అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు ఉన్న ఈ వారం అంకాజ్యోతిష్యం ప్రకారం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వారపు సార్వత్రిక సంఖ్య (Universal Number) '8'. జ్యోతిష్య శాస్త్రంలో ఈ సంఖ్య కర్మ, క్రమశిక్షణ, ధనలాభం, కఠిన శ్రమకు ప్రతీకగా నిలుస్తుంది.

పాత ప్రణాళికలను అమలు చేయడానికి, అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి, ఆర్థిక విషయాల్లో స్పష్టత సాధించడానికి ఇది సరైన సమయం. ఈ వారం ప్రతి మూలాంకంపై దీని ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.
మూలాంకం 1
(1, 10, 19 లేదా 28 తేదీల్లో పుట్టినవారు)
ఈ వారం మీలోని నాయకత్వ లక్షణాలు స్పష్టంగా బయటపడతాయి. ఆగిపోయిన పనులను మళ్లీ పట్టాలెక్కించడానికి, కొత్త బాధ్యతలు చేపట్టడానికి అనుకూల వాతావరణం ఉంది. కేవలం ఆత్మవిశ్వాసంతో మాత్రమే కాకుండా, స్పష్టమైన ప్రణాళికతో అడుగు వేయండి. ఆర్థిక పరంగా ఖర్చులను బేరీజు వేసుకోవడం మంచిది. వృత్తిపరమైన ఒత్తిడి మధ్యలో విశ్రాంతి తీసుకోవడం మరువకండి. కుటుంబ సభ్యుల సహకారంతో బాధ్యతలు తేలికవుతాయి.
మూలాంకం 2
(2, 11, 20, 29 తేదీల్లో పుట్టినవారు)
మూలాంకం 2 వారికి మీ సహజమైన సంయమనం, అవతలి వారి భావాలను అర్థం చేసుకునే గుణం కార్యాలయంలో పెద్ద సమస్యలను పరిష్కరిస్తుంది. సహోద్యోగులతో కలిసి పనిచేయడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయి.
మూలాంకం 3
(3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారు)
ఈ సంఖ్య విషయానికి వస్తే, మీ సృజనాత్మక ఆలోచనలు పాత ప్రాజెక్టులకు కొత్త ఊపునిస్తాయి. విద్య, రచన, బోధన రంగాల వారికి ఇది మంచి సమయం. అయితే ఒకేసారీ అనేక పనులను భుజాన వేసుకోవడం మానుకోండి. ఆరోగ్యం కోసం తగినంత నిద్ర అవసరం.
మూలాంకం 4
{{/usCountry}}ఈ సంఖ్య విషయానికి వస్తే, మీ సృజనాత్మక ఆలోచనలు పాత ప్రాజెక్టులకు కొత్త ఊపునిస్తాయి. విద్య, రచన, బోధన రంగాల వారికి ఇది మంచి సమయం. అయితే ఒకేసారీ అనేక పనులను భుజాన వేసుకోవడం మానుకోండి. ఆరోగ్యం కోసం తగినంత నిద్ర అవసరం.
మూలాంకం 4
{{/usCountry}}(4, 13, 22, 31 తేదీల్లో పుట్టినవారు)
మూలాంకం 4 వారికి క్రమశిక్షణ, ఆచరణాత్మక ఆలోచనలు లాభిస్తాయి. పాత పనులను సమీక్షించి, చిన్నచిన్న పొరపాటులను సరిదిద్దుకోండి.
మూలాంకం 5
(5, 14, 23 తేదీల్లో పుట్టినవారు)
ఈ సంఖ్య వారికి కొత్త ఆలోచనలు తట్టినప్పటికీ, పాత పనులను పూర్తి చేయడానికే ప్రాధాన్యం ఇవ్వండి.
మూలాంకం 6
(6, 15, 24 తేదీల్లో పుట్టినవారు)
ఈ సంఖ్యల వారికి ఇల్లు, కార్యాలయ బాధ్యతల మధ్య సమతుల్యత చాలా ముఖ్యం. ఇతరులకు సాయం చేసే క్రమంలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబంతో గడపడం ద్వారా మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
మూలాంకం 7
(7, 16, 25 తేదీల్లో పుట్టినవారు)
మూలాంకం 7 వారు తమ అనుభవాలను ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి దిశ మార్చుకోవద్దు.
మూలంకం 8
(8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు)
ఇక యూనివర్సల్ నంబర్ 8తో నేరుగా కనెక్ట్ అయ్యే మూలాంకం 8 వారికి ఈ వారం కెరీర్, ఆర్థిక విషయాలపై పూర్తి దృష్టి ఉంటుంది. కష్టపడి పనిచేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు.
మూలాంకం 9
(9, 18, 27 తేదీల్లో పుట్టినవారు)
ఈ తేదీల వారికి మీ కఠిన శ్రమ ఒక ముఖ్యమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం సుగమం చేస్తుంది.
మొత్తంగా చూస్తే, ఈ వారం ఓపిక, కష్టపడే తత్వం, క్రమశిక్షణతో అడుగులు వేసే వారికి అఖండ విజయం లభిస్తుంది.