Sign in

కుంభరాశిలో రాహువు సంచారం - రాబోయే 6 నెలలు ఈ రాశుల వారికి కాసుల వర్షం, ఊహించని విజయాలు..!

2026 రాహు గోచార ఫలితాల ప్రకారం అంతుచిక్కని గ్రహం రాహువు కుంభరాశిలో మరో ఆరు నెలల పాటు కొనసాగనున్నాడు. శని నడిపే ఈ కుంభరాశిలో రాహువు ఉండటం వల్ల మూడు రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, కెరీర్‌లో ఊహించని విజయం దక్కనున్నాయి.

Published on: Jun 10, 2026, 08:12:24 IST
By , नई दिल्ली
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రంలో రాహు గ్రహానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. రాహువును నీడ గ్రహంగా, అంతుచిక్కని గ్రహంగా పరిగణిస్తారు. సాధారణ గ్రహాల కదలికలకు భిన్నంగా రాహువు ఎల్లప్పుడూ వక్ర మార్గంలో (రివర్స్) కదులుతుంటాడు. జాతకంలో రాహువు స్థానం అనుకూలంగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తి జీవితంలో సంపద, సమృద్ధి, అఖండ విజయాలు చేకూరుతాయి. ప్రస్తుత గ్రహాల కదలికల ప్రకారం, రాహువు కుంభరాశిలో సుమారు ఆరు నెలల పాటు సంచరించబోతున్నాడు. దీని తరువాత… శనిదేవుడికి చెందిన మరో రాశియైన మకరరాశిలోకి రాహువు ప్రవేశిస్తాడు.

కుంభరాశిలో రాహువు సంచారం
కుంభరాశిలో రాహువు సంచారం

కుంభరాశిలో రాహువు కొనసాగే ఈ ఆరు నెలల కాలం కొన్ని రాశుల వారికి అపారమైన లాభాలను, అదృష్టాన్ని తీసుకురాబోతోంది. ముఖ్యంగా మూడు రాశుల వారి తలరాతను మార్చబోతున్న ఈ రాహు గోచార పూర్తి వివరాలు, ఆయా రాశులపై చూపే ప్రభావాలను ఇక్కడ తెలుసుకోండి..

సింహ రాశి :

  • కుంభరాశిలో రాహువు సంచారం సింహ రాశి వారికి అత్యంత శుభప్రదంగా మారబోతోంది.
  • ఈ కాలంలో మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.
  • కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఉన్న పాత విభేదాలు తొలగిపోయి సంబంధాలు మరింత బలంగా మారతాయి.
  • ఉద్యోగ, వ్యాపార రంగాల వారు తమ కెరీర్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి అడుగు ముందుకు వేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
  • జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది.
  • ఈ సమయంలో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు మాటతీరుపై నియంత్రణ కలిగి ఉండటం చాలా మంచిది.

తులా రాశి :

  • తులా రాశి వారికి కూడా కుంభ రాశి రాహువు అయాచిత లబ్ధిని చేకూర్చనున్నాడు.
  • ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా స్థిరంగా మారుతుంది. ఆర్థిక బలం చేకూరడం వల్ల మీలో మానసిక ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది.
  • వ్యాపారస్తులకు ఈ సమయం బంగారు కాలమనే చెప్పాలి. వ్యాపార విస్తరణతో పాటు ఊహించని లాభాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
  • కుటుంబంలో నెలకొన్న అశాంతి తొలిగిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది.
  • నిరుద్యోగులకు లేదా ఉద్యోగం మారాలనుకునే వారికి సరికొత్త, ఆకర్షణీయమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

వృశ్చిక రాశి :

  • వృశ్చిక రాశి జాతకులకు ఈ రాహు గోచారం మానసిక ప్రశాంతతను, విజయాలను అందిస్తుంది.
  • దీర్ఘకాలంగా సమాజంలో లేదా వ్యాపారంలో ఇరుక్కుపోయిన మీ సొమ్ము తిరిగి మీ చేతికి అందుతుంది.
  • జీవితంలో గత కొంతకాలంగా వేధిస్తున్న వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలు ఒక్కొక్కటిగా సమసిపోతాయి.
  • ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించడంతో పాటు ఉన్నతోద్యోగుల, స్నేహితుల నుంచి పూర్తి సహకారం అందుతుంది.
  • వైవాహిక జీవితంలో మునుపటి కంటే ఎక్కువ ఆనందం, శాంతి, పరస్పర ప్రేమ పెంపొందుతాయి. ఈ ఆరు నెలల పాటు అదృష్టం మీకు సంపూర్ణంగా తోడుంటుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య శాస్త్ర నమ్మకాలు, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే రాయబడింది. దీనిని పూర్తిగా నిజం, ఖచ్చితమైనదని మేము ధృవీకరించడం లేదు. మరింత సమాచారం, వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం సంబంధిత రంగ నిపుణులను లేదా ప్రామాణిక జ్యోతిష్యులను సంప్రదించగలరు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More