీల్లో పుట్టిన వారికి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి? వారిలో మీరు ఉన్నారేమో ఇప్పుడు చూసుకోండి.
ఈ తేదీల్లో పుట్టిన వారికి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఎక్కువ.. మీరు ఈ తేదీల్లో పుట్టారేమో చూసుకోండి.
మూలాంకం 1 - సూర్యుడు, తేజస్సు
ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 1 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి సూర్యుడు అధిపతి. సూర్య ప్రభావం వలన ఈ తేదీల్లో పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది.
పట్టుదలతో ప్రతి పనిని కూడా పూర్తి చేస్తారు. ఎవరికైనా పని చేయడానికి ఇష్టం ఉండదు. సొంతంగా ఎదగాలని అనుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కడ ఉన్నా రాజులా బతకడానికే ఇష్టపడతారు. కష్ట సమయంలో కూడా ధైర్యంగా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి వ్యాపారం, రాజకీయాలు బాగా కలిసి వస్తాయి.
మూలాంకం 3 - దేవగురువు, జ్ఞానం
ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 3 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి గురువు. గురువు అనుగ్రహంతో వీరికి అపారమైన జ్ఞానం ఉంటుంది. వీరి మాటలకు ఇతరులు ఇంప్రెస్ అయిపోతారు.
{{/usCountry}}ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 3 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి గురువు. గురువు అనుగ్రహంతో వీరికి అపారమైన జ్ఞానం ఉంటుంది. వీరి మాటలకు ఇతరులు ఇంప్రెస్ అయిపోతారు.
{{/usCountry}}ఒక టీం లేదా సంస్థను చక్కగా, క్రమశిక్షణతో నడిపిస్తారు. గర్వపడకుండా అందర్నీ కలుపుకుంటారు. లీడర్‌షిప్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. విద్యాసంస్థలు, పెద్ద కార్పొరేట్ కంపెనీలు, న్యాయవ్యవస్థలో బాగా రాణిస్తారు.
మూలాంకం 9 - కుజుడు కటాక్షం
ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లో పుట్టినట్లయితే వారి మూలాంకం 9 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి కుజుడు. సాహస గుణాలు, అంతులేని ఎనర్జీ వీరి ప్రత్యేకత. ఎలాంటి సవాలునైనా సరే, ఎలాంటి పనినైనా సవాల్‌గా తీసుకుంటారు. సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తారు.
శత్రువులను కూడా ధైర్యంగా ఎదుర్కోగలరు. అప్పుడప్పుడు వీరికి కాస్త కోపం ఎక్కువగా ఉన్నా, మనసు మాత్రం వెన్నలా ఉంటుంది. క్రీడలు, రక్షణ రంగం, పోలీస్ శాఖ వంటి వాటిలో బాగా రాణించగలరు. మంచి నాయకులుగా ఎదుగుతారు.
ఈ తేదీల్లో పుట్టిన వారు రోజు లేచి సూర్య నమస్కారాలు చేస్తే ఆత్మవిశ్వాసాన్ని ఇంకా పెంపొందించుకోవచ్చు. ఇంట్లో తండ్రిని, సమాజంలో గురువులను గౌరవించాలి. అప్పుడు గురు, సూర్య గ్రహ బలం ఇంకా పెరుగుతుంది. అలాగే అహంకారం కాస్త తగ్గి, అందరికీ సాయం చేస్తే సమాజంలో కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి.