Saturn Combust: శని అస్తమయం, నాలుగు రాశులకు ఊహించని లాభాలు.. డబ్బు, అదృష్టం, సంతోషంతో పాటు ఎన్నో!

మార్చి 13న శని మీన రాశిలో అస్తమిస్తాడు. ఏప్రిల్ 22న శని మళ్లీ ఉదయిస్తాడు. శని అస్తమయం నుంచి ఉదయం వరకు కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. ఈ రాశుల వారు శని అస్తమయం సమయంలో విపరీతమైన లాభాలను పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశులకి  బాగా కలిసి రాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Mar 05, 2026 8:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతుంటాయి. శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులకు మంచి ఫలితాలు, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలు కలుగుతాయి. ప్రస్తుతం శని మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. 2027 వరకు శని ఇదే రాశిలో సంచారం చేస్తాడు.

Saturn Combust: శని అస్తమయం, నాలుగు రాశులకు ఊహించని లాభాలు
Saturn Combust: శని అస్తమయం, నాలుగు రాశులకు ఊహించని లాభాలు

మార్చి 13న శని మీన రాశిలో అస్తమిస్తాడు. ఏప్రిల్ 22న శని మళ్లీ ఉదయిస్తాడు. శని అస్తమయం నుంచి ఉదయం వరకు కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. ఈ రాశుల వారు శని అస్తమయం సమయంలో విపరీతమైన లాభాలను పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారికి శని అస్తమయంతో బాగా కలిసి రాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

శని అస్తమయంతో ఈ రాశుల వారికి అనేక లాభాలు.. ఆదాయం, అదృష్టం రెట్టింపు అవుతాయి

1.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి శని అస్తమయం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు శని అనుగ్రహంతో ఆనందంగా ఉంటారు. కష్టానికి తగ్గ ఫలితాలను చూస్తారు. అలాగే, ఈ సమయంలో ఈ రాశి వారు చేసిన ప్రయత్నాలకు తగ్గట్టుగా ఫలితాలను పొందుతారు. ఆర్థికపరంగా కూడా లాభాలు ఉంటాయి. ఇప్పటి వరకు రావాల్సిన అవకాశాలు మీ చేతికి వస్తాయి. విజయాన్ని అందుకుంటారు. పై అధికారుల సపోర్ట్ కూడా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది.

2.మేష రాశి

మేష రాశి వారికి శని అస్తమయం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఒత్తిడి తగ్గిపోతుంది. ఆనందంగా ఉంటారు. ఉద్యోగపరంగా బాగుంటుంది. వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త అవకాశాలను పొందుతారు. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి ఆనందం ఉంటుంది. కమ్యూనికేషన్, చదువు, కొత్త ఒప్పందాలలో పురోగతి కనబడుతుంది.

3.కన్య రాశి

కన్య రాశి వారికి కూడా శని అస్తమయం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో కన్య రాశి వారు అనేక విధాలుగా లాభాలు పొందుతారు. పెండింగ్‌లో ఉన్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పాత సమస్యలన్నీ తొలగిపోతాయి. పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కూడా ఇది శుభ సమయం. ఆనందం పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. బాధ్యతలు చేపడతారు.

4.మీన రాశి

మీన రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు పురోగతిని చూస్తారు. ప్రమోషన్లు వస్తాయి. మీ కలలు నెరవేరుతాయి. భవిష్యత్తులో కొత్త వ్యక్తులను కలుసుకుంటారు; వారి ద్వారా ప్రయోజనాలను పొందుతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. సమాజంలో పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కెరీర్‌లో చక్కటి మార్పులను చూస్తారు. ఇలా శని సంచారం కారణంగా ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More