సెప్టెంబర్‌లో అరుదైన సౌభాగ్య యోగం.. ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్

గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు అన్ని రాశులపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య విశ్వాసం. సెప్టెంబర్ నెలలో మహాలక్ష్మి దేవి అనుగ్రహంతో సౌభాగ్య యోగం ఏర్పడబోతుండటంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. 

Published on: Aug 29, 2026, 16:00:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి శుభ ఫలితాలు కనిపిస్తే, ఒక్కోసారి అశుభ ఫలితాలను చూడాల్సి ఉంటుంది. మహాలక్ష్మి దేవి అనుగ్రహంతో ఏర్పడబోయే సౌభాగ్య యోగం చాలా శుభప్రదమైనది. సెప్టెంబర్ నెలలో ఈ అరుదైన యోగం ఏర్పడబోతోంది. దీంతో కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు కలగబోతున్నాయి. మరి ఈ అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

సెప్టెంబర్‌లో అరుదైన సౌభాగ్య యోగం.. ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్ (AI)
సెప్టెంబర్‌లో అరుదైన సౌభాగ్య యోగం.. ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్ (AI)

సెప్టెంబర్ నెలలో సౌభాగ్య యోగం.. ఈ రాశుల వారికి అనేక విధాలుగా ప్రయోజనాలు

1.మిథున రాశి

మిథున రాశి వారికి సెప్టెంబర్ నెల బాగా కలిసి రాబోతోంది. ఈ సౌభాగ్య యోగం చాలా అరుదుగా వస్తుంది. ఈ యోగం కారణంగా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కళలు, మీడియా, టెక్నాలజీ, రచన రంగాల్లో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది.

పెట్టుబడుల ద్వారా రెట్టింపు ఫలితాలను చూసే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల్లో మనస్పర్థలు తొలగిపోతాయి. సంతోషంగా ఉండొచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. బుధవారం నాడు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరిస్తే మంచిది. లేదా ఆకుపచ్చ వస్తువులను దానం చేస్తే కూడా మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంది.

2.కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ యోగం శుభ ఫలితాలను అందిస్తుంది. శుభ గ్రహాల వలన మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకునే వారికి కలిసి వస్తుంది.

పిల్లల నుంచి శుభవార్తలను వింటారు. పిల్లల విషయంలో గర్వపడతారు. శుభకార్యాలు జరుగుతాయి. అలాగే బుధవారం నాడు కన్యా రాశి వారు ఆవుకు ఆకుకూరలను తినిపిస్తే శుభ ఫలితాలు కనిపిస్తాయి.

3.తులా రాశి

తులా రాశి వారికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పచ్చు. మహాలక్ష్మి దయతో కోటీశ్వరులు అవుతారు. సౌభాగ్య యోగం, శుభగ్రహాల బలం పెరగడంతో మీ కలలు కూడా నెరవేరుతాయి. వ్యాపారస్తులు కూడా మంచి మార్పులను చూస్తారు.

కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. లగ్జరీ వాహనాలను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. సమస్యలు తొలగిపోయి కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. పెళ్లి కాని వారికి శుభవార్తలు అందుతాయి. మహాలక్ష్మి అమ్మవారికి తులా రాశి వారు తామర పువ్వులను సమర్పిస్తే మంచిది.

4.వృషభ రాశి

వృషభ రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. ఈ రాశి వారు సౌభాగ్య యోగంతో మంచి మార్పులను చూస్తారు. నిలిచిపోయిన డబ్బు ఈ రాశి వారి చేతికి అందుతుంది. స్టాక్ మార్కెట్‌లో ఊహించని లాభాలను పొందుతారు.

ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కుటుంబంతో పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. శుక్రవారం నాడు మహాలక్ష్మి ఆలయానికి వెళ్తే శుభ ఫలితాలు కనిపిస్తాయి. వీలైతే నెయ్యి దీపాన్ని కూడా వెలిగించండి. మంచి మార్పులను చూడొచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More