న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకోవడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. పుట్టిన తేదీ ద్వారా మనం చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా పుట్టిన తేదీ ఆధారంగా ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం, ఈ తేదీల్లో పుట్టిన వారికి బంగారం అదృష్టాన్ని తీసుకొస్తుంది.

వీళ్లు బంగారాన్ని ధరిస్తే శుభ ఫలితాలను పొందుతారు. అదృష్టం, శ్రేయస్సు కూడా కలుగుతుంది. బంగారం గురు గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం ధరిస్తే అద్భుతంగా కలిసి వస్తుంది. మరి ఏ తేదీల్లో పుట్టిన వారికి బంగారం అదృష్టాన్ని తీసుకొస్తుంది? వారిలో మీరు ఒకరేమో చెక్ చేసుకోండి.
ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారాన్ని ధరిస్తే బాగా కలిసి వస్తుంది
రాడిక్స్ నెంబర్ 1
ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 1 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. సవాళ్లను ఎంతో ధైర్యంగా స్వీకరించి ముందుకు వెళ్తారు. కష్టపడి పని చేస్తారు. అలాగే ఈ తేదీల్లో పుట్టిన వారు విజేతలుగా నిలబడాలని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. కాస్త మొండితనం కూడా ఎక్కువే. ఈ తేదీల్లో పుట్టిన వారికి అధిపతి సూర్యుడు. కనుక బంగారం బాగా కలిసొస్తుంది. బంగారం ధరిస్తే అదృష్టం రెట్టింపు అవుతుంది.
రాడిక్స్ సంఖ్య 5
ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 5 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. తెలివితేటలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు వంటి వాటికి కారకుడు. ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. వ్యాపారంలో కూడా బాగా రాణిస్తారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం ధరిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. సంతోషంగా ఉంటారు. అదృష్టం కూడా పెరుగుతుంది.
రాడిక్స్ సంఖ్య 3
{{/usCountry}}ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 5 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. తెలివితేటలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు వంటి వాటికి కారకుడు. ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. వ్యాపారంలో కూడా బాగా రాణిస్తారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం ధరిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. సంతోషంగా ఉంటారు. అదృష్టం కూడా పెరుగుతుంది.
రాడిక్స్ సంఖ్య 3
{{/usCountry}}ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 3 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి గురుడు. నాయకత్వ లక్షణాలు, క్రియేటివిటీ వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఇతరులకు సహాయం చేస్తారు. లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఈ తేదీల్లో పుట్టిన వారికి ఉండడంతో డబ్బుకు లోటు ఉండదు. ఆర్థిక పరంగా బావుంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం ధరిస్తే మరింత శుభ ఫలితాలను పొందుతారు.