సెప్టెంబర్ చివరి 15 రోజుల్లో ఈ 5 మూలాంకాలకు అదృష్టం.. డబ్బు, కెరీర్‌లో శుభ ఫలితాలు!
సెప్టెంబర్ నెలలో మిగిలిన చివరి 15 రోజులు మూలాంకాల ఆధారంగా కొందరికి కొత్త అవకాశాలు, కెరీర్ పురోగతి, ఆర్థిక ఊరట, వ్యాపార విజయాలను తీసుకురావచ్చని సంఖ్యాశాస్త్ర అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మూలాంకం 1, 2, 4, 7, 9 వారికి ఈ కాలం అనుకూలంగా ఉండొచ్చని పేర్కొంటున్నారు.
సెప్టెంబర్ నెల సగం గడిచిపోయింది. మిగిలిన ఈ పదిహేను రోజులు మన జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నాయనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. సంఖ్యాశాస్త్రం (Numerology) నిపుణుల అంచనాల ప్రకారం, రాబోయే రోజులు కొన్ని మూలాంకాల వారికి సువర్ణావకాశాలను తెచ్చిపెట్టనుండగా, మరికొందరు మాత్రం ప్రతి అడుగు చాలా ఆచితూచి వేయాల్సిన సమయం ఇది. కేవలం వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తత అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్ చివరి పక్షం రోజులు ఏ మూలాంకాలకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం.

ఈ 5 మూలాంకాల వారికి తిరుగులేదు!
1. మూలంకం 1:
ఈ సంఖ్యకు చెందిన వారికి సెప్టెంబర్ ఆఖరి రోజులు నూతన అవకాశాలను తెచ్చిపెడతాయి. వృత్తి జీవితంలో బాధ్యతలు పెరిగినప్పటికీ, మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులు మంచి పురోగతిని చూస్తారు. అయితే, మీదే పైచేయిగా ఉండాలనే ధోరణిని పక్కన పెట్టి, సహచరుల అభిప్రాయాలను కూడా గౌరవిస్తే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి.
2. మూలాంకం 2:
ఈ కాలంలో వీరికి ప్రతికూలతలు తొలగి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబంలో లేదా బంధువులతో గతంలో ఉన్న మనస్పర్థలు తొలిగిపోతాయి. వృత్తిరీత్యా తోటి ఉద్యోగుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. ఆర్థికంగా ఊరట లభించే అవకాశం ఉంది. అయితే, భావోద్వేగాలకు లోనై ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందడుగు వేయండి.
3. మూలాంకం 4:
సెప్టెంబర్ చివరి పదిహేను రోజులు వీరికి విశేషమైన లాభాలను అందిస్తాయి. నిలిచిపోయిన పాత ప్రణాళికలు మళ్లీ కార్యరూపం దాల్చుతాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది సరైన సమయం. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులను చేజిక్కించుకుంటారు. అయితే ఒకేసారి అన్ని పనులను భుజాన వేసుకోకుండా, ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయడం ఉత్తమం.
4. మూలాంకం 7:
ఈ సంఖ్య వారికి ఈ పక్షం రోజులు ఎంతో అనుకూలంగా సాగిపోతాయి. మీరు చేసే పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్యలకు ఇప్పుడు తెరపడుతుంది. కుటుంబంతో కలిసి అకస్మాత్తుగా విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. భవిష్యత్‌లో ఉపయోగపడే కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
5. మూలాంకం 9:
వీరికి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం ఇది. వ్యాపారంలో కీలకమైన డీల్స్ ఫైనల్ అవుతాయి. ఎక్కడో ఆగిపోయిన డబ్బు చేతికి అందడంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యక్తిగత సంబంధాలు మరింత బలపడతాయి.
ఈ 2 మూలాంకాల వారు చాలా అప్రమత్తంగా ఉండాలి
1. మూలాంకం 3:
సంఖ్యాశాస్త్ర నివేదికల ప్రకారం, ఈ మూలాంకం వారు రాబోయే రోజుల్లో కాస్త అప్రమత్తంగా ఉండటం అవసరం. ఒకేసారి అనేక పనులు చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి మొదట ప్రాధాన్యత ఉన్న పనులను పూర్తి చేయండి. ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మకుండా, మీ స్వంత విచక్షణతో నిర్ణయాలు తీసుకోండి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు.
2. మూలాంకం 6:
ఈ జాబితాలో ఉన్న మరో సంఖ్య ఇది. సెప్టెంబర్ ఆఖరి రోజుల్లో వీరు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వడం గానీ, తీసుకోవడం గానీ చేయకండి. అనవసర ఖర్చులకు చెక్ పెట్టండి. ఉద్యోగంలో ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే అన్ని కోణాలను పరిశీలించండి. బంధాల్లో దూరం పెరగకుండా స్పష్టమైన సంభాషణ ముఖ్యం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


