అక్టోబర్‌లో ఈ 7 రాశులకు అదృష్టం.. ధనలాభంతో పాటు ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అక్టోబర్ 2026లో గ్రహాల సంచార మార్పులు ద్వాదశ రాశులపై ప్రభావం చూపుతాయని భావిస్తారు. ముఖ్యంగా వృషభం, కర్కాటకం, సింహం, కన్య, తుల, మకరం, మీనం రాశుల వారికి ఈ నెలలో అనుకూల ఫలితాలు కలగవచ్చని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గతి మార్పునకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రతి నెలా అనేక గ్రహాలు తమ రాశులను మారుస్తుంటాయి. ఈ అక్టోబర్ నెలలో శని, సూర్యుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, కుజుడు వంటి కీలక గ్రహాల స్థితిగతులలో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

ఈ గ్రహాల గతుల ప్రభావం ద్వాదశ రాశుల మీద భిన్నంగా పడుతుంది. అయితే, ఈసారి అక్టోబర్‌లో రాబోయే మార్పులు ఏడు రాశుల వారికి మాత్రం అత్యంత అనుకూలంగా మారనున్నాయని జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వృషభం, కర్కాటకం, సింహం, కన్య, తుల, మకర, మీన రాశుల వారికి ధన లాభంతో పాటు వృత్తి, వ్యాపార రంగాల్లో గొప్ప పురోగతి కనిపిస్తోంది.
ఆర్థికంగా ఊరటనిచ్చే వృషభ రాశి
వృషభ రాశి వారికి అక్టోబర్ మిగిలిన రోజులు ఆర్థిక పరంగా ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఆందోళనలు క్రమంగా తొలగిపోతాయి. సంపాదనకు, ఖర్చులకు మధ్య సరైన సమతౌల్యం ఏర్పడుతుంది. ఈ సమయంలో అనవసర ఖట్లకు దూరంగా ఉంటూ, రాబడిని స్థిరంగా ఉంచుకోవడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.
కార్యసాధనలో జయప్రదమైన కర్కాటకం
కర్కాటక రాశి జాతకులకు ఈ కాలం చాలా సానుకూలంగా ఉంటుంది. తాము తలపెట్టిన పనుల్లో ఎలాంటి పెద్ద అడ్డంకులు లేకుండా సులువుగా ఇష్టపడిన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు, వ్యాపారాలు నిర్వహించే వారికి తమ ప్రణాళికలను ఆచరణలో పెట్టడానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అధికారుల నుంచి తగిన గుర్తింపు లభించే సూచనలున్నాయి.
అదృష్టం తోడుండే సింహం
సింహా రాశి వారికి భాగ్యస్థానం బలపడటంతో నిలిచిపోయిన పనులు మళ్లీ వేగంగా పూర్తవుతాయి. చాలాకాలంగా పీడిస్తున్న సమస్యలకు త్వరలోనే తెరపడుతుందని భావించవచ్చు. ఆర్థికంగా బలపడటానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఒక ముఖ్యమైన పనిలో విజయం సాధించడం వల్ల భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుంది.
కన్య రాశి వారికి కొత్త కెరీర్ అవకాశాలు
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న కన్య రాశి వారికి సరికొత్త అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ సమయంలో వచ్చే ప్రతి చిన్న అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మంచి ఆర్థిక లాభాలను పొందవచ్చు.
ఆత్మవిశ్వాసంతో దూసుకుపోయే తులా రాశి
తులా రాశి వారిలో మనోధైర్యం, ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతాయి. దీని ప్రభావం నేరుగా వారి పనితీరుపై స్పష్టంగా కనిపిస్తుంది. కార్యక్షేత్రంలో తమదైన ముద్ర వేయడానికి, తోటి ఉద్యోగుల మధ్య ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఇది సరైన సమయం. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం ద్వారా ఉన్నత స్థాయికి చేరవచ్చు.
మకర రాశి వారికి కుటుంబంలో శుభవార్తలు
మకర రాశి వారి ఇళ్లలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ముఖ్యంగా సంతానానికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత కుటుంబంతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. ఇళ్లలో నెలకొన్న చిన్నపాటి మనస్పర్థలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది.
సహకారంతో ముందుకు వెళ్లే మీన రాశి
మీన రాశి వారికి తోటి ఉద్యోగులు, స్నేహితుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ఎంతటి క్లిష్టమైన ప్రాజెక్టులనైనా ఇతరుల సహాయంతో సులభంగా పూర్తి చేయగలుగుతారు. టీమ్ వర్క్‌తో పనిచేసే వారికి ఇది అత్యంత లాభదాయకమైన సమయం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


