న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. దీని ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వ తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పొచ్చు. న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ సంఖ్యను కనుగొనవచ్చు. ఇది వ్యక్తి స్వభావం, అలవాట్లను తెలుపుతుంది. ఒక్కో సంఖ్య వారు ఒక్కో విధంగా ఉంటారు.

కొన్ని తేదీల్లో పుట్టిన వారు డబ్బును బాగా దాచగలరు. డబ్బు విషయంలో వారి ఆలోచనా విధానం, ఖర్చు చేసే తీరుపై కూడా న్యూమరాలజీ ప్రభావం ఉంటుంది. కొంత మంది వారి సంపాదనలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఎక్కువగా డబ్బును వృథా చేస్తుంటారు.
అవసరాలతో పాటుగా హాబీస్ కోసం కూడా ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. మరి న్యూమరాలజీ ప్రకారం ఆర్థికంగా పొదుపు చేసే స్వభావం ఉన్న రాడిక్స్ సంఖ్యలు ఏవి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంఖ్యల్లో మీరు ఉన్నారేమో ఇప్పుడే చూసుకోండి.
ఈ తేదీల్లో పుట్టిన వారు డబ్బును బాగా పొదుపు చేస్తారు
రాడిక్స్ సంఖ్య 4
ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య నాలుగు అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. డబ్బు ఖర్చు చేసే ముందు అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. అనవసరంగా డబ్బును వృధా చెయ్యరు, బడ్జెట్‌ను సులువుగా నిర్వహించడం తోపాటు, భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును బాగా సేవ్ చేస్తారు.
రాడిక్స్ సంఖ్య 8
ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 8 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు అకస్మాత్తుగా కొనుగోలు చేయడం కంటే, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేస్తారు.
{{/usCountry}}ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 8 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు అకస్మాత్తుగా కొనుగోలు చేయడం కంటే, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేస్తారు.
{{/usCountry}}ఆర్థిక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకనే సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేస్తారు. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకునే స్వభావాన్ని ఈ తేదీల్లో పుట్టిన వారు కలిగి ఉంటారు.
4, 8 సంఖ్యల వారు డబ్బు విషయంలో ఆచితూచి వ్యవహరించే స్వభావంతో ఉంటారని న్యూమరాలజీ అంటోంది. అలాగే వారు ఆదాయానికి అనుగుణంగా ఖర్చులను ప్లాన్ చేయడమే కాక భవిష్యత్తులో ఎదురయ్యే అవసరాలను కూడా ఈ తేదీల్లో పుట్టిన వారు ముందుగానే అంచనా వేస్తారు. డబ్బు పొదుపు చేస్తారు. భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని దాచుకునే అలవాటును ఈ తేదీల్లో పుట్టిన వారు కలిగి ఉంటారని చెబుతారు.
నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.