...
...
Next Story

మూడేళ్ల తర్వాత అరుదైన యోగం.. పద్మిని ఏకాదశి వ్రత మహిమ, పూజా విధానం తెలుసుకోండి!

మూడేళ్లకోసారి వచ్చే అరుదైన పద్మిని ఏకాదశి మే 27న రానుంది. అధిక మాసంలో వచ్చే ఈ ఏకాదశి విశేషాలు, పుణ్య ఫలితాలు, పూజా విధానం, ముహూర్తం వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ విశేషమైన రోజున ఇలా విష్ణువుని లక్ష్మీదేవిని ఆరాధించడం వలన అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది.

Published on: May 26, 2026, 11:01:03 IST
Advertisement

ఏకాదశి తిధికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి ఏట 24 ఏకాదశులు వస్తాయి. అధికమాసం వచ్చింది కనుక మరో రెండు ఏకాదశులు వస్తాయి. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశులు ఒకే ఎత్తు అయితే, అధికమాసంలో వచ్చే పద్మిని ఏకాదశి మరో ఎత్తు అని చెప్పొచ్చు. దీనిని కమల ఏకాదశి అని కూడా అంటారు. మూడేళ్లకి ఒకసారి వచ్చే ఈ అరుదైన అతిథి భక్తులకు ఎంతో మంచి చేస్తుంది. శుభ ఫలితాలను అందిస్తుంది.

పద్మిని ఏకాదశి 2026

మూడేళ్ల తర్వాత అరుదైన యోగం.. పద్మిని ఏకాదశి వ్రత మహిమ, పూజా విధానం తెలుసుకోండి! (pinterest)
మూడేళ్ల తర్వాత అరుదైన యోగం.. పద్మిని ఏకాదశి వ్రత మహిమ, పూజా విధానం తెలుసుకోండి! (pinterest)

అధిక మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి నాడు విష్ణువుని, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన సుఖసంతోషాలను పొందవచ్చు. మీకున్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏకాదశి నాడు భక్తితో విష్ణువుని, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు కూడా చెబుతున్నాయి.

పద్మిని ఏకాదశి 2026 తేదీ, సమయం, ముహూర్తంతో పాటు ఏకాదశి ప్రత్యేకత, పూజా విధానం, దానధర్మాల గురించి కూడా పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పద్మిని ఏకాదశి 2026 ముహూర్తం

ఈ ఏడాది పద్మిని ఏకాదశి మే 26 తెల్లవారుజామున 5:10కి మొదలవుతుంది. మే 27 ఉదయం 6:21తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం చూసుకోవాలి కాబట్టి, మే 27 అంటే రేపు ఏకాదశిని జరుపుకోవాలి. తర్వాత రోజు అనగా మే 28న ఉపవాసాన్ని విరమించాలి. సరైన పద్ధతిలో భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన పూర్తి ఫలితం దక్కుతుంది.

ఏకాదశి ప్రత్యేకత

పద్మిని ఏకాదశి చాలా శక్తివంతమైన రోజు అని చెప్పొచ్చు. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ వ్రతం వరం కంటే తక్కువేమీ కాదు. పద్మిని ఏకాదశి వ్రతం చేయడం వలన తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ అధికమాసంలో చేసే జపం, తపం, దానం, వ్రతాలకు మామూలు రోజుల కంటే ఎక్కువ రెట్లు ఫలితం ఉంటుంది. ఏకాదశి రోజున విష్ణు కథలు విన్నా, చదివినా కూడా ఇంట్లో సుఖ శాంతులు కలుగుతాయి.

దానధర్మాల ప్రాముఖ్యత

ముందు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి.

పూజగదిని కూడా శుభ్రంగా ఉంచి, ఒక పీటపై పసుపు వస్త్రాన్ని వేయండి. దానిపై విష్ణువు, లక్ష్మీదేవి విగ్రహాలను పెట్టండి.

గంగాజలంతో అభిషేకం చేసి, అక్షింతలు, పసుపు రంగు పండ్లు, ఎర్రటి పువ్వులను విష్ణుకి, లక్ష్మీదేవికి సమర్పించండి.

ఈరోజు “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపించండి.

ధూప, దీప, నైవేద్యాలతో విష్ణువుని, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి, చివరిగా క్షమాపణ చేసుకోండి.

ఈ విధంగా పద్మిని ఏకాదశి పూజ చేయడం వలన కోరిన కోర్కెలు తీరుతాయి. ఇంట్లో ఉన్న ఇబ్బందులు అన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe