...
...
Next Story

రాహు, కుజుల కలయికతో రాజయోగం.. ఈ రాశులకు ధనలాభం, ఉద్యోగంలో పురోగతి!

జ్యోతిష్య ప్రకారం కుజుడు మిథున రాశిలో, రాహువు కుంభరాశిలో సంచరిస్తుండటంతో ఈ రెండు గ్రహాలు 180 డిగ్రీల దూరంలో ఉండి సంసప్తక రాజయోగం ఏర్పడనుందని చెబుతున్నారు. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు కలగవచ్చని జ్యోతిష్య విశ్వాసం.

Published on: Sep 8, 2026, 16:00:26 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. గ్రహాల సంచారంలో మార్పు వలన ఒక్కోసారి శుభ ఫలితాలు, ఒక్కోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

రాహు, కుజుల కలయికతో రాజయోగం.. ఈ రాశులకు ధనలాభం, ఉద్యోగంలో పురోగతి! (AI)
రాహు, కుజుల కలయికతో రాజయోగం.. ఈ రాశులకు ధనలాభం, ఉద్యోగంలో పురోగతి! (AI)

జ్యోతిషం ప్రకారం చూసినట్లయితే, కుజుడు మిథున రాశిలో సెప్టెంబర్ 18 వరకు ఉంటాడు. రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి 180 డిగ్రీల దూరంలో ఉండడంతో సంసప్తక రాజయోగం ఏర్పడబోతోంది. దీంతో కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలగబోతున్నాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

రాహువు, కుజ గ్రహాల కారణంగా రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం!

1.మిథున రాశి

మిథున రాశిలోనే కుజుడు సంచారం చేస్తున్నాడు. ఈ రాశి వారికి ఈ రాజయోగం బాగా కలిసి రాబోతుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులు పదోన్నతి, కొత్త బాధ్యతలను పొందుతారు. ఆర్థికపరంగా లాభాలను చూస్తారు. తొందరపడి రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది.

2.మేష రాశి

మేష రాశి వారికి కూడా ఈ రాజయోగం బాగా కలిసి వస్తుంది. మేష రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వారికి ఈ రాజయోగంతో బాగా కలిసి రాబోతోంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు వస్తాయి. పెండింగ్‌లో ఉన్న టాస్కులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పని చేస్తున్న ప్రదేశంలో నాయకత్వ నైపుణ్యాలు పెరుగుతాయి. చిన్న ప్రయాణాలు ఉండొచ్చు. కొత్త పరిచయాలు పెరిగి, వ్యాపార ప్రయోజనాలను పొందుతారు.

3.తులా రాశి

కుంభ రాశి వారికి ఇది శుభ సమయం అని చెప్పొచ్చు. కుంభ రాశి వారిపై కుజుని ప్రభావం ఉంటుంది. కష్టపడి పని చేస్తే తత్వాన్ని, ధైర్యాన్ని పెంచుకుంటారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఇది అద్భుతమైన సమయం. ఉద్యోగాల కోసం చూస్తున్న వారు కూడా మార్పులను చూస్తారు. ఆకస్మికంగా ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపారవేత్తలకు ఇదే అద్భుతమైన సమయం. తొందరపడి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks